ఐఫోన్‌కు ఆండ్రాయిడ్ లాంటి చార్జింగ్ కేబుల్

ప్రతీ విషయంలో వైవిధ్యంగా ఉండే యాపిల్ ఇక ఆండ్రాయిడ్ దారిలో నడవబోతోందా? ఇకపై ఐఫోన్లకు ఆండ్రాయిడ్ లాంటి ఛార్జింగ్ కేబుల్ ఉండబోతుందన్న ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: July 9, 2018, 5:40 PM IST
ఐఫోన్‌కు ఆండ్రాయిడ్ లాంటి చార్జింగ్ కేబుల్
(image: News18.com)
  • Share this:
ఛార్జింగ్ పోర్ట్స్ విషయంలో వైవిధ్యంగా ఉండటం యాపిల్‌కు అలవాటు. కానీ ఇకపై ఆ రూటు మారుతోంది. ఇటీవల లీకైన యాపిల్ 18W ఛార్జింగ్ బ్రిక్‌ ఫోటో చూస్తే యాపిల్‌ కూడా యూఎస్‌బీ-సీ కనెక్షన్‌ను అందించనుందని అర్థమవుతోంది. కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లన్నీ యూఎస్‌బీ-సీతోనే వస్తున్నాయి. గతంలో ఉన్న యూఎస్‌బీ కనెక్టర్లతో పోలిస్తే యూఎస్‌బీ-సీ కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంది. కనెక్టర్లను ఎటువైపు నుంచైనా వాడుకోవచ్చు. అంతేకాదు మ్యాక్‌బుక్ ప్రో యూజర్లు తమ ఐఫోన్లను మ్యాక్‌బుక్‌కు కనెక్ట్ చేయొచ్చు. అదనంగా మరో కేబుల్ కొనాల్సిన అవసరం లేదు. డేటా ట్రాన్స్‌ఫర్ కూడా వేగంగా ఉంటుంది.

అయితే ఈ విషయంలో ఇంకా కొన్ని సందేహాలున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న లైటెనింగ్ కనెక్టర్లకు కొత్త ఐఫోన్స్ సపోర్ట్ చేస్తాయా అన్న అనుమానం ఉంది. సపోర్ట్ చేస్తే యూజర్లు పాత కేబుల్స్ ఉపయోగించుకోవచ్చు. లేదంటే కొత్త కేబుల్ కొనాల్సి వస్తుంది. అయితే లీకైన ఫోటోలపై యాపిల్ ఇప్పటి వరకు స్పందించలేదు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

First published: July 9, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు