ఫోర్ట్‌నైట్ గేమ్: 21 రోజుల్లో 2.3 కోట్ల యూజర్స్

పీసీలో సెన్సేషన్‌గా మారిన ఫోర్ట్‌నైట్ గేమ్ ఇప్పుడు మొబైల్స్‌లోనూ రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్ లవర్స్‌ని ఊపేస్తోంది ఫోర్ట్‌నైట్ ఫీవర్. ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌పై 21 రోజుల్లో 23 మిలియన్ల యూజర్లతో రికార్డ్ సృష్టించింది ఫోర్ట్‌నైట్.

news18-telugu
Updated: September 10, 2018, 11:51 AM IST
ఫోర్ట్‌నైట్ గేమ్: 21 రోజుల్లో 2.3 కోట్ల యూజర్స్
పీసీలో సెన్సేషన్‌గా మారిన ఫోర్ట్‌నైట్ గేమ్ ఇప్పుడు మొబైల్స్‌లోనూ రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్ లవర్స్‌ని ఊపేస్తోంది ఫోర్ట్‌నైట్ ఫీవర్. ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌పై 21 రోజుల్లో 23 మిలియన్ల యూజర్లతో రికార్డ్ సృష్టించింది ఫోర్ట్‌నైట్.
  • Share this:
ఫోర్ట్‌నైట్ గేమ్... ఇప్పుడు గేమింగ్ వాల్డ్‌లో ఓ సంచలనం. ఆగస్ట్ 9న ఫోర్ట్‌నైట్ మొబైల్‌ని సాంసంగ్ గెలాక్సీ నోట్ 9తో పాటు ఇతర గెలాక్సీ డివైజ్‌లల్లో లాంఛ్ చేశారు. ఆ తర్వాత మిగతా ఆండ్రాయిడ్ యూజర్లకు చేరువైంది ఈ గేమ్. అంతకుముందు ఈ గేమ్ ఐఓఎస్‌లో మాత్రమే ఎక్స్‌క్లూజీవ్‌గా లభించేది. ఇప్పుడు ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన 21 రోజుల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఎపిక్ గేమ్స్ కథనం ప్రకారం ఆండ్రాయిడ్‌లోనే 2 కోట్ల 30 లక్షల ప్లేయర్స్ ఉన్నారు. కోటిన్నర మంది ఏపీకేతో ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అయితే ఈ గేమ్ ఎపిక్ గేమ్స్ వెబ్‌సైట్ ద్వారా ఆండ్రాయిడ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో లభించదు.

ప్రస్తుతం ఎపిక్ గేమ్స్ ఫోర్ట్‌నైట్ గేమ్‌ ప్రతీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచేలా ప్రయత్నిస్తోంది. ఏఆర్ఎం, క్వాల్కమ్, ఇమాజినేషన్ టెక్నాలజీస్, రేజర్, హాయ్‌సిలికాన్ లాంటి వాళ్లతో సంప్రదింపులు జరుపుతోంది కంపెనీ. ఈ యాప్ ఆండ్రాయిడ్ అఫిషియల్ ‌కాకపోవడంతో యాప్‌లో వచ్చే సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోంది. అంతేకాదు... 'ఫోర్ట్‌నైట్ ఫర్ ఆండ్రాయిడ్' పేరుతో అనధికారికంగా ఉన్న 47 వెబ్‌సైట్లపైనా చర్యలు తీసుకుంటోంది.

ఫోర్ట్‌నైట్ గేమ్: 21 రోజుల్లో 2.3 కోట్ల యూజర్స్, FORTNITE REACHES 15 MILLION DOWNLOADS ON ANDROID JUST 21 DAYS AFTER RELEASE

