హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Garena Free Fire: భారత్​లో గరెనా ఫ్రీ ఫైర్‌ బ్యాన్‌ అయిపోయినట్టేనా?.. గేమ్‌ ఎంజాయ్‌ చేసేందుకు ఇలా చేయండి

Garena Free Fire: భారత్​లో గరెనా ఫ్రీ ఫైర్‌ బ్యాన్‌ అయిపోయినట్టేనా?.. గేమ్‌ ఎంజాయ్‌ చేసేందుకు ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల భారత ప్రభుత్వం మరో 54 చైనా యాప్​లపై నిషేధం విధించింది. ఈ యాప్​ లిస్ట్​లో పాపులర్​ గరెనా ఫ్రీ ఫైర్​ కూడా ఉంది. దీంతో, ఈ గేమ్​ లవర్స్​ నిరాశ చెందుతున్నారు. అయితే, గరెనా ఫ్రీ ఫైర్‌ బ్యాన్​ అయినప్పటికీ.. మరికొన్ని రోజుల పాటు ఆస్వాదించవచ్చు.

ఇంకా చదవండి ...

ఇటీవల భారత ప్రభుత్వం మరో 54 చైనా యాప్​లపై నిషేధం విధించింది. ఈ యాప్​ లిస్ట్​లో పాపులర్​ గరెనా ఫ్రీ ఫైర్​ కూడా ఉంది. దీంతో, ఈ గేమ్​ లవర్స్​ నిరాశ చెందుతున్నారు. అయితే,గరెనా ఫ్రీ ఫైర్‌ బ్యాన్​ అయినప్పటికీ.. మరికొన్ని రోజుల పాటు ఆస్వాదించవచ్చు.ఫ్రీ ఫైర్‌ఇల్యుమినేటెడ్‌, ఫ్రీ ఫైర్‌ మ్యాక్స్‌ అనే రెండు వెర్షన్స్‌ ఉన్నాయి. ఇప్పటికే, యాపిల్‌ తనయాప్‌ స్టోర్‌నుంచి రెండు ఫ్రీ ఫైర్‌ వెర్షన్లను తొలగించింది. గూగుల్‌ మాత్రం ప్లే స్టోర్‌నుంచి ఫ్రీ ఫైర్‌ఇల్యుమినేటెడ్‌ వెర్షన్‌ను మాత్రమే తొలగించింది. సెర్వర్లను కూడా డౌన్‌ చేయకపోవడంతో మరికొన్ని రోజుల పాటు గేమ్‌ను ఆస్వాదించే అవకాశం లభించింది. మరోవైపు, శామ్‌సంగ్‌ తన గెలాక్సీ స్టోర్​ నుంచిగరెనా ఫ్రీ ఫైర్‌ గేమ్​నుఇల్యుమినేటెడ్‌ వెర్షన్‌ ఇంకా గెలాక్సీ స్టోర్‌లో (Galaxy Store) అందుబాటులో ఉంది. మీరు ఫ్రీ ఫైర్‌ ఆడాలని అనుకొంటే గెలాక్సీ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే ఎన్ని రోజులు గేమ్‌ స్టోర్‌లో ఉంటుందనే అంశం చెప్పలేం. ఎప్పటికైనా నిబంధనల మేరకు శ్యామ్‌సంగ్‌ కూడా గెలాక్సీ స్టోర్‌ నుంచి ఫ్రీ ఫైర్‌ గేమ్‌ను తొలగించే అవకాశం ఉంది. యాపిల్‌ యాప్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి గరెనా ఫ్రీ ఫైర్‌ గేమ్‌ను తొలగించడంతో ఎంత కాలం యూజర్లు గేమ్‌ ఆడుకోగలరనేది తెలియదు.

