TV Offer | కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం కాబోతోంది. మార్చి 22న ఉగాది పండుగ వస్తోంది. మీరు ఈ పండుగకు కొత్త స్మార్ట్ టీవీ (Smart TV) కొనుగోలు చేయాలని భావిస్తే.. అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. భారీ డిస్కౌంట్ (Discount) సొంతం చేసుకోవచ్చు. అందువల్ల మీరు కొత్త టీవీ కోసం చూస్తూ ఉంటే మాత్రం ఈ ఆఫర్‌ను మిస్ చేసుకోవచ్చు. ఏకంగా రూ. 25 వేలకు పైగా తగ్గింపు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.
క్రోమా వెబ్‌సైట్‌లో మీ కోసం స్మార్ట్ టీవీలపై కళ్లుచెదిరే ఆఫర్లు లభిస్తున్నాయి. ఫాక్స్‌స్కై ఎఫ్ఎస్ఎఫ్‌హెచ్‌ఎస్ 101 సెంటీమీటర్లు లేదా 40 ఇంచుల స్మార్ట్‌టీవీపై సూపర్ ఆఫర్ ఉంది. ఈ స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 38,499గా ఉంది. అయితే మీరు ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 12,999కే పొందొచ్చు. అంటే మీరు ఈ టీవీపై నేరుగానే రూ. 25,500 లేదా 66 శాతం మేర తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు.
రూ.10 వేల కన్నా తక్కువకే అదిరిపోయే ఫ్రిజ్.. నెలకు రూ.550 కడితే మీ సొంతం
అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీపై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీని మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే మీకు అదనంగా రూ. 2 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే అప్పుడు మీరు ఈ టీవీ ఇంకా తక్కువకే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ స్మార్ట్ టీవీపై మీరు తక్కువ ఈఎంఐ ఆప్షన్ సొంతం చేసుకోవచ్చు.
సూపర్ డూపర్ ఆఫర్.. రూ.16,000 టీవీ రూ.5 వేలకే.. వడ్డీ లేకుండా ఈఎంఐలో కొనొచ్చు!
నెలవారీ ఈఎంఐ రూ. 612 నుంచి ప్రారంభం అవుతోంది. ఇది 24 నెలలకు వర్తిస్తుంది. అదే మీరు 18 నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 811 చెల్లించాలి. లేదంటే ఏడాది పాటు ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 1167 పడుతుంది. అదే 9 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 1530 చెల్లించాలి. ఆరు నెలల ఈఎంఐ టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ. 2256 పడుతుంది. ఇలా మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన ఈఎంఐ మొత్తం కూడా మారుతుంది.
కాగా ఈ స్మార్ట్ టీవీలో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, ఒక హెచ్‌డీఎంఐ పోర్ట్, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. బిల్ట్ ఇన్ వైఫై ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. 30 వాట్ స్పీకర్ ఉంది. ఇంకా బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్, క్వాడ్ కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మీరు ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ , డిస్నీ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి యాప్స్ ఇందులో చూడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget smart tv, Latest offers, Offers, Smart TV, Smart tvs