హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Gionee M30: జియోనీ సంచలనం... 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్

Gionee M30: జియోనీ సంచలనం... 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్

Gionee M30: జియోనీ సంచలనం... 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్

Gionee M30: జియోనీ సంచలనం... 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్

Gionee M30 | మీరు భారీ బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? జియోనీ 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. వివరాలు తెలుసుకోండి.

  ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో 4,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే అదే గొప్ప. ఆ తర్వాత 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కావడంతో వామ్మో అనుకున్నారంతా. ఏడాదిగా సాంసంగ్ ఏకంగా 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఇటీవల రియల్‌మీ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది. 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో రియల్‌మీ సీ12, రియల్‌మీ సీ15 మోడల్స్‌ని పరిచయం చేసింది. త్వరలో సాంసంగ్ ఏకంగా 7,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయనుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా ఈ కెపాసిటీతో పవర్ బ్యాంక్స్ లభిస్తాయి. కానీ కంపెనీలు ఏకంగా స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు చైనాకు చెందిన మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ జియోనీ సంచలనం సృష్టించింది. జియోనీ ఎం30 మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను 10,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో రూపొందించింది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. జియోనీ ఎం30 స్మార్ట్‌ఫోన్ చైనాలో రిలీజ్ అయింది. 10,000ఎంఏహెచ్ కెపాసిటీ అంటే మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోయే పవర్ బ్యాంక్ కెపాసిటీతో సమానం. జియోనీ ఎం30 స్మార్ట్‌ఫోన్‌ను 8జీబీ+128జీబీ వేరియంట్‌తో రిలీజ్ చేసింది కంపెనీ. అయితే ఈ ఫోన్ ఇండియాలో రిలీజ్ అవుతుందో లేదో స్పష్టత లేదు.

  Redmi 9: రెడ్‌మీ 9 వచ్చేసింది... తక్కువ ధరకే 4GB+128GB స్మార్ట్‌ఫోన్‌తో షావోమీ సంచలనం

  Mobile Apps: మీ స్మార్ట్‌ఫోన్ నుంచి వెంటనే ఈ 23 యాప్స్ డిలిట్ చేయండి

  జియోనీ ఎం30 స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ

  ర్యామ్: 8జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ60

  రియర్ కెమెరా: 16 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 10,000ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

  కలర్స్: బ్లాక్

  ధర: సుమారు రూ.15,000

  ఇక ఇండియాలో జియోనీ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ధర రూ.5,999. ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్ట్ 31న సేల్ ప్రారంభం కానుంది.

  జియోనీ మ్యాక్స్ స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.10 అంగుళాల డిస్‌ప్లే

  ర్యామ్: 2జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ

  ప్రాసెసర్: స్ప్రెడ్‌ట్రమ్ ఎస్‌సీ9863ఏ

  రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 5,000ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

  కలర్స్: బ్లాక్, రెడ్, రాయల్ బ్లూ

  ధర: రూ.5,999

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android 10, Smartphone

  ఉత్తమ కథలు