హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Gmail Go: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... జీమెయిల్ గో యాప్ మీరూ డౌన్‌లోడ్ చేయొచ్చు

Gmail Go: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... జీమెయిల్ గో యాప్ మీరూ డౌన్‌లోడ్ చేయొచ్చు

Gmail Go: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... జీమెయిల్ గో యాప్ మీరూ డౌన్‌లోడ్ చేయొచ్చు ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Gmail Go: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... జీమెయిల్ గో యాప్ మీరూ డౌన్‌లోడ్ చేయొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Gmail Go | మీ స్మార్ట్‌ఫోన్‌లో స్పేస్ సరిపోవట్లేదా? యాప్స్ ఎక్కువ స్పేస్ వాడేస్తున్నాయా? అయితే జీమెయిల్ గో యాప్ డౌన్‌లోడ్ చేయండి. ఇది ఒరిజినల్ జీమెయిల్‌కు లైటర్ వర్షన్.

|ప్రపంచంలో అందరి స్మార్ట్ ఫోన్లలో భాగమై ఉంది గూగుల్. ఎందుకంటే ఏది కావాలన్నా ఇందులోనే చెక్ చేసుకోవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త వర్షన్లు, అనువర్తనాలను విడుదల చేస్తూ వినియోగదారుల మన్ననలు అందుకుంటోందీ సంస్థ. తాజాగా జీ-మెయిల్ గో యాప్ ను ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రారంభంలో కేవలం ఆండ్రాయిడ్ గో ఆధారంగా గో ఉన్నవారికే గో సూట్ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశమిచ్చింది. ఆండ్రాయిడ్ గో అంటే లైట్ వెట్ తో ఉండి బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేకంగా రూపొందించి లైట్ రిసోర్స్ వర్షన్. ఈ నేపథ్యంలో జీ-మెయిల్ గో అన్ని బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంటుంది.

జీమెయిల్ మాదిరే..


ఇప్పటికే గూగుల్ సంస్థ తన గో యాప్స్ అయిన గూగుల్ గో, గ్యాలరీ గో, గూగుల్ మ్యాప్స్ గో ఆండ్రాయిడ్ యూజర్లందరూ వినియోగించుకునే అవకాశమిచ్చింది. తాజాగా జీ-మెయిల్ గో కూడా ఈ జాబితాలో చేరింది. అయితే గూగుల్ అసిస్టెంట్ గో, యూట్యూబ్ గో లాంటి యాప్స్ ను ఇంకా అందరికి అందుబాటులోకి తీసుకురాలేదు. జీమెయిల్ గో యాప్ దాదాపు రెగ్యూలర్ జీమెయిల్ యాప్ మాదిరే ఉంటుంది. యూజర్ ఇంటర్ ఫేస్‌లో మాత్రం కొన్ని కీలక మార్పులు ఉన్నాయి. ఇలాంటి యాప్స్‌లో కోర్ మార్పుల ఫ్రేమ్ వర్క్ దిగువన ఉంటాయి. ఇవి తక్కువ బఫర్ మెమొరీతో సజావుగా నడపడానికి ఇక్కడ రూపొందించారు. ఈ బఫర్ మెమొరీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ల కోసం రూపొందించిన అనువర్తనాల ముఖ్య ప్రమాణం.

Google Pixel 4a: అక్టోబర్ 16న గూగుల్ పిక్సెల్ 4ఏ ఫస్ట్ సేల్... ధర ఎంతంటే

AirPods Free: ఈ స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి రూ.14,900 విలువైన ఎయిర్‌పాడ్స్ ఉచితం

రెండింటిలో లోగోనే తేడా..


ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం రూపొందించిన ఈ జీమెయిల్ గో, సాధారణ జీమెయిల్ యాప్ లో ప్రధాన తేడా లోగోలే. అంతేకాకుండా జీమెయిల్ యాప్ కూడా గూగుల్ మీట్ వీడియో కాన్ఫరెన్స్ సేవల కలిసి రాదు. అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్ లో కేవలం 9.9 ఎంబీ పరిమాణంలోనే ఉంటుంది. అంటే చాలా సాధారణ జీమెయిల్ యాప్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల బడ్జెట్ ఫోన్ వినియోగదారుల ఇంటర్నెట్ కనెక్షన్ నెమ్మదిగా లేదా పరిమితంగా ఉన్నా సరిపోతుంది.

గూగుల్ సంస్థ ప్రకారం గూగుల్ గో యాప్ కూడా ఎంతో లైట్ గా ఉండి వేగంగా పనిచేస్తుంది. ఏదైనా సెర్చ్ చేస్తే 40 శాతం డేటాను ఆదా చేసే ఆప్టిమైజ్ చేశారు. ఆండ్రాయిడ్ గో ఎకోసిస్టమ్ ను మొదటగా 2018లో ప్రవేశపెట్టారు. గత నెల ప్రారంభంలో గూగుల్ సంస్థ.. 11-బేస్డ్ ఆండ్రాయిడ్ గో వర్షన్ ను విడుదల చేసింది. ఇది వేగంగా యాప్ లోడ్ సమయాన్ని, గోప్యతను మెరుగుపరుస్తుందని గూగుల్ తెలిపింది.

First published:

Tags: Android 10, GMAIL, Google, Playstore

ఉత్తమ కథలు