Video: 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్‌'లో రెచ్చిపోతున్న అమ్మాయిలు

#BottleCapChallenge | మంచి ఫిట్‌నెస్ ఉంటే తప్ప ఈ ఛాలెంజ్‌లో సక్సెస్ కావడం కష్టం. అందుకే జిమ్‌లో వర్కవుట్స్ చేసేవారంతా ఈ ఛాలెంజ్ స్వీకరించి మరీ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి సత్తాచాటుతున్నారు.

news18-telugu
Updated: July 4, 2019, 5:49 PM IST
Video: 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్‌'లో రెచ్చిపోతున్న అమ్మాయిలు
Video: బాటిల్ క్యాప్ ఛాలెంజ్‌లో రెచ్చిపోతున్న అమ్మాయిలు (Source: Twitter)
news18-telugu
Updated: July 4, 2019, 5:49 PM IST
#BottleCapChallenge... ఇటీవల వైరల్‌గా మారింది బాటిల్ క్యాప్ ఛాలెంజ్. కొంతకాలం క్రితం కీకీ ఛాలెంజ్ ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు అదే స్థాయిలో 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్' ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. కాలితో బాటిల్ మూత ఓపెన్ చేయడమే బాటిల్ క్యాప్ ఛాలెంజ్. సెలబ్రిటీలు, సినిమా స్టార్లు సైతం 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్' స్వీకరించి వీడియోలు రికార్డ్ చేసి పోస్ట్ చేస్తుండటంతో అందరిలో క్రేజ్ పెరుగుతోంది. 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్' అంటే కీకీ ఛాలెంజ్‌లో డ్యాన్స్, టిట్‌టాక్‌లో వీడియో రికార్డ్ చేసినంత ఈజీ కాదు. మంచి ఫిట్‌నెస్ ఉంటే తప్ప ఈ ఛాలెంజ్‌లో సక్సెస్ కావడం కష్టం. అందుకే జిమ్‌లో వర్కవుట్స్ చేసేవారంతా ఈ ఛాలెంజ్ స్వీకరించి మరీ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి సత్తాచాటుతున్నారు. అబ్బాయిలే ఈ ఫీట్లు చేస్తున్నారనుకుంటే పొరపాటే. అమ్మాయిలు సైతం 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్'లో టాలెంట్ చూపిస్తున్నారు. ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. ఆ వీడియోలు చూడండి.























కొద్దిరోజుల క్రితం మొదలైంది ఈ 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్'. జూన్ 25న తైక్వాండో ఇన్‌స్ట్రక్టర్, ఫైటర్ ఫరాబీ డావ్లెట్చిన్ ఈ ఛాలెంజ్ ప్రారంభించాడు. ఆ తర్వాత మార్షల్ ఆర్టిస్ట్ మ్యాక్స్ హాల్లోవే ఛాలెంజ్ స్వీకరించి వీడియో అప్‌లోడ్ చేశాడు. ఇలా ఒక్కొక్కరు వీడియోలు రికార్డ్ చేయడం మరికొందరికి సవాల్ విసరడం కామన్ అయిపోయింది. అలా ఈ ఛాలెంజ్ వైరల్‌గా మారింది. హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ స్వీకరించి వీడియోలు షేర్ చేశారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో #BottleCapChallenge అని సెర్చ్ చేస్తే 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్' వీడియోలు వందల్లో కనిపిస్తాయి.

Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Smartphone: మీ ఫోన్ పేలిపోవద్దంటే ఈ 10 జాగ్రత్తలు తప్పనిసరి

Vivo Z1 Pro: ట్రిపుల్ కెమెరాతో వివో జెడ్1 ప్రో... ధర రూ.14,990

Realme X: బీ రెడీ... 'రియల్‌మీ ఎక్స్' ఇండియాకు వచ్చేస్తోంది
First published: July 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...