BSNL: వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు, ఆన్లైన్ క్లాసుల విద్యార్థులకు శుభవార్త.. బీఎస్ఎన్ఎల్ నుంచి సూపర్ ప్లాన్లు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

మంచి ఆదరణ పొందిన భారత్​ ఎయిర్​ ఫైబర్​ సర్వీసుల్లో రెండు కొత్త ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లను తీసుకువచ్చింది బీఎస్​ఎన్​ఎల్​ సంస్థ. ఎయిర్‌ఫైబర్ అల్ట్రా, ఎయిర్ ఫైబర్ అల్ట్రా ప్లస్ పేరుతో ప్రారంభించిన ఈ ప్లాన్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
కరోనా మహమ్మారి కారణంగా వర్క్​ ఫ్రం హోమ్​, ఆన్​లైన్​ క్లాసులకు ప్రాధాన్యత పెరగడంతో మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్​ ఆవశ్యకత ఏర్పడింది. అయితే జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్​ వంటి ప్రైవేటు టెల్కో సంస్థలు యూజర్​ బేస్​ ఎక్కువగా ఉండే అర్భన్​ ప్రాంతాల్లోనే సేవలను విస్తరిస్తున్నాయి. దీంతో మారుమూల గ్రామీణ ప్రజలు ఇంటర్నెట్​కు దూరమవుతున్నారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఇటీవల భారత్ ఎయిర్ ఫైబర్ సర్వీసులను ప్రారంభించింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్, వాయిస్, IPTV సేవలను అందిస్తుంది. ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు రేడియో ఆధారిత సిగ్నల్స్​ ఆధారంగా వైర్​లెస్​ విధానంలో పనిచేస్తాయి. ఇది వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు కాస్త భిన్నంగా ఉంటుంది. అందుకే గ్రామీణ ప్రాంత ప్రజలకు త్వరగా చేరువైంది.
Best Recharge Plans Under Rs 100: రూ. 100లోపే డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్.. Jio, Airtel, Vi అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే
Best 5G Phones Under Rs 20000: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే, రూ. 20 వేల లోపు లభించే ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి

మంచి ఆదరణ పొందిన ఈ భారత్​ ఎయిర్​ ఫైబర్​ సర్వీసుల్లో రెండు కొత్త ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది బీఎస్​ఎన్​ఎల్​ సంస్థ. ఎయిర్‌ఫైబర్ అల్ట్రా, ఎయిర్ ఫైబర్ అల్ట్రా ప్లస్ పేరుతో ప్రారంభించిన ఈ ప్లాన్లు అపరిమిత వాయిస్​ కాలింగ్​ను అందిస్తాయి. వీటి ద్వారా గరిష్టంగా 80Mbps ఇంటర్నెట్​ స్వీడ్​తో పాటు ఒక ఫ్రీ స్టాటిక్ IP అడ్రస్​ను కూడా పొందవచ్చు.ఇవి వరుసగా రూ .2995, రూ .6995 ధర వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ రెండు ప్లాన్ల కింద వరుసగా 5000GB, 7500GB FUP డాటా లభిస్తుంది. FUP డేటా లిమిట్​ను చేరుకున్న తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ వరుసగా 15 Mbps, 25 Mbps కి పడిపోతుంది.

వినియోగదారులు ఈ ప్లాన్లకు 12 నెలల ప్రీమియం ఒకేసారి చెల్లిస్తే ఒక నెల పాటు ఉచిత సేవలు అందిస్తారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో బీఎస్ఎన్ఎల్ 30Mbps నుంచి 70Mbps వేగంతో రెండు కొత్త ఎయిర్ ఫైబర్ ప్లాన్లను ప్రారంభించింది. ఈ ప్లాన్లు రూ .499 నుంచి ప్రారంభమవుతాయి. 3300GB డేటా వరకు 30 Mbps డౌన్‌లోడ్ స్పీడ్​ అందిస్తాయి. బీఎస్​ఎన్​ఎల్​ ఎయిర్‌ఫైబర్ ప్లాన్లపై ఓలుక్కేద్దాం.

బీఎస్​ఎన్​ఎల్​ ఎయిర్​ ఫైబర్ ప్లాన్లు..
బీఎస్​ఎన్​ఎల్ ఎయిర్​ఫైబర్​ బేసిక్ ప్లాన్(BSNL AirFibre Basic Plan at Rs 499)
ఈ ప్లాన్ రూ .499 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్​ కింద గరిష్టంగా 3300GB వరకు 30Mbps డౌన్‌లోడ్ స్పీడ్​తో బ్రౌజింగ్​ చేయవచ్చు. ఈ డేటా లిమిట్​ పూర్తయిన తర్వాత డేటా స్పీడ్​ 2Mbps కి పడిపోతుంది. ఇది అపరిమిత వాయిస్​ కాలింగ్‌తో వస్తుంది.

బీఎస్​ఎన్​ఎల్​ ఎయిర్​ఫైబర్​ బేసిక్ ప్లస్ ప్లాన్(BSNL AirFibre Basic Plus Plan at Rs 699)
ఈ ప్లాన్​కు ప్రతినెలా రూ. 699 ఖర్చవుతుంది. ఈ ప్లాన్ ద్వారా గరిష్టంగా 3300 జీబీ వరకు 40Mbps స్పీడ్​తో బ్రౌజింగ్​ చేయవచ్చు.ఆ తర్వాత బ్రౌజింగ్​ స్పీడ్​ 4Mbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్ కింద అపరిమిత వాయిస్​ కాలింగ్ కూడా అందిస్తుంది.

బీఎస్​ఎన్​ఎల్​ ఎయిర్‌ఫైబర్ వాల్యూ ప్లాన్(BSNL AirFibre Value Plan at Rs 899)
ఈ ప్లాన్​కు నెలకు రూ .899 ఖర్చవుతుంది. దీని కింద గరిష్టంగా 3300GB డేటాను 50Mbps వేగంతో వాడుకోవచ్చు. లిమిట్​ పూర్తయ్యాక డేటా స్పీడ్​ 6 Mbpsకి పడిపోతుంది.

బీఎస్​ఎన్​ఎల్​ ఎయిర్‌ఫైబర్ ప్రీమియం ప్లాన్(BSNL AirFibre Premium Plan at Rs 1199)
ఈ ప్లాన్​కు ప్రతి నెలా రూ .1199 ఖర్చవుతుంది. ఈ ప్రీమియం ప్లాన్ కింద 70Mbps వేగంతో 3300GB డేటాను ఉపయోగించుకోవచ్చు. డేటా లిమిట్​ పూర్తయ్యాక స్పీడ్​ 10Mbpsకి పడిపోతుంది.
Published by:Nikhil Kumar S
First published: