TV Offers | కొత్త టీవీ కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. తక్కువ ధరకే స్మార్ట్ టీవీని (Smart TV) కొనుగోలు చేయొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే. ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టుల విక్రయ సంస్థ క్రోమా ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. క్రోమా వెబ్సైట్లో మీరు ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధరకే స్మార్ట్ టీవీ (TV) కొనొచ్చు.
క్రోమా వెబ్సైట్లో ఫాక్స్‌స్కై స్మార్ట్ టీవీ కేవలం రూ. 6740కే అందుబాటులో ఉంది. ఇది పరిమిత కాల ఆఫర్. ఈ టీవీ ఎంఆర్పీ రూ. 22,499. అంటే మీకు ఈ టీవీ ఏకంగా 70 శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఫాక్స్‌స్కై 32 అంగుళాల హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ 2021 మోడల్‌కు ఈ రేటు వర్తిస్తుంది. ఈ టీవీపై ఇంకా ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్మార్ట్ టీవీలకు జనాల్లో ఫుల్ క్రేజ్.. తెగ కొనేస్తున్నారు!
బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్ఎస్బీసీ బ్యాంక్ కస్టమర్లు వారి క్రెడిట్ కార్డు ద్వారా ఈ టీవీని కొనుగోలు చేస్తే 7.5 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు కూడా ఆఫర్ ఉంది. బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ టీవీని కొంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ల కూడా డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ ఆఫర్లు కలుపుకుంటే ఇంకా తక్కువ ధరకే టీవీని కొనుగోలు చేయొచ్చు.
రూ.45,000 స్మార్ట్ టీవీ కేవలం రూ.13 వేలకే.. అమెజాన్ భారీ ఆఫర్!
అలాగే ఈ టీవీని ఈఎంఐ ఆప్షన్లో కూడా కొనుగోలు చేయొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 317 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల ఈఎంఐ టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే ఏడాది ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 605 చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 1170 కట్టాలి. మూడు నెలల ఈఎంఐ ఎంచుకుంటే నెలకు రూ. 2295 పడుతుంది. 18 నెలలు అయితే నెలకు రూ. 420 చెల్లించాల్సి వస్తుంది.
ఇకపోతే ఈ స్మార్ట్ టీవీలో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 2 హెచ్డీఎంఐ పోర్టులు, 2 యూఎస్బీ పోర్టులు, వైఫై, ఆండ్రాయిడ్ ఓఎస్, 30 వాట్ స్పీకర్లు, డాల్బే ఆడియో, ఏ ప్లస్ గ్రేడ్ ప్యానెల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్ , ప్రైమ్ వీడియో, జీ5, ఈరోస్ నౌ, జియో సినిమా, సోనీ లివ్ వంటి పాపులర్ యాప్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget smart tv, Latest offers, Offers, Smart TV