హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Apple iPhone: ఐఫోన్ 11ను రూ.30వేలకే కొనుగోలు చేయవచ్చు.. ఎలాగో తెలుసుకోండి

Apple iPhone: ఐఫోన్ 11ను రూ.30వేలకే కొనుగోలు చేయవచ్చు.. ఎలాగో తెలుసుకోండి

ప్రతకాత్మకచిత్రం

ప్రతకాత్మకచిత్రం

Iphone 11 offers: ఐఫోన్13 సిరీస్ విడుదలైన తరువాత పాత వేరియంట్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అమెజాన్ కొన్ని ఐఫోన్ మోడళ్లను తక్కువ ధరలకే విక్రయిస్తోంది

ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలైన అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఫెస్టివ్ సీజన్ సేల్ కొనసాగుతోంది. ఈ సమయంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ (best-selling products) పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, డీల్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఫెస్టివ్ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్‌లు బాగా అమ్ముడుపోతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ-కామర్స్ కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లపై బంపరాఫర్లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా రూ.30వేల ధరలోనే ఐఫోన్‌ 11 (Iphone 11) సిరీస్‌లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

ఐఫోన్13 (Iphone 13) సిరీస్ విడుదలైన తరువాత పాత వేరియంట్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అమెజాన్ కొన్ని ఐఫోన్ మోడళ్లను తక్కువ ధరలకే విక్రయిస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ 11 మోడల్ ధరలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఐఫోన్ 11 64జీబీ వేరియంట్ ధర రూ.39,999గా ఉండగా.. 128జీబీ వేరియంట్ ధర రూ.44,999గా ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ధరలను మరింత తగ్గించవచ్చు. వర్కింగ్ కండిషన్ లో ఉన్న ఓల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను అందించే కొనుగోలుదారులకు అమెజాన్ కంపెనీ రూ.13,650 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో 128జీబీ వేరియంట్‌ ఐఫోన్ 11 ధరను 31,349 కి తగ్గించవచ్చు.

iQOO 8 Legend: త్వ‌ర‌లో మార్కెట్‌లోకి ఐకూ 8 లెజెండ్ స్మార్ట్‌ఫోన్.. ఫీచ‌ర్స్ ఇవే

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఐఫోన్ 11 64జీబీ వేరియంట్‌ను రూ.26,349కే సొంతం చేసుకోవచ్చు. దీనికి తోడు అమెజాన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై రూ.1,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌ను కూడా కలిపితే ఐఫోన్ 128జీబీ వేరియంట్‌ను రూ.30,349 ధరకే కొనుగోలు చేయవచ్చు. 64జీబీ వేరియంట్‌ను రూ.25,349 లోపు సొంతం చేసుకోవచ్చు.

Realme: దసరా బొనాంజా.. రియల్ మీ నుంచి మరికొన్ని స్మార్ట్ ప్రొడక్ట్స్ లాంచ్.. అవి ఏంటంటే..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాపిల్ ఐఫోన్ 12 మోడల్ కూడా చాలా తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 12 128జీబీ వేరియంట్ ధర రూ.57,999 గా నిర్ణయించారు. కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఎంచుకొని ధర తగ్గించుకోవచ్చు. 64జీబీ వేరియంట్ ధర రూ.52,999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఈ డివైజ్‌పై రూ.15,600 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది.

First published:

Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Flipkart, Flipkart Big Billion Days, Technology

ఉత్తమ కథలు