ఎక్కువ కాలం గేమ్‌ అందుబాటులో ఉండదని చెప్పవచ్చు. గేమ్‌ను ఇండియాలో అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టామని గెరెనా చెబుతున్నా.. అది ఇప్పట్లో సాధ్యపడేలా మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికీ తమ స్మార్ట్‌ఫోన్లలో గేమ్‌ అన్‌ ఇన్‌స్టాల్‌ చేయని వారు.. ఫ్రీ ఫైర్‌ గేమ్‌ ఆడుతున్న సమయంలో సర్వర్ కనెక్షన్‌ సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ఎలాగైనా ఫ్రీ ఫైర్‌ గేమ్‌ ఆడాలని భావించే వాళ్లకు ఉన్న ఒకే ఒక అవకాశం ఏంటంటే.. గూగుల్‌ యాప్‌ స్టోర్‌లో ఇప్పటికీ అందుబాటులో ఉన్న గరెనా ఫ్రీ ఫైర్‌ మ్యాక్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడమే.

Smartphone: రూ.8,000 లోపే 6GB ర్యామ్‌తో స్మార్ట్‌ఫోన్... ఆ కంపెనీ సంచలనం

అయితే ఫ్రీ ఫైర్‌ మ్యాక్స్‌ యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో లేదు. కేవలం ఆండ్రాయిడ్‌ యూసర్స్‌ మాత్రమే గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఆడగలరు. ఇక, యాపిల్‌ యూసర్లు ఫ్రీ ఫైర్‌ లాంటి గేమ్‌లను ఆడాలంటే పబ్జీ మొబైల్‌ ఇండియా వెర్షన్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా లేదా కాల్‌ ఆప్‌ డ్యూటీ గేమ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫ్రీ ఫైర్‌ ఆడుతున్న ఫీలింగ్‌ యూసర్లకు ఉంటుంది. అయితే ఆ గేమ్‌లకు స్మార్ట్‌ ఫోన్‌లో ఎక్కువ ప్రాసెసింగ్‌ పవర్‌ అవసరమవుతుంది.

Realme 9 Pro Plus: హార్ట్ రేట్ సెన్సార్‌తో రియల్‌మీ 9 ప్రో ప్లస్ రిలీజ్

గరెనా ఫ్రీ ఫైర్‌ మేకర్స్‌ ఏం చెబుతున్నారు?

గరెనా ఫ్రీ ఫైర్‌ మేకర్స్‌ ఇండియాలో బ్యాన్‌ చేయడంపై స్పందించారు. తమది చైనాకు సంబంధించిన సంస్థ కాదని, గేమ్‌ను సింగపూర్‌లోని SEA Limited సంస్థ గేమ్‌ను డెవలప్‌ చేసిందని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయో తెలియనప్పటికీ.. ప్రస్తుతానికి గరెనా ఫ్రీ ఫైర్‌ మ్యాక్స్‌ను ఆడటం తప్ప మరో అవకాశం లేదు. అదీ ఎంత కాలమో కచ్చితంగా చెప్పలేని పరిస్థతి. అప్పటి వరకు ఆండ్రాయిడ్‌ యూసర్లకు గేమ్‌ను ఎంజాయ్‌ చేసే అవకాశం ఉంది. ఇండియాలో యాపిల్‌ యాప్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లే స్టోర్‌లో గరెనా ఫ్రీ ఫైర్‌ అందుబాటులో లేదనే విషయం తెలుసని, అందరు యూజర్లు గేమ్‌ను ఆడలేకపోతున్నారని ఫ్రీ ఫైర్‌ మేకర్స్‌ చెప్పారు.

పరిస్థతిని చక్కదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ఇండియాలోని యూజర్లకు అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు చెబుతున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అదే విధంగా భారత ప్రభుత్వం (Central Government) ఫిబ్రవరి 14 సోమవారం చైనా బేస్డ్‌గా పేర్కొంటూ 54 యాప్‌లను బ్యాన్‌ చేసింది. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించింది. అన్ని 54 యాప్‌లను యాపిల్‌ యాప్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లే యాప్‌ స్టోర్‌ నుంచి తొలగించారు.

First published:

Tags: FAKE APPS, Mobile game

ఉత్తమ కథలు