Home /News /technology /

Gaana HotShots: టిక్ టాక్ లాంటి ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన గానా

Gaana HotShots: టిక్ టాక్ లాంటి ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన గానా

Gaana HotShots: టిక్ టాక్ లాంటి ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన గానా
(image: Gaana)

Gaana HotShots: టిక్ టాక్ లాంటి ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన గానా (image: Gaana)

Gaana HotShots | టిక్ టాక్ యాప్‍ను బ్యాన్ చేయడంతో పెద్దపెద్ద కంపెనీలన్నీ అలాంటి ఫీచర్స్‌ని విడుదల చేస్తున్నాయి. మ్యూజిక్ స్ట్రీమింగ్ కంపెనీ గానా హాట్‌షాట్స్ పేరుతో వీడియో ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.

    మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన గానీ హాట్‌షాట్స్ పేరుతో సోషల్ మీడియా వీడియో ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్‌ టిక్ టాక్ లాగానే ఉంది. ఇప్పటికే యూజర్లు వీడియోలు క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. వీడియోలు, సక్సెస్ స్టోరీలు క్రియేట్ చేసి అప్‌లోడ్ చేయొచ్చని గానా చెబుతోంది. ఇప్పటికే హాట్‌షాట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలు, ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు మ్యూజిక్, కామెడీ, డ్యాన్స్ వీడియోలను 'హాట్‌షాట్ ఛాలెంజెస్' పేరుతో అప్‌లోడ్ చేస్తున్నారు. గానా హాట్‌షాట్స్‌లో రియాజ్ అలీ, అవ్నీత్ కౌర్, నేహా కక్కర్, దర్శన్ రావల్ లాంటి ప్రముఖ సెలబ్రిటీలు వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు.

    Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు జీ5 సబ్‌స్క్రిప్షన్ ఉచితం... యాక్టివేట్ చేయండి ఇలా

    Laptop: ఈ ల్యాప్‌టాప్‌ను 4జీ సిమ్ కార్డుతో వాడుకోవచ్చు


    భారతదేశంలో టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్‌ని ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో వాటికి ప్రత్యామ్నాయ యాప్స్‌ని రూపొందించే పనిలో ఉన్నారు భారతీయ ఔత్సాహికులు. టిక్ టాక్ లేని లోటును పూడ్చేందుకు కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి. గానా మ్యూజిక్ యాప్‌లోనే హాట్‌షాట్స్ వీడియో ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక టిక్ టాక్ యూజర్లు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ఎంచుకుంటున్నారు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. ఇది కూడా టిక్ టాక్ లాగానే ఉంటుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Gaana, Social Media, Tik tok, Tiktok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు