హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్ ఆఫర్లు.. రూ.32 వేలకే ఐఫోన్ 13 మినీ!

iPhone Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్ ఆఫర్లు.. రూ.32 వేలకే ఐఫోన్ 13 మినీ!

 iPhone Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్ ఆఫర్లు.. రూ.32 వేలకే ఐఫోన్ 13 మినీ!

iPhone Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్ ఆఫర్లు.. రూ.32 వేలకే ఐఫోన్ 13 మినీ!

ఐఫోన్ 13 మినీ 128జీబీ మోడల్ ధర రూ.66,990తో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.64,990కు ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై దిగ్గజ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్, ఆఫర్లు ప్రకటించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఇంటర్నేషనల్ టాప్ బ్రాండ్ యాపిల్ (Apple) ప్రొడక్ట్స్‌ ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కంపెనీకి చెందిన గ్యాడ్జెట్స్ జీవితంలో ఒకసారైనా యూజ్ చేయాలనుకునే వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారికి దిగ్గజ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. యాపిల్‌కు చెందిన తాజా స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో చౌక మోడల్ గా పేరొందిన ఐఫోన్ 13 మినీ(iPhone 13 Mini)పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా..

ఐఫోన్ 13 మినీ 128జీబీ మోడల్ ధర రూ.66,990తో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.64,990కు ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై దిగ్గజ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్, ఆఫర్లు ప్రకటించింది. ఐఫోన్ 13 మినీ 128జీబీ మోడల్‌‌పై రూ. 9,910 ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 54,990కు తగ్గింది.

స్టన్నింగ్ డీల్.. 55 అంగుళాల స్మార్ట్‌ టీవీపై రూ.17 వేల డిస్కౌంట్!

ఐఫోన్ 13 మినీ మోడల్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ విలువ దాదాపు రూ. 20,500 వరకు ఉంటుంది. మీరు మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే.. మొత్తం ఎక్స్ఛేంజ్ వ్యాల్యూతో ఐఫోన్ 13 మినీ మోడల్‌ను సొంతం చేసుకోవచ్చు. అంటే ఐఫోన్ 13 మినీ 128జీబీ మోడల్ ధర రూ.34,490కి తగ్గుతుంది. ఐఫోన్ 13 మినీ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.3000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంటే దీన్ని కేవలం రూ.32వేలకే సొంతం చేసుకోవచ్చు.

ఇలాంటి టీవీని మీరెప్పుడూ చూసి ఉండరు.. ధర రూ.4 వేలే, దీనికో ప్రపంచ రికార్డ్!

ఈ స్మార్ట్‌ఫోన్1080 బై 2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌‌తో 5.4-అంగుళాల OLED స్క్రీన్‌తో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యాపిల్‌కు చెందిన సొంత A15 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరింత సేఫ్టీ కోసం ఇది సిరామిక్ కవర్‌తో వస్తుంది. ఐఫోన్ 13 మినీ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్‌లో12MP ప్రైమరీ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫోన్ వెనుకవైపు 12MP అల్ట్రా-వైడ్ సెకండరీ సెన్సార్ ఉంటుంది. ఇక ముందు భాగంలో 12 మెగాపిక్సెల్స్ రిజల్యూషన్‌తో సెల్ఫీ కెమెరా సెటప్ ఉంటుంది. ఐఫోన్ 13 మినీ 128జీబీ, 256జీబీ లేదా 512GBజీబీ స్టోరేజ్ కెపాసిటీతో లభిస్తుంది. యాపిల్ iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌‌పై ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 ప్రొటక్షన్ రేటింగ్‌‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌‌ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఫ్లిప్‌కార్ట్.. తన కస్టమర్ల కోసం తాజాగా  అందిస్తున్న మొబైల్ ఫోన్స్ బొనాంజా సేల్ ఆఫర్లు కొంత కాలమే ఉంటాయి.  ఈ ప్రత్యేక సేల్ నవంబర్ 8 నుంచి నవంబర్ 14 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో వివిధ సెగ్మెంట్ లకు చెందిన స్మార్ట్‌ఫోన్లు భారీ డిస్కౌంట్స్‌‌తో అందుబాటులో ఉన్నాయి.

First published:

Tags: Apple, Apple iphone, Flipkart, Iphone, Iphone 13, Latest offers

ఉత్తమ కథలు