Lava Mobiles | ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? చౌక ధరకే ఇయర్ ఫోన్స్ (Earphone) కొనుగోలు చేసే అవకాశం ఒకటి అందుబాటులో ఉంది. లావా (Lava) ఇయర్ ఫోన్స్ అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఎంత అంటే కేవలం రూ. 11 మాత్రమే. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లావా మొబైల్స్ కంపెనీ ఇటీవలనే ప్రో బర్డ్స్ ఎన్ 11 పేరుతో నెక్‌బ్యాండ్ ఇయర్ ఫోన్స్‌ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. వీటి అమ్మకాలు సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఇయర్ బడ్స్‌ను కేవలం రూ. 11కే పొందే అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది.
అమెజాన్ ప్రకారం చూస్తే.. లావా ప్రోబడ్స్ ఎన్11 ధర రూ.2,999గా ఉంది. అయితే ఇవి ఇప్పుడు రూ. 999కు అందుబాటులో ఉన్నాయి. అంటే 67 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అయితే మనం రూ. 11కు కొనొచ్చని చెప్పుకున్నాం కదా? ఈ రేటుకు ఎలా కొనుగోలు చేయావచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద మీరు ఈ రేటుకు ఇయర్ బడ్స్ కొనే అవకాశం ఉంటుంది. అయితే ఇది అందరికీ లభించకపోవచ్చు. ఉదయం 11 గంటలకు ఈ ఆఫర్ ఉంటుంది. స్టాక్ ఉన్నంత వరకే ఆఫర్ ఉంటుంది. లక్ ఉన్న వారికి మాత్రమే ఈ రేటుకు ఇయర్ బడ్స్ లభించొచ్చు. ఆఫర్ లేకపోతే రూ. 999కు వీటిని కొనాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 13 నుంచి 16 వరకు రూ.999 రేటు వర్తిస్తుంది. తర్వాత మళ్లీ ఇయర్ బడ్స్ రేటు రూ. 1499కు చేరుతుంది.
పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ కొంటే రూ.22 వేల తగ్గింపు! ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు
ఇకపోతే ఇయర్ బడ్స్ ఎన్ 11 మూడు రంగుల్లో లభించనుంది. గ్రీన్, ఆరెంజ్, బ్లాక్ రంగుల్లో లభిస్తాయి. ఇంకా వీటిల్లో టర్బో లాటెన్సీ, ప్రో గేమ్ మోడ్, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సలేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే వీటిల్లో 280 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. పది నిమిషాలు చార్జింగ్ పెడితే 13 గంటల ప్లేబ్యాక్ టైమ్ లభిస్తుంది. 12 ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయి. బ్లూటూత్ 5.2, ఐపీఎక్స్6 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. గూగుల్ , సిరి వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ఉంది. గానా సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. 12 నెలల వారంటీ లభిస్తుంది.
ఆఫర్లే ఆఫర్లు.. సగం ధరకే టీవీలు, ఏసీలు.. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై భారీ తగ్గింపు
అలాగే స్టాక్ ఉన్నంత వరకే ఆఫర్ పొందగలం అని గుర్తించుకోవాలి. ప్రోబడ్స్ ఎన్11 అనేవి డ్యూయెల్ హాల్స్విచ్ ఫంక్షన్‌తో మార్కెట్లోకి వచ్చాయి. ఒక్కసారి వీటిని చార్జ్ చేస్తే 42 గంటల వరకు చార్జింగ్ వస్తుంది. లావా మొబైల్స్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Earphones, Flipkart, Lava