TikTok and PUBG app | విద్యార్థులు టిక్ టాక్, పబ్జీ యాప్స్‌ను తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోకుండా చూడాలంటూ అన్ని పాఠశాలలకు గోవా విద్యాశాఖ డైరెక్టర్ సర్క్యులర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గోవా అసెంబ్లీ ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ వెల్లడించారు.
చిన్నారుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న టిక్‌టాక్, పబ్జీలను నిషేధించాలన్న డిమాండ్ మరింత బలంపుంజుకుంటోంది. తాజాగా గోవా ప్రభుత్వం టిక్ టాక్, పబ్జీలకు వ్యతిరేకంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గోవాలోని స్కూల్స్‌లో చదువుకుంటున్న విద్యార్థులు టిక్ టాక్, పబ్జీలను డౌన్లోడ్ చేసుకోకుండా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ అన్ని స్కూల్స్‌కు సర్క్యులర్ జారీ చేసినట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ గోవా అసెంబ్లీలో సోమవారం వెల్లడించారు.
పబ్జీ గేమ్ (Image : Twitter)
కాంగ్రెస్ ఎమ్మేల్యే రవినాయక్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సీఎం ప్రమోద్ సావంత్ సమాధానమిస్తూ టిక్‌టాక్, పబ్జీలకు సంబంధించి విద్యాశాఖ డైరెక్టర్ అన్ని పాఠశాలలకు ఓ సర్య్కులర్ జారీ చేయించామని తెలిపారు. ఈ సర్య్కులర్ మేరకు పిల్లల తల్లిదండ్రులు, వారి సంరక్షకులు టిక్ టాక్, పబ్జీ గేమ్ ద్వారా ఏర్పడే అనర్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటిపై సరైన అవగాహన కల్పించి వాటి పట్ల విద్యార్థులు ఆకర్షితులు కాకుండా చూడాలని పేర్కొన్నారు. టిక్‌టాక్, పబ్జీ వంటివి విద్యార్థుల భద్రతకు ముప్పువాటిళ్ల చేస్తాయని అందులో హెచ్చరించారు.
మే మాసంలో టిక్ టాక్‌పై మద్రాస్ హైకోర్టు నిషేధం విధించగా...ఆ తర్వాత నిషేధాన్ని ఎత్తివేసింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.