Good News: ఐటీ ఉద్యోగులకు డబుల్ ధమాకా... భారీగా పెరగనున్న జీతాలు

Good News | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్ లాంటి సాంకేతిక నైపుణ్యాలు ఉన్నవారికి 20% వేతనాలు పెరగొచ్చని ఆ సంస్థల అభిప్రాయం. ఐటీ రంగంలో ఈ ఏడాది వృద్ధి కారణంగా వేతనాల పెంపు ఎక్కువగానే ఉంటుందన్నది వీరి అంచనా.

news18-telugu
Updated: February 17, 2019, 8:59 AM IST
Good News: ఐటీ ఉద్యోగులకు డబుల్ ధమాకా... భారీగా పెరగనున్న జీతాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీరు ఐటీ రంగంలో పనిచేస్తున్నారా? లేక ఐటీ సెక్టార్‌లో కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఐటీ సెక్టార్‌లో వార్షిక వేతనాల పెంపు గతేడాదితో పోలిస్తే భారీగా ఉండబోతోందని, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ సెగ్మెంట్ల కారణంగా ఐటీ రంగంలో డిమాండ్ కూడా పెరుగుతోందని ఇండస్ట్రీ అసోసియేషన్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(Nasscom) అభిప్రాయ పడుతోంది. గతేడాది ఐటీ రంగంలో 6-8% మాత్రమే ఉండగా... ఈసారి డబుల్ డిజిట్ ఖాయమన్నది నాస్‌కామ్ అభిప్రాయం.

Read this: PUBG Prize: పబ్‌జీ చూసి రూ.21,990 విలువైన ఒప్పో ఎఫ్9 ప్రో గెలుచుకోండి

software jobs, it jobs, it career, nasscom, IT jobs salary, IT sector, software career, it jobs increments, సాఫ్ట్‌వేర్ జాబ్స్, ఐటీ జాబ్స్, ఐటీ కెరీర్, నాస్‌కామ్, ఐటీ సెక్టార్, సాఫ్ట్‌వేర్ కెరీర్, ఐటీ జాబ్స్ ఇంక్రిమెంట్స్, ఐటీ జాబ్స్ సాలరీ

ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం ఈ ఏడాది 8-10% మధ్య జీతాల పెంపు ఉంటుందని అంచనా. ఐటీ సెక్టార్‌లో వేతనాల పెంపు 10% ఉంటుందని ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఏఓఎన్, హ్యూమన్ రీసోర్సెస్ కన్సల్టింగ్ సంస్థ మెర్సర్ చెబుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్ లాంటి సాంకేతిక నైపుణ్యాలు ఉన్నవారికి 20% వేతనాలు పెరగొచ్చని ఆ సంస్థల అభిప్రాయం. ఐటీ రంగంలో ఈ ఏడాది వృద్ధి కారణంగా వేతనాల పెంపు ఎక్కువగానే ఉంటుందన్నది వీరి అంచనా.

Read this: Good News: జీమెయిల్‌లో రైట్ క్లిక్ చేస్తే... సరికొత్త ఆప్షన్లు

software jobs, it jobs, it career, nasscom, IT jobs salary, IT sector, software career, it jobs increments, సాఫ్ట్‌వేర్ జాబ్స్, ఐటీ జాబ్స్, ఐటీ కెరీర్, నాస్‌కామ్, ఐటీ సెక్టార్, సాఫ్ట్‌వేర్ కెరీర్, ఐటీ జాబ్స్ ఇంక్రిమెంట్స్, ఐటీ జాబ్స్ సాలరీ

ఐటీ రంగంలో జీతాల పెంపు ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు... కొత్త ఉద్యోగుల నియామకాలు కూడా పెరుగుతాయని నాస్‌కామ్ చెబుతోంది. 2017-18లో చాలా కంపెనీలు నియామకాలను హోల్డ్‌లో పెట్టడం వల్ల డిమాండ్ తగ్గిందని, ఈ ఏడాది నియామకాల ప్రక్రియ పుంజుకుంటుందని నాస్‌కామ్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా చెబుతున్నారు. ఇన్ఫోసిస్ 2017-18లో 44,000 మందిని మాత్రమే నియమించుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 9 నెలల్లో 55,000 మందిని నియమించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో మార్చి వరకు 2,04,100 మందిని నియమించుకుంటే, 2018 డిసెంబర్ వరకు 2,25,500 మందిని నియమించుకున్నారు.Read this: మహిళా ఉద్యోగుల కోసం ఐసీఐసీఐ ప్రత్యేక అకౌంట్... ఫీచర్లు ఇవే

software jobs, it jobs, it career, nasscom, IT jobs salary, IT sector, software career, it jobs increments, సాఫ్ట్‌వేర్ జాబ్స్, ఐటీ జాబ్స్, ఐటీ కెరీర్, నాస్‌కామ్, ఐటీ సెక్టార్, సాఫ్ట్‌వేర్ కెరీర్, ఐటీ జాబ్స్ ఇంక్రిమెంట్స్, ఐటీ జాబ్స్ సాలరీ

ఐటీ రంగంలో నియామకాలు పెరుగుతున్నాయని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఏఐ, మెషీన్ లెర్నింగ్ లాంటి సరికొత్త స్కిల్స్ నేర్చుకునేందుకు ఇంజనీర్లు, ఇంజీనిరింగ్ విద్యార్థులు కష్టపడుతున్నారని, ఇంజనీరింగ్ టాలెంట్ విషయంలో భారతదేశం పవర్‌హౌజ్‌గా మారిందని, క్వాలిఫైడ్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోందని ఏఎండీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ జే హీరేమత్ అభిప్రాయపడ్డారు.

Fake Apps: మీరు వాడే యాప్ ఒరిజినలా? ఫేకా? ఈ 10 టిప్స్ మీకోసమే

ఇవి కూడా చదవండి:

IRCTC APP: ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌‌తో ఉపయోగాలు ఇవే...

PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి

LIC Renewal: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? ఇలా రెన్యువల్ చేయొచ్చు
First published: February 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading