Airtel offer: రూ.249 రీఛార్జ్‌పై రూ.4 లక్షల లైఫ్ ఇన్స్యూరెన్స్

Airtel offer | రూ.249 ప్లాన్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లైఫ్ ఇన్స్యూరెన్స్ గురించే. రూ.249 ప్లాన్‌పై రూ.4 లక్షల బీమా లభించడం విశేషం.

news18-telugu
Updated: May 10, 2019, 6:15 PM IST
Airtel offer: రూ.249 రీఛార్జ్‌పై రూ.4 లక్షల లైఫ్ ఇన్స్యూరెన్స్
Airtel offer: రూ.249 రీఛార్జ్‌పై రూ.4 లక్షల లైఫ్ ఇన్స్యూరెన్స్
  • Share this:
టెలికాం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ సబ్‌స్క్రైబర్లకు వరంగా మారింది. ఎయిర్‌టెల్ కొత్తగా రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. భారతదేశంలోని యూజర్లందరికీ రూ.129, రూ.249 ఆఫర్ వర్తిస్తుంది. ఇందులో రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి రూ.4 లక్షల లైఫ్ ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. ఇక రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, ఎస్‌టీడీ, నేషనల్ రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం, వింక్ మ్యూజిక్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. రూ.249 ప్లాన్ వేలిడిటీ 28 రోజులు. దీంతోపాటు ఏడాదిపాటు నార్టాన్ మొబైల్ సెక్యూరిటీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

Read this: Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 11 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

రూ.249 ప్లాన్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లైఫ్ ఇన్స్యూరెన్స్ గురించే. రూ.249 ప్లాన్‌పై రూ.4 లక్షల బీమా లభించడం విశేషం. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్స్యూరెన్స్ లేదా భారతీ ఆక్సా నుంచి ఈ ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. ఒకసారి రీఛార్జ్ చేసుకున్నవారి మొబైల్‌కు పాలసీకి సంబంధించిన ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ తర్వాత ఇన్స్యూరెన్స్ పాలసీ కోసం కేవైసీ వివరాలను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రూ.129 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. ఈ ప్లాన్ 28 రోజులకు వర్తిస్తుంది.

Realme 3 Pro: రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... వివరాలివేWhatsApp: ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... ఫోన్ మార్చాల్సిందే

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...
First published: May 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading