Gmail down: ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ డౌన్... ఏం జరిగిందంటే

Gmail down | ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ డౌన్ అయింది. అనేకమంది యూజర్లు మెయిల్స్ పంపలేకపోతున్నారు.

news18-telugu
Updated: August 20, 2020, 1:04 PM IST
Gmail down: ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ డౌన్... ఏం జరిగిందంటే
Gmail down: ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ డౌన్... ఏం జరిగిందంటే
  • Share this:
మీరు జీమెయిల్ వాడుతున్నారా? మెయిల్స్ పంపుతున్నారా? అసలు ఇప్పుడు మీకు మెయిల్స్ పంపడం సాధ్యమవుతోంది? ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ డౌన్ అయింది. మెయిల్స్ పంపడంలో లక్షలాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెయిల్స్ పంపలేకపోతున్నామని, ఫైల్ట్స్ ఎటాచ్ చేయలేకపోతున్నామని కంప్లైంట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది యూజర్లకు ఇదే సమస్య. మెయిల్ పంపుతుంటే ఎర్రర్ వస్తోందని, ఎటాచ్‌మెంట్ అప్‌లోడ్ కావట్లేదని ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు. దీనిపై గూగుల్‌కు కూడా కంప్లైంట్ చేశారు. జీమెయిల్‌లో సమస్యలు ఉన్నట్టు తమకు కంప్లైంట్స్ వచ్చాయని గూగుల్ కూడా కన్ఫామ్ చేసింది. దీనిపై విచారణ జరుపుతున్నామని, త్వరలో మరింత సమాచారాన్ని వెల్లడిస్తామని గూగుల్ క్లారిటీ ఇచ్చింది.

Samsung Galaxy M31s: సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్

Redmi 9: షావోమీ నుంచి మరో కొత్త ఫోన్... రెడ్‌మీ 9 వచ్చేస్తోంది

జీమెయిల్ మాత్రమే కాదు... ఇతర జీసూట్ సర్వీసులైన గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్‌లో కూడా సమస్యలు ఉన్నాయని యూజర్స్ కంప్లైంట్ చేశారు. అయితే ఎక్కువగా జీమెయిల్ యూజర్లకు ఈ సమస్యలు వచ్చాయి. గూగుల్ డ్రైవ్‌లోని ఫైల్స్ షేర్ చేస్తే ఎర్రర్ వస్తోంది. అంతేకాదు గూగుల్ డ్రైవ్‌లోకి ఫైల్స్ అప్‌లోడ్ కావట్లేదు. ఈ సమస్యలన్నింటిపై గూగుల్ ఇంజనీరింగ్ టీమ్ దృష్టిపెట్టింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తోంది. అయితే యూజర్లు #Gmaildown హ్యాష్ ట్యాగ్‌తో కామెంట్స్, మీమ్స్ అప్‌లోడ్ చేస్తున్నారు.
Published by: Santhosh Kumar S
First published: August 20, 2020, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading