హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Social Media: ఫేస్‌బుక్, ట్విట్టర్‌ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్, ఇకపై..

Social Media: ఫేస్‌బుక్, ట్విట్టర్‌ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్, ఇకపై..

Social Media: ఫేస్‌బుక్, ట్విట్టర్‌ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్..

Social Media: ఫేస్‌బుక్, ట్విట్టర్‌ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్..

New Rules | ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్షల మంది వీటిని ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే ఇకపై సులభంగానే ఫిర్యాదు చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Online | కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా యూజర్లు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే, వాటిని పరిష్కరించేందుకు కొత్త రూల్స్ తీసుకువస్తోంది. యూజర్లు ఆన్‌లైన్‌లోనే ఫేస్ బుక్ (FaceBook), ట్విట్టర్‌పై (Twitter) కేంద్రానికి ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ మేరకు కేంద్రం ఇటీవలనే గ్రీవెన్స్ అప్పిలెట్ కమిటీలకు (జీఏసీ) సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌పామ్స్ సహా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అన్నింటికీ సంబంధించి ఫిర్యాదులు ఏమైనా ఉంటే.. కేంద్రానికి ఆన్‌లైన్ ద్వారానే తెలియజేయవచ్చు. దీని కోసం కేంద్రం కొత్త పోర్టల్ లాంచ్ చేయనుంది. మార్చి 1 నుంచి ఫిర్యాదులు స్వీకరించే అవకాశం ఉంది.

గత ఏడాది స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గత ఏడాది జీఏసీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించే వారు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే.. వారు ఎవరికి ఫిర్యాదు చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని, అయితే ఇకపై అలాంటి వారు ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.

ఈ ఎలక్ట్రిక్ కారుతో రూ.14 లక్షలు ఆదా.. ఒక్కసారి చార్జ్ చేస్తే 240 కి.మి వెళ్లొచ్చు!

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను లక్షల మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఆ ప్లాట్‌పామ్ కంపెనీలు మాత్రం యూజర్ల సమస్యలు తీర్చేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడానికి ఆయన తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్స్ కేవలం పేరుకు మాత్రమే గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమిస్తున్నాయని పేర్కొన్నారు. వీళ్ల వల్ల యూజర్లకు ఎలాంటి ప్రయోజనం కలుగడం లేదని అభిప్రాయపడ్డారు. ఇకపై అలా కాదని తెలిపారు. యూజర్లు వారి సమస్యలకు ఆన్‌లైన్ కంపెనీల నుంచి సరైన రెస్పాన్స్ పొందలేకపోతే వారు జీఏసీ ద్వారా కేంద్రానికి నేరుగా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.

ఎస్‌బీఐ కొత్త ఆఫర్ అదిరింది.. లోన్ తీసుకునే వారికి సూపర్ బెనిఫిట్స్!

ఈ కమిటీలు పూర్తిగా వర్చువల్ ఆధారంగా పనిచేస్తాయని ఆయ తెలిపారు. అంటే ఫిర్యాదు చేయడం దగ్గరి నుంచి ప్యానెల్ నిర్ణయం వరకు అన్నీ కూడా డిజిటల్ మార్గంలోనే జరుగుతాయి. ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే ఫిర్యాదు చేయొచ్చు. కమిటీలు యూజర్ల ఫిర్యాదుకు 30 రోజుల్లోగా స్పందిస్తాయని ఆయన తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జీఏసీ.గౌ.ఇన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. రానున్న వారాల్లో ఈ పోర్టల్ యాక్టివేట్ అవుతుందని తెలిపారు. ప్రస్తుతం ఇంకా ఈ పోర్టల్ అందుబాటులోకి రాలేదు. మొత్తంగా మూడు జీఏసీల ఏర్పాటు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వీటి వల్ల సోషల్ మీడియా యూజర్లకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.

First published:

Tags: Facebook, Online, Social Media, Twitter

ఉత్తమ కథలు