Solar Smartwatch | టెక్ కంపెనీ గర్మిన్ తాజాగా అదిరిపోయే స్మార్ట్ వాచ్‌ను తీసుకువచ్చింది. ఇది ప్రీమియం స్మార్ట్ వాచ్. అంటే రేటు ఎక్కువగానే ఉంటుంది. ఈ కొత్త స్మార్ట్ వాచ్ రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఇన్‌స్టింక్ట్ క్రాసోవర్, ఇన్‌స్టింక్ట్ క్రాసోవర్ సోలార్ అనేవి వీటి పేరు. పేరులో ఉన్నట్లుగానే ఇన్‌స్టింక్ట్ క్రాసోవర్ సోలార్ స్మార్ట్ వాచ్ (Smart Watch) అనేది ఎండ (Solar) పెడితే చాలు అదే చార్జింగ్ అవుతుంది. ఏకంగా 70 రోజుల పాటు స్మార్ట్ వాచ్‌ను వాడుకోవచ్చు.
బేసిక్ మోడల్‌లో ఇలాంటి ఆప్షన్ లేదు. సోలార్‌తో చార్జింగ్ ఎక్కదు. అయితే ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ స్మార్ట్ వాచ్ కూడా నెల రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. జీపీఎస్ మోడ్ ఉన్నా కూడా 110 గంటల పాటు ఈ స్మార్ట్ వాచ్ పని చేస్తుంది. ఈ రెండు స్మార్ట్ వాచ్‌లలోనూ డస్ట్, సన్, తుఫాన్ వంటి వాటిని తట్టుకొని పని చేయగలవు.
రూ.22,999కే 50 ఇంచుల స్మార్ట్ టీవీ.. రూ.34 వేల డిస్కౌంట్‌తో భారీ ఆఫర్!
అలాగే ఈ స్మార్ట్ వాచ్‌లలో కంపెనీ చాలా వరకు ఫిట్‌నెస్, హెల్త్ ఫీచర్లను అమర్చింది. స్లీప్ స్కోర్, అడ్వాన్స్‌డ్ స్లీప్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే హార్ట్ రేంజ్, ఒత్తిడి వంటిని చూపిస్తుంది. అలాగే ట్రెక్కింగ్, హైకింగ్ వంటి వటిని కూడా ఈ స్మార్ట్ వాచ్‌ను పెట్టుకొని వెళ్లొచ్చు. ఈ కొత్త ఇన్‌స్టింక్ట్ క్రాసోవర్ స్మార్ట్ వాచ్‌లను ఎంఐఎల్ ఎస్‌టీడీ 810 థర్మల్ అండ్ షాక్ రెసిస్టెన్సీ ప్రొడక్టుతో రూపొందించారు. అలాగే ఈ స్మార్ట్ వాచ్‌కు 10 ఏటీఎం వాటర్ రెసిస్టెన్సీ కూడా ఉంది.
చౌక ధరకే 55 ఇంచుల స్మార్ట్ టీవీ.. నెలకు రూ.1,400 కడితే చాలు!
ఇంకా గర్మిన్ కనెక్ట్ యాప్‌తో ఈ స్మార్ట్‌వాచ్‌ను లింక్ చేసుకోవచ్చు. ధర విషయానికి వస్తే.. గర్మిన్ క్రాసోవర్ ధర రూ. 55,990గా ఉంది. ఇక సోలార్ వేరియంట్ రేటు రూ. 61,990గా ఉంది. మీరు దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. కాగా స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసే వారు ధర అంశానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక్కడ రేటు చూస్తే.. చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. రూ. 62 వేలు అంటే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనొచ్చు. అలాగే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కూడా వస్తుంది. అందువల్ల ప్రీమియం స్మార్ట్ వాచ్‌లు కొనే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. లేదంటే సాధారణ స్మార్ట్ వాచ్‌లు రూ. 1000 పెడితే వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Latest offers, Offers, Smart watch, Smartwatch