Home /News /technology /

GET 50 PERCENTAGE DISCOUNT ON IPHONE 12 WITHOUT EXCHANGE UMG GH

iPhone 12: ఐఫోన్ 12పై భారీ ఆఫర్.. 50 శాతం డిస్కౌంట్‌తో సొంతం చేసుకునే అవకాశం

50 శాతం ఆఫర్‌తో ఐఫోన్ 12ను సొంతం చేసుకోండి

50 శాతం ఆఫర్‌తో ఐఫోన్ 12ను సొంతం చేసుకోండి

ఐఫోన్ (iphone) లవర్స్‌కు ఒక గుడ్ న్యూస్. ఐఫోన్ 12 ఇప్పుడు ఏకంగా 50 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. అమెరికన్ టెలీ కమ్యూనికేషన్స్ హోల్డింగ్ కంపెనీ AT&T ఎలాంటి ట్రేడ్-ఇన్ డీల్స్ లేకుండా సగం ధరకే ఐఫోన్ 12ను (iPhone 12) అందిస్తోంది.

ఇంకా చదవండి ...
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనగానే మనకు గుర్తొచ్చేది యాపిల్ కంపెనీ నుంచి వచ్చే ఐఫోన్లు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంటుంది. అయితే ఐఫోన్ల ధరలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఇక కొత్తగా మార్కెట్లోకి వచ్చే లేటెస్ట్ వెర్షన్ల ధరలు సామాన్యుడికి ఎప్పుడూ షాక్ ఇస్తుంటాయి. దీంతో వీటిపై ఎప్పుడెప్పుడు ఆఫర్లు పెడతారా అని ఐఫోన్ లవర్స్ ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్. ఐఫోన్ 12 ఇప్పుడు ఏకంగా 50 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. అమెరికన్ టెలీ కమ్యూనికేషన్స్ హోల్డింగ్ కంపెనీ AT&T ఎలాంటి ట్రేడ్-ఇన్ డీల్స్ లేకుండా సగం ధరకే ఐఫోన్ 12ను (iPhone 12) అందిస్తోంది.

యాపిల్ ఐఫోన్ 12 అసలు ధర 729.99 డాలర్లు. నెలకు 20.28 డాలర్లతో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా కూడా ఈ డివైజ్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే ఉన్న, కొత్త AT&T సబ్‌స్క్రైబర్‌లు ఎలిజిబుల్ అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్ కోసం సైన్ అప్ చేస్తే.. iPhone 12పై 50 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ డీల్ పరిమిత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అందుకే మీరు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్ కోసం చూస్తుంటే, ఇది మీకు కరెక్ట్ టైమ్. ఐఫోన్ 12 ధరను సగానికి తగ్గించే ఈ డీల్‌ను ఎలా పొందాలనేది చూద్దాం.

ఐఫోన్ 12పై 50% తగ్గింపు ఎలా పొందాలంటే..
స్టెప్- 1:
AT&T వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి, మొబైల్ డీల్స్ సెక్షన్‌కు వెళ్లండి. అక్కడ మీకు iPhone 12 పేజీ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

స్టెప్- 2:
ఆ తర్వాత మీకు నచ్చే ఐఫోన్ 12 కలర్, వేరియంట్‌ను ఎంచుకోండి. ఐఫోన్ 12 బేస్ వేరియంట్ 64GB స్టోరేజ్‌ మోడల్ 729.99 డాలర్లకు అందుబాటులో ఉంటుంది.

స్టెప్- 3:
కొన్ని సింపుల్ కండిషన్స్ ఫాలో అయితే, నెలకు కేవలం 10.14 డాలర్లు మాత్రమే చెల్లించి ఈ డివైజ్‌ను పొందవచ్చు.

స్టెప్- 4:
ఈ ప్రాసెస్‌లో కీలకమైన విషయం ఒకటి ఉంది. ఐఫోన్ 12పై 50 శాతం తగ్గింపు పొందాలంటే.. AT&T ఇన్‌స్టాల్‌మెంట్ అగ్రిమెంట్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.

స్టెప్- 5:
ఐఫోన్ 12ను క్వాలిఫైయింగ్ ఇన్‌స్టాల్‌మెంట్ అగ్రిమెంట్‌పై కొనుగోలు చేయాలి. రిటైల్ ధరపై ట్యాక్స్‌లతో పాటు 30 డాలర్లు యాక్టివేషన్, అప్‌గ్రేడ్ ఫీజు చెల్లించాలి.

స్టెప్- 6:
తర్వాత 36 నెలల పాటు పోస్ట్‌పెయిడ్ అన్‌లిమిటెడ్ వైర్‌లెస్ సర్వీస్‌ను యాక్టివేట్ చేయండి.



యాపిల్ ఇప్పటికే ఐఫోన్ 13 (iPhone 13) సిరీస్‌ను లాంచ్ చేసింది. మరికొన్ని నెలల్లోనే iPhone 14 సిరీస్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి పాత సిరీస్‌ అయిన ఐఫోన్ 12ను కొనుగోలు చేసే ముందు కస్టమర్లు ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. అయితే మీ అవసరాలకు iPhone 12 సరిపోతుందనని భావిస్తే మాత్రం, ఈ భారీ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Apple iphone, Iphone, Mobiles, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు