news18-telugu
Updated: December 13, 2019, 6:18 PM IST
Gmail: జీమెయిల్లో ఈ 5 అద్భుతమైన ఫీచర్స్ ట్రై చేశారా
(ప్రతీకాత్మక చిత్రం)
మీరు జీమెయిల్ అకౌంట్ వాడుతున్నారా? తరచూ మెయిల్స్ పంపిస్తుంటారా? జీమెయిల్లో అద్భుతమైన ఫీచర్స్ చాలా ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం మొదలైన జీమెయిల్ సర్వీస్‌ను ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది వాడుతుంటారని అంచనా. జీమెయిల్లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను యూజర్లకు అందిస్తోంది గూగుల్. వాటి గురించి తెలుసుకుంటే మీరు జీమెయిల్‌ను ఇంకా సమర్థవంతంగా వాడుకోవచ్చు. షెడ్యూల్ మెయిల్, సెల్ఫ్ డిస్ట్రక్ట్ మెయిల్, అన్‌సెండ్ మెయిల్స్, జీమెయిల్ ఆఫ్‌లైన్ ఇలా అనేక ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయి. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి.
1. Schedule mail: ఈ ఫీచర్ ద్వారా మీరు ఏ సమయంలో మెయిల్ పంపాలంటే ఆ సమయానికే మెయిల్ చేయొచ్చు. ఇందుకోసం టైమ్ సెట్ చేసుకోవాలి. ఇలా 100 మెయిల్స్ వరకు షెడ్యూల్ చేయొచ్చు. జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత compose పైన క్లిక్ చేయాలి. మెయిల్ క్రియేట్ చేసిన తర్వాత send బటన్ పక్కన మరిన్ని ఆప్షన్స్ ఉంటాయి. అందులో షెడ్యూల్ చేసుకోవచ్చు. మీరు షెడ్యూల్ చేసిన మెయిల్స్‌ని కూడా డిలిట్ చేయొచ్చు.
2. Self-destruct mail: మీరు పంపిన మెయిల్ కొంతసమయం వరకే ఉండాలనుకుంటే ఈ ఫీచర్ వాడుకోవచ్చు. ఇందులో మీరు ఒక రోజు నుంచి ఐదేళ్ల వరకు షెడ్యూల్ చేయొచ్చు. మీరు సూచించిన సమయం తర్వాత ఆ మెయిల్ మాయమైపోతుంది. compose పైన క్లిక్ చేసిన తర్వాత క్లాక్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. అందులో మీరు ఎంత సమయో వెల్లడించాలి.
3. Unsend mails: ఈ ఫీచర్ ద్వారా మీరు పంపిన మెయిల్‌ని క్యాన్సిల్ చేయొచ్చు. అది కొంత సమయం మాత్రమే. ఉదాహరణకు మీరు మెయిల్ పంపగానే మీకు Undo, view message అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. Undo క్లిక్ చేస్తే మళ్లీ కంపోజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు పంపిన మెయిల్ వెళ్లదు. జీమెయిల్ సెట్టింగ్స్‌లో ఈ సమయాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 5, 10, 20, 30 సెకండ్లు మాత్రమే ఎంచుకోవచ్చు.
4. Gmail offline: ఇంటర్నెట్ లేకపోయినా జీమెయిల్ మెసేజెస్ చదవడానికి ఉపయోగపడే ఫీచర్ ఇది. ఈ ఫీచర్ ఉపయోగించాలంటే మీ సిస్టమ్‌లో గూగుల్ క్రోమ్ ఉండాలి. జీమెయిల్ ఆఫ్‌లైన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి enable offline mail పైన క్లిక్ చేయాలి. ఎన్ని రోజుల మెసేజెస్ కావాలంటే అన్ని సింక్ చేసుకోవచ్చు.
5. Gmailify: మీ నాన్ జీమెయిల్ అకౌంట్లో కూడా మీరు జీమెయిల్ ఫీచర్స్ వాడుకోవచ్చు. ఇందుకోసం మీ అకౌంట్‌ని జీమెయిల్‌కు లింక్ చేయాలి. ఆ తర్వాత జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో ఆ ఫీచర్స్ అన్నీ కనిపిస్తాయి. టాప్ రైట్లో సెట్టింగ్స్ క్లిక్ చేసి మీ నాన్ జీమెయిల్ అకౌంట్‌ని లింక్ చేయాల్సి ఉంటుంది.
నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
IRCTC Rail Connect: ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ కొత్త ఫీచర్స్ ఇవే
WhatsApp: మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? వాట్సప్‌ని ఇలా కాపాడుకోండి
Airtel Idea New Plans: ఎయిర్టెల్, ఐడియా లేటెస్ట్ ప్లాన్స్, బెనిఫిట్స్ తెలుసుకోండి
Published by:
Santhosh Kumar S
First published:
December 13, 2019, 6:18 PM IST