భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ బ్యాటిల్ రాయల్ గేమ్‌లలో గారెనా ఫ్రీ ఫైర్ గేమ్ ఒకటి. ఈ గేమ్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. గరెనా ఫ్రీ ఫైర్ 2021 గేమింగ్ యాప్‌ను అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34 మిలియన్ల మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు. తద్వారా తక్కువ సమయంలో అత్యధిక మంది డౌన్‌లోడ్ చేసుకున్న మొబైల్ గేమ్‌గా అవతరించింది. డౌన్‌లోడ్ల పరంగా ఈ గేమ్ 2020 అక్టోబర్ నుంచి 72 శాతం పెరుగుదలను నమోదు చేసిందని ప్రముఖ వార్తా సంస్థ IANS పేర్కొంది. ఈ గేమ్‌ను ఎక్కువగా ఇన్‌స్టాల్ చేసుకున్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం డౌన్‌లోడ్స్‌లో 30 శాతం భారత్‌లోనే నమోదవ్వడం విశేషం. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్ నిలిచింది. బ్రెజిల్లో 12 శాతానికి పైగా యూజర్లు ఫ్రీ ఫైర్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఇదిల్ మోర్గుల్ సంస్థ డెవలప్ చేసిన క్యాండీ ఛాలెంజ్ 3డీ యాప్‌ను గత నెలలో 19 మిలియన్ల ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లలో ఇది రెండో స్థానంలో నిలిచింది. అత్యధిక సంఖ్యలో క్యాండీ ఛాలెంజ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన దేశాల్లో అమెరికా 12.2 శాతం, బ్రెజిల్ 9.3 శాతంతో ఉన్నాయి. ఈ రెండు యాప్స్ తర్వాత రోబ్లోక్స్ కార్పొరేషన్ డెవలప్ చేసిన రోబ్లోక్స్, అజూర్ డెవలప్ చేసిన కూకీ కార్వర్, సిబో గేమ్స్ డెవలప్ చేసిన సబ్వే సర్ఫర్ గేమ్స్ వరుసగా తర్వాత 5 స్థానాల్లో నిలిచాయి. కాగా, ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇన్‌స్టాల్ అయిన మొదటి ఐదు మొబైల్ గేమ్స్ యాప్స్‌గా రికార్డులకెక్కాయి.
టాప్ మొబైల్ గేమ్స్ వివరాలివే..
2021 అక్టోబర్‌లో గ్లోబల్ మొబైల్ గేమ్ మార్కెట్లో గారెనా ఫ్రీ ఫైర్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ అంతటా 4.5 బిలియన్ డౌన్‌లోడ్లను సృష్టించింది. ఈ యాప్ సంవత్సరానికి 1.3 శాతం డౌన్‌లోడ్లను నమోదు చేసింది.
గ్లోబల్ గేమ్ డౌన్‌లోడ్‌లకు భారతదేశం నంబర్ వన్ మార్కెట్. భారత దేశంలో అన్ని గేమ్స్ 762.6 మిలియన్ డౌన్‌లోడ్లను నమోదు చేశాయి. అంటే, ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం డౌన్‌లోడ్లలో ఇది 16.8 శాతం.
8.6 శాతం డౌన్‌లోడ్లతో యూఎస్ రెండవ స్థానంలో ఉండగా, బ్రెజిల్ 8.3 శాతంతో రెండవ స్థానంలో ఉంది.
పాపులర్ నెట్‌ఫ్లిక్స్ టీవీ సిరీస్ స్క్విడ్ గేమ్ నుంచి ప్రేరణ పొందిన మొబైల్ టైటిల్ గేమ్స్ క్యాండీ ఛాలెంజ్ 3D, కుకీ కార్వర్, అబి గేమ్ స్టూడియో అక్టోబర్‌లో మార్కెట్‌ను ముంచెత్తాయి. పైన పేర్కొన్న మూడు గేమ్స్ అంతటా ప్రపంచవ్యాప్తంగా 53.2 మిలియన్ ఇన్స్టాల్స్ను నమోదు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Latest Technology, Mobile game, PUBG