Home /News /technology /

GET APPLE IPHONE 13 AT JUST RS 3599 BEFORE LAUNCH OF IPHONE 14 UMG GH

iPhone 13: అబ్బా.. ఐఫోన్ అదిరిపోయే ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.3,599కే సొంతం.. ఇంకెందుకు ఆలస్యం.. ఓ లుక్కేయండీ..!

ఆఫర్‌లో ఐఫోన్ 13

ఆఫర్‌లో ఐఫోన్ 13

ఐఫోన్ (iPhone) కొనాలనుకునే వారికి బంపరాఫర్. ప్రస్తుతం ఐఫోన్ 13 (iPhone 13) కేవలం రూ.3,559కే లభిస్తోంది. ఈ కళ్లు చెదిరే ఆఫర్‌ను ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తీసుకొచ్చింది.

ఐఫోన్ (iPhone) కొనాలనుకునే వారికి బంపరాఫర్. ప్రస్తుతం ఐఫోన్ 13 (iPhone 13) కేవలం రూ.3,559కే లభిస్తోంది. ఈ కళ్లు చెదిరే ఆఫర్‌ను ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తీసుకొచ్చింది. బెస్ట్ ఫ్లిప్‌కార్ట్ డీల్స్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ 13ని నమ్మలేని ధరతో విక్రయిస్తోంది. ఈ డీల్‌లో ఐఫోన్ 13 128GB వేరియంట్‌ని ఫ్లిప్‌కార్ట్ అమ్ముతోంది. దీని అసలు ధర రూ.79,900. కాగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ ఐఫోన్ 13పై ఏడు శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.74,209కి తగ్గింది. ఈ డీల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఈఎంఐ ఆప్షన్స్ అందిస్తోంది. మరి ఈ ఆఫర్ కింద ఐఫోన్ 13ని చాలా తక్కువ ధరతో ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు రూ.3,599కే ఐఫోన్ 13
ముందు చెప్పినట్లుగా, ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13పై ఈఎంఐ ఆప్షన్స్ (EMI Options) ఆఫర్ చేస్తోంది. ఈ ఈఎంఐ ఆఫర్ ఎస్‌బీఐ (SBI) క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు వర్తిస్తుంది. మీ వద్ద ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే.. మీరు ఐఫోన్ 13ని కేవలం రూ.3,599కే కొనుగోలు చేయవచ్చు. ఆపై 15 శాతం వడ్డీ రేటుతో నెలకు రూ.3,599 చెల్లించవచ్చు. ఈ లెక్కన చూసుకుంటే మీరు 24 నెలల్లో ఐఫోన్ 13 ధర మొత్తాన్ని పూర్తిగా చెల్లించవచ్చు. ఈఎంఐ ఆప్షన్ వర్తించకపోయినా లేదా వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లించకూడదనుకున్నా కూడా ఈ ఫోన్‌పై అదిరిపోయే తగ్గింపులు పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.



* ఈఎంఐ లేకున్నా భారీగా తగ్గింపు..
ఈఎంఐలో ఐఫోన్ 13ని కొనుగోలు చేయకూడదనుకున్నా లేదా ఈ ఆఫర్ వర్తించకపోయినా మీరు రూ. 23,000 కంటే ఎక్కువ తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఏడు శాతం తగ్గింపుతో, ఐఫోన్ 13 రూ. 74,209కే లభిస్తోంది. ఈ ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే... రూ. 3,711 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అప్పుడు స్మార్ట్‌ఫోన్ ధరను రూ.70, 498కి తగ్గించవచ్చు. ఐఫోన్ 13ని ఇంకా తక్కువ మొత్తానికి పొందడానికి, కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ వాల్యూను పూర్తిగా పొందడం ద్వారా... మీరు ఐఫోన్ 13ని రూ.55,998కి సొంతం చేసుకోవచ్చు. ఈ విధంగా, మీరు రూ.23,902 తగ్గింపు ధరతో ఐఫోన్ దక్కించుకోవచ్చు. యాపిల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్, ఐఫోన్ 14 సెప్టెంబర్‌, 2022లో విడుదల కానుంది. దానిని కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. అలాగే ఒకేసారి ఐఫోన్ 13ని కొనాలనుకునే వారికి కూడా ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ సహాయపడతాయి.
Published by:Mahesh
First published:

Tags: Apple iphone, Flipkart, Iphone, Mobile offers

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు