ఆ యాప్ ఉంటే ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు!

ఊటీ నుంచి కోల్‌కతా వరకు ట్రైన్‌లో జర్నీ చేస్తున్న అనుభూతి పొందొచ్చు. కార్డ్‌బోర్డ్, ఏఆర్ ఉంటే... మీరు ఆ జర్నీ స్వయంగా చేస్తున్నట్టు ఫీలవొచ్చు.

news18-telugu
Updated: September 29, 2018, 5:08 PM IST
ఆ యాప్ ఉంటే ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు!
ఊటీ నుంచి కోల్‌కతా వరకు ట్రైన్‌లో జర్నీ చేస్తున్న అనుభూతి పొందొచ్చు. కార్డ్‌బోర్డ్, ఏఆర్ ఉంటే... మీరు ఆ జర్నీ స్వయంగా చేస్తున్నట్టు ఫీలవొచ్చు.
  • Share this:
మీరు పౌరాణిక చిత్రాల్లో నటులు ఒకచోట మాయమై మరోచోట ప్రత్యక్షమయ్యే సీన్లు చూసే ఉంటారు కదా? మరి మీక్కూడా అలాగే వెళ్లాలనుందా? గూగుల్ ఆర్ట్ అండ్ కల్చర్ యాప్‌తో ఇది సాధ్యం. అయితే మీరు ఎక్కడికీ మాయం కారు. కాకపోతే కూర్చున్నచోటే... మరో ప్రాంతంలో విహరించొచ్చు. ఉదాహరణకు మీరు హైదరాబాద్‌‌లో ఉన్నారనుకోండి. ఊటీ నుంచి కోల్‌కతా వరకు ట్రైన్‌లో జర్నీ చేస్తున్న అనుభూతి పొందొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సింది ఏంటంటే... గూగుల్ ఆర్ట్ అండ్ కల్చర్ యాప్‌లో ఆ జర్నీని సెలెక్ట్ చేసుకోవడమే. కార్డ్‌బోర్డ్, ఏఆర్ ఉంటే... మీరు ఆ జర్నీ స్వయంగా చేస్తున్నట్టు ఫీలవొచ్చు. ఇలా డార్జిలింగ్‌లో టాయ్ ట్రెయిన్‌లో విహరించొచ్చు కూడా.

రైల్వే శాఖ గూగుల్‌తో చేతులు కలిపి ఈ వినూత్న సేవల్ని అందిస్తోంది. 360 డిగ్రీ వ్యూతో మీరు ఇండియాలో ఏ ప్రాంతంలో అయినా చక్కర్లు కొట్టొచ్చు. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అమిత్ సూద్ మదిలో తట్టిన ఆలోచనే ఈ యాప్. ఆయన హైదరాబాద్‌ నుంచి కొయంబత్తూర్ ట్రెయిన్ జర్నీ చేసేవారు. ఆ రైలు ప్రయాణం గుర్తొచ్చినప్పుడల్లా ఆయనకు ఆనందం కలిగేది. అలా గుర్తుతెచ్చుకోవడమే కాదు... ప్రయాణిస్తున్నట్టు ఫీలవ్వాలన్న ఆలోచనతో వర్చువల్ జర్నీని నిజం చేశారు.

ఈ యాప్‌లో కేవలం ప్రయాణాలు మాత్రమే కాదు... చరిత్రను కళ్లకు కట్టే విశేషాలెన్నోఉన్నాయి. ఈస్ట్ ఇండియా రైల్వేకు చెందిన ఫెయిరీ క్వీన్, భారతదేశానికి చెందిన తొలి స్టీమ్ ఇంజిన్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, కోల్‌కతా ట్రామ్... ఇలా మీరు ఒక్కో నిమిషంలో ఒక్కో చోట ఉండొచ్చు. ఇలా పర్యాటకులకు సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు రైల్వే, గూగుల్ సంయుక్తంగా ప్రయత్నించడం విశేషం. మరికొన్ని ప్రాంతాలనూ ఇందులోకి తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి:Photos: అక్కడ సెల్ఫీ దిగితే సూపర్!

Video: టూర్ వెళ్తే ఈ 10 తీసుకెళ్తున్నారా?

Video: సోలో టూర్ వెళ్లేవారికి 15 టిప్స్! 
First published: September 29, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు