ఇండియాలో జీమెయిల్‌ డౌన్... కారణమేంటీ?

ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్‌లో "Error 404" స్టాండర్డ్ ఎర్రర్. మీ రిక్వెస్ట్ సరైన సర్వర్‌కే వెళ్లిందని, కాకపోతే సర్వర్‌కు మీరు కోరుకున్న సమాచారం దొరకలేదన్నది "Error 404" సారాంశం.

news18-telugu
Updated: January 30, 2019, 12:26 PM IST
ఇండియాలో జీమెయిల్‌ డౌన్... కారణమేంటీ?
ఇండియాలో జీమెయిల్‌ డౌన్... కారణమేంటీ?
  • Share this:
మీరు జీమెయిల్ వాడుతున్నారా? మంగళవారం రోజు జీమెయిల్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారా? "Error 404" మెసేజ్ కనిపించిందా? మీకు మాత్రమే కాదు ఇండియాలో, యూరప్‌లో చాలామందికి ఇదే ఎర్రర్ కనిపించింది. Downdetector.com ప్రకారం మంగళవారం సాయంత్రం 4:46 గంటల సమయంలో జీమెయిల్‌లో సమస్యలు తలెత్తాయి. ఇండియాలో, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో జీమెయిల్ యూజర్లకు "Error 404" మెసేజ్ కనిపించింది."Error 404" మెసేజ్‌పై వేలాదిమంది జీమెయిల్ యూజర్లు వరుసగా కంప్లైంట్లు కూడా చేశారు. లాగిన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నట్టు 42 శాతం మంది చెబితే, తమకు ఎలాంటి మెసేజ్‌లు రాలేదని 31 శాతం మంది, వెబ్‌సైట్‌లో సమస్య ఉందని 25 శాతం మంది చెప్పారు. ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్‌లో "Error 404" స్టాండర్డ్ ఎర్రర్. మీ రిక్వెస్ట్ సరైన సర్వర్‌కే వెళ్లిందని, కాకపోతే సర్వర్‌కు మీరు కోరుకున్న సమాచారం దొరకలేదన్నది "Error 404" సారాంశం. మరి ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందో గూగుల్ చెప్పాల్సి ఉంది.
Photos: మహాత్మాగాంధీ వర్ధంతి... మీరు చూడని జాతిపిత అరుదైన 100 చిత్రాలు ఇవే...

ఇవి కూడా చదవండి:

Will you marry me?: వాయిస్ అసిస్టెంట్‌కు యూజర్ల ప్రశ్నలు... గూగుల్ ఫన్నీ రిప్లై

Facebook Tips: మీ ఫేస్‌బుక్‌లో చేయకూడని 9 అంశాలివే...

Alert: కేవైసీ పూర్తి కాలేదా? మీ ఇ-వ్యాలెట్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త
First published: January 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...