ఈ ఇంజెక్షన్ రేటు రూ.14 కోట్లు... ఎందుకో తెలుసా...

Zolgensma : ప్రపంచంలోనే అత్యంత కాస్ట్‌లీ ఇంజెక్షన్‌గా రికార్డు సృష్టించింది జోల్‌జెన్‌స్మా. పిల్లల్లో జన్యు లోపాలకు ఇది చెక్ పెడుతుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 26, 2019, 9:02 AM IST
ఈ ఇంజెక్షన్ రేటు రూ.14 కోట్లు... ఎందుకో తెలుసా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మనకు జ్వరం వస్తే ఇచ్చే ఇంజెక్షన్ రేటు మహా అయితే రూ.50 ఉంటుంది. అదే ఏ గుండె జబ్బుకో ఇచ్చే ఇంజెక్షన్ రేటు రూ.2 లక్షల దాకా ఉంటుంది. అదే జోల్‌జెన్‌స్మా ఇంజెక్షన్ రేటైతే అక్షరాలా రూ.14 కోట్ల 57లక్షలు. ఒక ఇంజెక్షన్ రేటు అంత ఎక్కువ ఎందుకుంది అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్‌లీ మందుకి అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది. అంటే ఇకపై ఆ మందును మార్కెట్లలో అమ్ముకోవచ్చు. దాని పేరే జోల్‌జెన్‌స్మా. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న, స్విట్జర్లాండ్‌గి చెందిన మందుల తయారీ కంపెనీ నోవార్టిస్ దీన్ని తయారుచేస్తోంది. పుట్టిన పిల్లల్లో కొన్ని సార్లు జన్యులోపాలు వస్తాయి. వాటిని మొదట్లోనే సరిచెయ్యకపోతే, జీవితాంతం అవి వెంటాడతాయి. కొంతమంది ఈ లోపాల వల్ల పుట్టిన రెండేళ్లలోనే చనిపోతున్నారు. ఇలాంటి లోపాల్ని సరిచెయ్యడం ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే అందుకు సంబంధించిన మందు రేటు కూడా అంత ఎక్కువగా ఉంది. జోల్‌జెన్‌స్మా ఇంజెక్షన్ ఇస్తే, పిల్లల్లో జన్యులోపాలు తొలగిపోతాయని డాక్టర్లు తెలిపారు.

ఎంత జన్యులోపాల్ని సరిచేసేదైతే మాత్రం ఇంత రేటెక్కువా అని చాలా మంది అంటున్నారు. దీనికి నోవార్టిస్ చెబుతున్న సమాధానం మరోలా ఉంది. ఇలాంటి జన్యులోపాల్ని సరిచెయ్యడానికి మార్కెట్లలో కొన్ని రకాల మందులున్నాయి. కాకపోతే, ఆ ఇంజెక్షన్లను ప్రతీ సంవత్సరం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఓ పదేళ్లు ఇస్తే... దాదాపు రూ.30 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అదే జోల్‌జెన్‌స్మా అలా కాదు. ఒక్కసారి ఇస్తే, ఇక మళ్లీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే ఈ మందు... ఇప్పుడవుతున్న ఖర్చులను సగానికి తగ్గిస్తున్నట్లే అంటున్నారు నోవార్టిస్ డాక్టర్లు.

ప్రతీ 8వేల మంది పసికందుల్లో ఒకరికి జన్యులోపాలు ఉంటున్నాయి. ఒక్క అమెరికాలోనే... ఏడాదికి 450 నుంచీ 500 మందికి జన్యులోపాలు వస్తున్నాయి.

 

ఇవి కూడా చదవండి :

వైసీపీ ప్రభుత్వ సలహాదారుగా ఉండవల్లి... పోలవరం కోసం ఆయన సేవల్ని వాడుకుంటారా?

నేడు గుజరాత్‌కు మోదీ... 30న ప్రమాణస్వీకారం...చంద్రబాబుకు బస్తీ మే సవాల్... నేడు విజయవాడలో రాంగోపాల్ వర్మ ప్రెస్‌మీట్...

చంద్రబాబుకి మరో షాక్... EVMలు 100 శాతం కరెక్ట్ అన్న ఈసీ

Pics : క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్న హిప్పీ బ్యూటీ దిగంగన

First published: May 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading