ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) నార్డ్ పేరుతో అదిరిపోయే మొబైల్స్ (Mobiles) పరిచయం చేసిన సంగతి తెలిసిందే. గతేడాది Nord 2ని కూడా పరిచయం చేసింది. Nord 2T 5G ఫోన్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ నార్డ్ బ్రాండ్ కింద వచ్చిన ఫోన్స్ బాగా ఆకట్టుకున్నాయి. అయితే కంపెనీ అతి త్వరలోనే వన్‌ప్లస్ నార్డ్ 3 (OnePlus Nord 3), నార్డ్ వాచ్ (Nord Watch), నార్డ్ బ్యాండ్ (Nord Smart Band), కొత్త నార్డ్ బడ్స్ వంటి అనేక ప్రొడక్ట్స్ భారత్‌లో లాంచ్ చేయనుందని ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ వెల్లడించారు.
వన్‌ప్లస్ నార్డ్ 2 సక్సెసర్‌ను మరికొద్ది రోజులలోనే కంపెనీ విడుదల చేయనుంది. నార్డ్ స్మార్ట్ బ్యాండ్, ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్, స్మార్ట్ మెజరింగ్ స్కేల్, వాచ్‌ను కూడా కంపెనీ తీసుకురానుంది. ఇలా కంపెనీ భారతదేశంలో నార్డ్ బ్రాండింగ్ కింద చాలా డివైజ్‌లు లాంచ్ చేయడానికి సిద్ధం కావడం గమనార్హం. ఇక కొనుగోలుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న Nord 3 ఒక ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా రానుందని లీక్స్ పేర్కొంటున్నాయి. ఓ కొత్త లీక్ ప్రకారం, Nord 3 దాని ముందు విడుదలయిన Nord 2T కంటే అనేక అప్గ్రేడ్లతో విడుదల కానుంది.
Nord 3
Nord Watch
Nord Band
New Nord Buds
Nord smart measuring scale (not sure of the name)
and more Nord-branded AIoT products coming up.
— Mukul Sharma (@stufflistings) August 19, 2022
OnePlus Nord 3 స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈవెంట్ త్వరలోనే జరుగుతుందని లీక్‌స్టర్ వెల్లడించిన దాని ఇతర వివరాలను మాత్రం తెలపలేదు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ 150W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని టాక్. ఒకవేళ అదే నిజమైతే 150W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇచ్చే మొదటి Nord సిరీస్ ఫోన్ గా Nord 3 నిలుస్తుంది. అంతేకాకుండా, Nord 3 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్ప్లేతో రానుందట. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇందులో అందించారని తెలుస్తోంది.
నార్డ్ వాచ్ కూడా అందుబాటులోకి వస్తుందని లీక్‌స్టర్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ వాచ్ డిజైన్ రెండర్ల రూపంలో ఆన్లైన్లో కనిపించింది. నార్డ్ వాచ్ ఐదు మోడళ్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెండు స్క్వేర్ షేప్స్/డిస్ప్లేస్, మూడు సర్క్యులర్ షేప్స్‌లో రిలీజ్ అవుతాయి.
ఇది కూడా చదవండి : గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..? త్వరగా ఆ పని చేయండి.. లేదా ఇక అంతే సంగతులు..
ఇక వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ ఇండియాలో విడుదలయ్యే సమయం కూడా ఆసన్నమయింది. Nord Buds, Nord Buds CE బడ్జెట్ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ ఇప్పటికే మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. Nord Buds CE రూ.2,299 ధరతో లాంచ్ అయ్యింది. ఇది 20-గంటల బ్యాటరీ లైఫ్, కాల్స్ కోసం ANC ఫీచర్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IPX4 రేటింగ్‌తో వస్తుంది. కొత్తగా రిలీజ్ కానున్న ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ స్పెక్స్, లాంచ్ టైమ్ గురించి అధికారిక వివరాలు ఇప్పటివరకైతే తెలియరాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Oneplus, Smart phones, Smart watch, Tech news