హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Microsoft: యూజర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న విండోస్ 12 రిలీజ్ ఎప్పుడంటే..?

Microsoft: యూజర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న విండోస్ 12 రిలీజ్ ఎప్పుడంటే..?

మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్

మెక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన విండోస్‌తో ప్రపంచ‌వ్యాప్తంగా కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు పనిచేస్తున్నాయి. గతేడాది ఈ సంస్థ విండోస్ 11ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. విండోస్ 11కు సంబంధించి ఈ ఏడాది మేజర్ అప్ డేట్ తీసుకొస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

ఇంకా చదవండి ...

మెక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన విండోస్‌తో ప్రపంచ‌వ్యాప్తంగా కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు పనిచేస్తున్నాయి. గతేడాది ఈ సంస్థ విండోస్ 11ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. విండోస్ 11కు సంబంధించి ఈ ఏడాది మేజర్ అప్ డేట్ తీసుకొస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇందు కోసం ‘‘కొత్త విండోస్ ఇంజనీరింగ్ షెడ్యూల్‌’’ను ప్రకటించే యోచనలో ఉంది. విండోస్ సెంట్రల్ రిపోర్ట్ ప్రకారం.. విండోస్ క్లయింట్ల కోసం ఇకపై ప్రతి మూడేళ్లకోసారి మేజర్ వెర్షన్ విండోస్‌ను తీసుకురావడానికి మైక్రోసాఫ్ట్ ప్లాన్ చేస్తోంది. దీనిబట్టి చూస్తే 2024లో విండోస్ 12 అందుబాటులోకి రానుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న విండోస్ ప్రస్తుత వెర్షన్ కోసం విడుదల చేసిన కొత్త ఫీచర్ల అవుట్‌పుట్‌ను కూడా మరింత పెంచుతుందని విండోస్ సెంట్రల్ రిపోర్ట్ పేర్కొంది.

* న్యూ మూమెంట్ ఫీచర్

విండోస్ సెంట్రల్ రిపోర్ట్ ప్రకారం.. మెక్రోసాఫ్ట్ విండోస్ 11 వెర్షన్‌లో 22H2 (సన్ వ్యాలీ 2)తో కొత్త “మూమెంట్స్” ఫీచర్‌ను ప్రారంభిస్తోంది. ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ మినహా సంవత్సరం పొడవునా కీలకమైన పాయింట్లలో కంపెనీ కొత్త ఫీచర్లు, అనుభవాలను పరిచయం చేయడానికి ఈ ఫీచర్‌ను డెవలప్ చేసింది. ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న విండోస్ వెర్షన్ కోసం మైక్రోసాఫ్ట్ ప్రతి కొన్ని నెలలకోసారి కొత్త ఫీచర్‌లను విడుదల చేయనుందని సదరు రిపోర్ట్ పేర్కొంది. అంటే సంవత్సరానికి నాలుగు సార్లు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ సంప్రదాయం 2023 నుంచి ప్రారంభమవుతుంది. ఎటువంటి మేజర్ అప్‌డేట్ విడుదల చేయకుండానే ఈ సంవత్సరం ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ వాతావరణ సమాచారాన్ని టాస్క్ బార్‌లో చేర్చిన సంగతి తెలిసిందే.

 ఇదీ చదవండి:  మోదీ వ్యక్తి కాదు.. ఓ శక్తి ! ప్రజల మనస్సులు మార్చే శాస్త్రం ఆయన సొంతం: సీనియర్‌ జర్నలిస్ట్‌ అజయ్‌ సింగ్‌


కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడం కోసం కంపెనీ ప్రధాన విండోస్‌లను అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉండదు. యూజర్లు విండోస్ 11లో Androidను యాప్‌గా ఇన్ స్టాల్ చేసుకోవడం కోసం సంస్థ విండోస్ సబ్‌సిస్టమ్‌ను విడుదల చేసింది. ఓఎస్ మొదట ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ సబ్ సిస్టమ్.. విడోస్ ప్రతి కొత్త వెర్షన్‌ను మరింత ఉత్తేజపరిచేలా చేస్తుంది. తద్వారా కంపెనీ కొత్త ఫీచర్‌లను రూపొందించి, వాటిని యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు ఏవైనా బగ్‌లు ఉంటే గుర్తించి స్క్వాష్ చేయడానికి ఎక్కువ సమయం ఉంటుందని విండోస్ సెంట్రల్ రిపోర్ట్ పేర్కొంది.

గత కొన్నేళ్లుగా మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న మార్గానికి ఇది భిన్నమైందని రిపోర్ట్ తెలిపింది. ఇది పెద్ద మార్పుకు సంకేతమని అభిప్రాయపడింది. కాగా, ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ ప్రతి సంవత్సరం విండోస్10 ఓఎస్‌కు సంబంధించి రెండు ప్రధాన కొత్త వెర్షన్‌లను విడుదల చేసేది. ఈ పద్ధతి మొదట్లో 2015ను నుంచి అనుసరిస్తోంది. అయితే విండోస్ 11తో కంపెనీ ప్రతి సంవత్సరం ఒక ప్రధాన కొత్త వెర్షన్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అంతర్గత ప్రణాళికలు మరింత మారే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి మెక్రోసాఫ్ట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Published by:Mahesh
First published:

Tags: Microsoft, New features, Tech news, Windows

ఉత్తమ కథలు