HOME »NEWS »TECHNOLOGY »gionee to launch smartphone with 10000mah battery capacity ss

Gionee: బీ రెడీ... 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో జియోనీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది

Gionee: బీ రెడీ... 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో జియోనీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది
Gionee: బీ రెడీ... 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో జియోనీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది (ప్రతీకాత్మక చిత్రం)

Gionee Smartphone | మీకు భారీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్ కావాలా? జియోనీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వస్తోంది. ఏకంగా 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయనుంది కంపెనీ.

  • Share this:
    స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించేందుకు కంపెనీలు పోటీపడుతూనే ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌ను 20 నిమిషాల్లో 100 పర్సెంట్ ఛార్జింగ్ చేసే టెక్నాలజీని రియల్‌మీ రూపొందించింది. 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు సాంసంగ్ రంగం సిద్ధం చేసింది. ఇప్పుడు జియోనీ సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. ఏకంగా 10,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తోంది జియోనీ. ఇంత భారీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్ రావడమంటే సంచలనమే. ఇప్పటికే ఔకిటెల్ కే10000 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా ఇంత బ్యాటరీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు జియోనీ నుంచి 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ వస్తోంది. ఇప్పటికే చైనాలో అప్రూవల్ లభించింది.

    Alert: ఈ 29 యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలిట్ చేయండి



    TRAI New Rules: తక్కువ ధరకే ఎక్కువ ఛానెల్స్... ట్రాయ్ కొత్త రూల్స్ ఇవే

    ఒకప్పుడు ఫోన్‌లో 4,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే చాలా ఎక్కువ అనుకునేవారు. ఆ తర్వాత 4,500ఎంఏహెచ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. సాంసంగ్ నుంచి 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ వస్తోంది. ఇప్పుడు కెపాసిటీ ఏకంగా 10,000ఎంఏహెచ్‌కు పెరిగింది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే కనీసం మూడు నాలుగు రోజులు ఛార్జింగ్ అవసరం లేకుండా వాడుకోవచ్చు. జియోనీ మారథాన్ సిరీస్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. 2015లో జియోనీ మారథాన్ ఎం5 స్మార్ట్‌ఫోన్ 6,020ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వచ్చింది. ఆ తర్వాత జియోనీ మారథాన్ ఎం2017 స్మార్ట్‌ఫోన్ 7,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వచ్చింది. ఇప్పుడు ఏకంగా 10,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో కొత్త మోడల్ పరిచయం కానుంది. 10,000ఎంఏహెచ్ కెపాసిటీ అంటే ఓ పవర్ బ్యాంకుతో సమానం.

    IRCTC SBI Credit Card: గుడ్ న్యూస్... జాయినింగ్ ఫీజు లేకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్

    Redmi 9: రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే

    ఇక ఈ ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్ చూస్తే మీడియాటెక్ హీలియో ప్రాసెసర్, 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజీ, 5.72 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 16మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. ఆగస్టులో ఈ ఫోన్ లాంఛ్ అయ్యే అవకాశముంది.
    Published by:Santhosh Kumar S
    First published:July 30, 2020, 10:04 IST