కొంతమందికి లైఫ్ బోర్ కొట్టేస్తుంది. ఒక్కోసారి సోషల్ మీడియా కూడా నచ్చదు. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఎన్ని ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం వెంటాడుతుంది. ప్రతి నిమిషమూ భారంగా గడుస్తుంది. ఏం చేసినా నచ్చదు. ఏమీ తోచదు. క్షణమొక యుగంలా అనిపిస్తుంది. అది ప్రమాదకర పరిస్థితి. అలాంటి సమయంలో వాళ్లకు ఎంతో కొంత ఉపశమనం కలిగించే వెబ్‌సైట్లు కొన్ని ఉన్నాయి. అవి కొంత రిలీఫ్ ఇవ్వడమే కాక... కాస్త ఆనందం, ఆశ్చర్యం కలిగిస్తాయి కూడా. ఒక్కసారైనా అలాంటి వెబ్‌సైట్‌లోకి వెళ్లి రావాలని అనిపించేలా ఉంటాయవి. అలాంటి కొన్ని వెబ్‌సైట్లను ఇవాళ తెలుసుకుందాం.
* ఫ్రీగా విదేశీ భాష నేర్చుకోవాలని ఉందా? www.duolingo.com ఈ వెబ్ సైట్ లోకి వెళ్లండి. ఇందులో మీరు ఫలానా భాష నేర్చుకోవడమే కాదు... దాన్ని ఎలా పలకాలో కూడా వాయిస్ రూపంలో నేర్పిస్తారు. రోజూ ఐదు నిమిషాలు కేటాయించినా చాలు. ప్రతి రోజూ టెస్ట్ పెడతారు. తద్వారా ఆ రోజు నేర్చుకున్న పదాలపై అదే రోజు పట్టు వచ్చేస్తుంది.
* వర్షం, గాలి, పిడుగులు, చెట్లు ఊగేటప్పుడు వచ్చే శబ్దాలు మనకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అన్నీ మర్చిపోయి కాసేపు ఆ శబ్దాలు (ambience) వింటే టెన్షన్లు దూరమవుతాయి. అందుకోసం ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి... రెండు నిమిషాలు గడిపి... మళ్లీ మన స్టోరీలోకి వచ్చేయండి. www.donothingfor2minutes.com
* మన ప్రపంచంలో కాకుండా వేరే ప్రపంచం (వర్చువల్ వరల్డ్) లో విహరించాలని ఉందా. అక్కడైతే గేమ్స్ ఆడుకోవచ్చు. గాల్లో ఎగురుతూ వెళ్లొచ్చు. రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకోవచ్చు. మీలాగా ఆ ప్రపంచానికి వచ్చినవారితో చాటింగ్ చెయ్యొచ్చు. గోద్రెజ్ కంపెనీ తెచ్చిన ఆ వెబ్ సైట్ ఇదీ www.gojiyo.com
* మీరు పుట్టిన సంవత్సరంలో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేరిన ఇంగ్లీష్ పదమేదో తెలుసుకోవాలనుందా? ఈ వెబ్ సైట్‌లో మీ బర్త్ ఇయర్ ఎంటర చెయ్యండి చాలు. https://public.oed.com/oed-birthday-words
* సరదాగా గేమ్స్ ఆడుతూ బిడ్స్ గెలవాలనుకుంటున్నారా. ఐతే అలాంటి సైట్ కూడా ఉంది. వేలం (బిడ్)లో మీరు గెలిస్తే, ఆ వస్తువు లేదా ఆఫర్ మీదవుతుంది. ఫ్రీ డెలివరీ కూడా. ఇంకెందుకాలస్యం అలా వెళ్లి ఓ లుక్కెయ్యండి. www.quibids.com
* ప్రపంచంలో 700 కోట్లమందికి పైగా ఉన్నాం కదా. మనందరినీ పక్కపక్కన నిలబెడితే ఎలా ఉంటుంది. ఆ ప్రయత్నమే చేసింది ఈ వెబ్‌సైట్. మనందర్నీ ఓ చోటికి చేర్చి... ఆశ్చర్యం కలిగిస్తోంది. కొత్తగా పుట్టేవారిని ప్రతీ క్షణం ఆ లిస్టులో చేర్చుతూనే ఉంది. www.7billionworld.com
* మీరు ఎప్పుడైనా అంతరిక్షంలో విహరించారా? ఆ కిక్కు పొందాలంటే ఈ ఫ్రీ గేమ్ ఆడితే సరి. www.astroalpaca.com
* కాసేపు ఆహ్లాదం కలిగించేందుకు గినియా పిగ్‌లతో రూపొందించిన వెబ్ సైట్ ఇది. ఇందులో గినియా పిగ్‌ల వీడియోలు, ఫొటోలూ అలరిస్తాయి. www.guineapigarcade.com
* ఇంట్లో వస్తువులన్నింటినీ మిక్సీలో వేసి పౌడర్ చెయ్యాలనుందా? అదే మీ మొబైల్స్, వాచీలు, రిమోట్‌లు వంటివన్నీ. మిక్సీలో వేస్తే వాటి పరిస్థితేంటో తెలుసుకోవాలనుంటే ఈ వెబ్ సైట్ ఆన్సర్ ఇస్తోంది. www.willitblend.com
* నెయిల్ పాలిష్ వెయ్యడం కూడా ఓ ఆర్టే. దానితో ప్రపంచ గుర్తింపు పొందిన వాళ్లున్నారు. నెయిల్ పాలిష్‌పై ఓ గేమ్ ఉంది. అది ఆడాలంటే ఈ వెబ్ సైట్‌లోకి వెళ్లాల్సిందే. www.lacquerlacquer.com
* మీరు ఇప్పుడున్న ప్రదేశం నుంచీ ప్రపంచంలోని ఇంకేదైనా ప్రదేశానికి వెళ్లిపోవాలనుందా. జస్ట్ ఒక్క క్లిక్కులో వెళ్లిపోవచ్చు. అక్కడికి వెళ్లి అంతా చూసి... ఆ తర్వాత అక్కడి నుంచీ ఇంకెక్కడికైనా వెళ్లిపోవచ్చు. అలా వెళ్లాలంటే... ముందు ఈ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి. www.mapcrunch.com
ఇలాంటి మరిన్ని వెబ్‌సైట్ల సంగతులు తెలుసుకుందాం. కీప్ ఇన్ టచ్ విత్ https://telugu.news18.com
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Information Technology, Technology