అసలేంటి ఈ గేమ్?
ఫోర్ట్‌నైట్... ఎపిక్ గేమ్స్ సంస్థ తయారు చేసిన గేమ్ ఇది. గేమింగ్ లవర్స్‌కు ఈ గేమ్ అంటే పిచ్చి. ప్రస్తుతం రెండు వర్షన్లలో ఉంది ఈ గేమ్. అందులో ఒకటి 'సేవ్‌ ద వాల్డ్'. నలుగురు ప్లేయర్లు ఒకరికొకరు సహకరించుకుంటూ ఓ లక్ష్యాన్ని ఛేదించడమే ఈ గేమ్ ప్రత్యేకత. ఇక 'బ్యాటిల్ రాయల్' రెండో వర్షన్. ఇది ప్లేయర్ వర్సెస్ ప్లేయర్ గేమ్. వందమంది ప్లేయర్లు ఒకేసారి ఆడొచ్చు. లేదా ఇద్దరు, నలుగురు స్క్వాడ్స్ ఈ గేమ్ ఆడొచ్చు. తమను తాము రక్షించుకుంటూ ప్రత్యర్థులను హతమారుస్తూ ముందుకెళ్లడమే ఈ గేమ్. ఇన్నాళ్లూ ఈ గేమ్ కేవలం కంప్యూటర్‌లో మాత్రమే ఉండేది. ఇటీవల స్మార్ట్‌ఫోన్లకు రిలీజ్ చేశారు.

గూగుల్ ప్లే స్టోర్‌లో ఎందుకు లేదు?
ఫోర్ట్‌నైట్ గేమ్ ద్వారా ఒక్క ఏప్రిల్‌లోనే అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఫోర్ట్‌నైట్ సుమారు రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందినట్టు సూపర్ డేటా రీసెర్చ్ అధ్యయనంలో తేలింది. ఈ ఏడాది 13 వేల కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా. ఇలాంటి ఎన్నో గేమ్స్‌కి ప్లాట్‌ఫామ్ గూగుల్ ప్లేస్టోర్. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న ఫోర్ట్‌నైట్ మాత్రం లభించదు. ఈ గేమ్‌ను ప్లే స్టోర్‌లో లిస్ట్ చేయకపోవడంతో గూగుల్‌కు రూ.350 కోట్ల నష్టం వాటిల్లనుందని అంచనా. ప్లేస్టోర్‌లో వెళ్లి ఫోర్ట్‌నైట్ అని సెర్చ్ చేస్తే అందుబాటులో లేదు అని మెసేజ్ చూపిస్తోంది.
ఫోర్ట్‌నైట్ గేమ్: 21 రోజుల్లో 2.3 కోట్ల యూజర్స్, FORTNITE REACHES 15 MILLION DOWNLOADS ON ANDROID JUST 21 DAYS AFTER RELEASE
screenshot: Playstore


మరి ఫోర్ట్‌నైట్ గేమ్ ప్లేస్టోర్‌లో లభించకపోవడానికి కారణం ఆదాయంలో 30శాతం వాటా గూగుల్ అడుగుతుండటమే కారణమన్న వాదన ఉంది. ఓ యాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తయారీదారుడితో పాటు గూగుల్ పంచుకోవడం మామూలే. అయితే ఎపిక్ గేమ్స్ మాత్రం ప్లేస్టోర్‌ను పట్టించుకోకుండా నేరుగా తమ వెబ్‌సైట్‌లోనే గేమ్‌ను అందుబాటులో ఉంచింది. యూజర్లు ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేసి తమ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లు ఇలా థర్డ్ పార్టీ నుంచి యాప్స్ ఇన్‌స్టాల్ చేయడానికి మొదట అనుమతించవు. 'ఇన్‌స్టాల్ ఫ్రమ్ అన్‌నోన్ సోర్స్' క్లిక్ చేసి వేరే యాప్స్ ఇన్‌స్టాల్ చేయడం చాలామందికి అలవాటు. అయితే దీనివల్ల సెక్యూరిటీ రిస్క్ ఉంటుంది. ఇక యాపిల్ కూడా ఆదాయంలో 30 శాతం వాటా అడుగుతోంది. యాపిల్ డివైజ్‌లల్లో థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేయడం కుదరదు కాబట్టి ఎపిక్ గేమ్స్ సంస్థ ఫోర్ట్‌నైట్‌ని యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంచింది.

ఇవి కూడా చదవండి:

టాప్ 5 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్!

Video: క్రెడిట్ కార్డ్స్... తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

స్పోర్ట్స్, రేసింగ్ గేమ్ యాప్స్‌దే హవా!

క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

సెప్టెంబర్ 12న 'జియో ఫోన్ 2' ఫ్లాష్ సేల్

ఇండియాలో లాంఛైన వివో వీ11 ప్రో!
Published by: Santhosh Kumar S
First published: September 10, 2018, 11:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading