• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • FRENCH COMPANY DEVELOPS ARTIFICIAL HEART WITH LITHIUM ION BATTERIES SK

Artificial Heart: మార్కెట్లోకి బ్యాటరీతో నడిచే కృత్రిమ గుండె.. నిజంగానే ఇది సంజీవని

Artificial Heart: మార్కెట్లోకి బ్యాటరీతో నడిచే కృత్రిమ గుండె.. నిజంగానే ఇది సంజీవని

కృత్రిమ గుండె (Image:CARMAT)

సాధారణ మానవ గుండె కంటే ఈ కృత్రిమ గుండె మూడు రెట్లు అధిక బరువు ఉంటుంది. రక్తసరఫరా సాఫీగా జరిగేలా ఇందులో సెన్సర్లు, హైడ్రాలిక్‌ సిస్టమ్‌‌ను ఏర్పాటు చేశారు

  • Share this:
    మనిషి శరీరంలో ఎంతో కీలకమైన అవయవం గుండె. ఇది లేకుండా మనిషి బతకడు. గుండె ఆగిందో.. ఊపిరి కూడా ఆగుతుంది. ప్రాణం పోతుంది. ఏటా లక్షలాది మంది గుండె సంబంధ వ్యాధులతో మృత్యువాత పడుతున్నారు. ఐతే హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న వారికి సంజీవని వచ్చేసింది. ప్రపంచంలోనే అత్యాధునిక కృత్రిమ గుండెను ఫ్రాన్స్‌కు చెందిన ఓ కంపెనీ రూపొందించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలోనే ఇది అందరికీ అందుబాటులోకి రాబోతోంది. ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ వైద్య రంగంలో పెను సంచనాలను సృష్టించబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హృద్రోగుల పాలిట నిజంగానే సంజీవని అని చెబుతున్నారు.

    ఫ్రాన్స్‌కు చెందిన కర్నాట్ అనే కంపెనీ ఈ కృత్రిమ గుండెను తయారుచేసింది. లిథియం అయాన్ బ్యాటరీతో ఇది పనిచేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ హార్ట్‌ను యూరప్ దేశాల్లో విక్రయించేందుకు సంబంధింత నియంత్రణ సంస్థల నుంచి ఇప్పటికే అనుమతి లభించింది. హార్ట్‌ ఫెయిల్యూర్‌తో బాధపడే రోగులకు తమ కృత్రిమ గుండె అవయవం ద్వారా ఊరట కలుగుతుందని.. దీర్ఘకాలం రోగులకు బాసటగా నిలిస్తుందని కార్మెట్‌ సంస్థ వెల్లడించింది. కార్మెట్ సంస్థ 2018లోనే ప్రారంభమయింది. తాము తయరు చేసిన కృత్రిమ గుండెకు ఏసన్ (Aeson) అని పేరు పెట్టారు. ఈ ఏడాదిలోనే యూరప్‌లో వీటి విక్రయాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

    లిథియం అయాన్‌ బ్యాటరీపై నడిచే కృత్రిమ గుండె మానవ గుండెలానే పనిచేస్తుంది. దీని పనితీరును పసిగట్టేందుకు ప్రత్యేక పరికరం ఉంటుందని కార్మెట్ సంస్థ తెలిపింది. సాధారణ మానవ గుండె కంటే ఈ కృత్రిమ గుండె మూడు రెట్లు అధిక బరువు ఉంటుంది. రక్తసరఫరా సాఫీగా జరిగేలా ఇందులో సెన్సర్లు, హైడ్రాలిక్‌ సిస్టమ్‌‌ను ఏర్పాటు చేశారు. అధిక వ్యాయామానికి అనుగుణంగా ఈ పరికరంలో రియల్‌ టైమ్‌లో రక్త సరఫరాను సర్దుబాటు చేసే వ్యవస్థ ఉంటుంది. వైద్య రంగంలో గత 50 సంవత్సరాలుగా కృత్రిమ గుండెల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రపంచంలో 1937లో తొలిసారి ఓ కుక్కుకు కృత్రిమ గుండెను అమర్చారు. 30 సంవత్సరాల తర్వాత 1967లో మనిషికి కృత్రిమ గుండెను అమర్చారు.

    సాధారణంగా హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడే వారు దాతలపైనే ఆధారపడతారు. దాతల గుండెలు లభిస్తేనే వారు బతుకుతారు. లేదంటే చనిపోవడమే..! యూరప్‌లో 2వేల మంది హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో కొందరికి మాత్రమే దాతల ద్వారా గుండెలు లభిస్తాయి. మిగతా వారి పరిస్థితి ఊహించుకోవడం కష్టమే. అలాంటి వారికి ఈ కృత్రిమ గుండెలు పునర్జన్మ ప్రసాదించనున్నాయని కర్నాట్ సీఈవో స్టీఫెన్ పియట్ తెలిపారు. ఈ ఏడాది ఫ్రాన్స్, జర్మనీలో వేలాది మంది హృద్రోగులకు కృత్రిమ గుండెను అమర్చి కొత్త జీవితం ప్రసాదిస్తామని పేర్కొన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: