Good News: కేబుల్ టీవీ యూజర్లకు శుభవార్త... రూ.130 చెల్లిస్తే 150 ఛానెళ్లు

రూ.130 తీసుకొని యూజర్లకు 100 ఛానెళ్లు ప్రొవైడ్ చేయాలని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI షరతు విధించింది. ఇందులో ఫ్రీ టూ ఎయిర్ ఛానెళ్లతో పాటు పెయిడ్ ఛానెళ్లు కూడా ఉంటాయి.

news18-telugu
Updated: October 4, 2019, 6:16 PM IST
Good News: కేబుల్ టీవీ యూజర్లకు శుభవార్త... రూ.130 చెల్లిస్తే 150 ఛానెళ్లు
Good News: కేబుల్ టీవీ యూజర్లకు శుభవార్త... రూ.130 చెల్లిస్తే 150 ఛానెళ్లు
  • Share this:
కేబుల్ టీవీ యూజర్లకు ఇది అతిపెద్ద శుభవార్త. కేవలం నెలకు రూ.130 చెల్లిస్తే చాలు 150 ఛానెళ్లు వీక్షించొచ్చు. కేబుల్ టీవీ ప్రొవైడర్ల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.130 నెట్వర్క్ కెపాసిటీ ఫీజు వసూలు చేస్తున్నారు కేబుల్ టీవీ ప్రొవైడర్లు. భారతదేశంలో 80% కేబుల్ యూజర్లకు ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్-AIDCF సేవలు అందిస్తోంది. హాత్‌వే డిజిటల్, ఇన్‌డిజిటల్, సిటీ నెట్వర్క్స్, జీటీపీఎల్ హాత్‌వే, ఫాస్ట్‌వే ట్రాన్స్‌మిషన్, డీఈఎన్ నెట్వర్క్స్, యూసీఎన్ కేబుల్, ఆర్టెల్ కమ్యూనికేషన్స్, ఐసీఎన్‌సీఎల్, ఏషియానెట్ డిజిటల్, కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ ఏఐడీసీఎఫ్‌లో సభ్యులు. మా సభ్యులందరూ చర్చించుకొని రూ.130 నెట్వర్క్ కెపాసిటీ ఫీజుతో సబ్‌స్క్రైబర్లకు 150 ఎస్‌డీ ఛానెళ్లు ఇచ్చేందుకు నిర్ణయించారు అని AIDCF అధ్యక్షుడు ఎస్ఎన్ శర్మ తెలిపారు. అయితే ఈ నిర్ణయానికి ట్రాయ్ ఆమోదం ఉందా లేదా అన్న స్పష్టత రావాల్సి ఉంది.

రూ.130 తీసుకొని యూజర్లకు 100 ఛానెళ్లు ప్రొవైడ్ చేయాలని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI షరతు విధించింది. ఇందులో ఫ్రీ టూ ఎయిర్ ఛానెళ్లతో పాటు పెయిడ్ ఛానెళ్లు కూడా ఉంటాయి. యూజర్లు రూ.130+జీఎస్టీ చెల్లిస్తే చాలు. ఒకవేళ 25 ఛానెళ్లు ఎక్కువ కావాలనుకుంటే రూ.20 చొప్పున చెల్లించాలి. అంటే ఒకవేళ 150 ఛానెళ్లు కావాలంటే రూ.40 అదనంగా చెల్లించాలి. కానీ రూ.130 కేబుల్ బిల్లుకే ఏకంగా 150 ఛానెళ్లు ఇచ్చేందుకు డిజిటల్ మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్(MSOs)కు అనుబంధంగా పనిచేస్తున్న ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్-AIDCF నిర్ణయించింది. ట్రాయ్ కొత్త నిబంధనల్ని అమలు చేసిన తర్వాత 25% మంది డీటీహెచ్ యూజర్లు కేబుల్ కనెక్షన్లు తొలగించి నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీ సర్వీసుల్ని సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో టైమ్ డిపాజిట్ అకౌంట్‌... లాభాలేంటో తెలుసా?

IRCTC: పండుగకు ఊరెళ్తున్నారా? ఈ టెక్నిక్‌తో రైలు టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువCredit Card: క్రెడిట్ కార్డ్ ఉందా? లిమిట్ పెంచుకోండి ఇలా
First published: October 4, 2019, 6:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading