GET UNLIMITED DATA WITH BSNL RS 98 PREPAID PLAN HERE IS THE SIMILAR PLANS FROM JIO AITEL AND VI NS GH
Unlimited Data Plan: రూ. 98కే BSNL అన్లిమిటెడ్ డేటా ప్లాన్.. ఇదే ధరలో ఇతర కంపెనీల ప్లాన్లు కూడా.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
కరోనా నేపథ్యంలో పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వినియోగించడంతో డేటా వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో అన్ని టెలికాం కంపెనీలు పోటీలు ఆకర్షణీయమైన డేటా ఆఫర్లను అందిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
బీఎస్ఎన్ఎల్ రూ.98 వోచర్(BSNL Rs 98 voucher)
అందరికీ తక్కువ ధరలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించేందుకు బిఎస్ఎన్ఎల్ రూ.98లకు డేటా ప్యాక్‌ను విడుదల చేసింది. ఈ డేటా ప్యాక్‌తో 22 రోజుల పాటు అపరిమిత ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు. దీని కింద వినియోగదారులు ప్రతిరోజూ 2GB కోసం హై-స్పీడ్ ఇంటర్నెట్ను పొందుతారు. 2GB డేటా పూర్తయ్యాక వారి ఇంటర్నెట్ వేగం 40 Kbps కు తగ్గించబడుతుంది.
బీఎస్ఎన్ఎల్ రూ.99 వోచర్(BSNL Rs 97 voucher)
రూ .97 వోచర్‌తో బిఎస్ఎన్ఎల్ 18 రోజుల పాటు అపరిమిత ఉచిత ఇంటర్నెట్ను అందిస్తోంది. చందాదారులకు రోజువారీ 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. తరువాత డేటా వేగం 80 Kbps కు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్‌తో రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు అపరిమిత వాయిస్ కాల్ సదుపాయం కూడా ఉంటుంది.
ఎయిర్టెల్ రూ.98 డేటా వోచర్(Airtel Rs 98 data voucher)
ఎయిర్టెల్ రూ .98 డేటా వోచర్‌తో 12 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తోంది. ఈ ప్యాకేజీ వ్యాలిడిటీ మీ ఒరిజినల్ ప్లాన్ వ్యాలిడిటీపై ఆధారపడి ఉంటుంది.
జియో రూ. 101 వోచర్(Jio Rs 101 4G voucher )
రిలయన్స్ జియో తన రూ .101 వోచర్‌పై 12 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తోంది. దీనితో పాటు అదనంగా 1362 ఐయుసి నిమిషాల విలువైన టాక్‌టైమ్ ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
వొడాఫోన్ ఐడియా రూ.98 వోచర్(Vi Rs 98 voucher)
వొడాఫోన్ ఐడియా 28 రోజుల వాలిడిటీతో వచ్చే రూ .98 వోచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ వోచర్‌తో 12 జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా అందిస్తోంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.