ఫోర్ట్‌నైట్ గేమ్: మీ ఫోన్‌లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లల్లో ఇక ఫోర్ట్‌నైట్ గేమ్ ఆడొచ్చు. ఈ గేమ్‌ని తయారు చేసిన ఎపిక్ గేమ్స్ బీటా పీరియడ్‌ని ముగించడంతో మీ ఆండ్రాయిడ్ డివైజ్‌లో ఫోర్ట్‌నైట్ డౌన్‌లోడ్ చేసుకొని దర్జాగా ఆడొచ్చు. అయితే గూగుల్ ప్లే స్టోర్‌లో కాకుండా అఫిషియల్ సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఆడొచ్చు.

news18-telugu
Updated: October 12, 2018, 4:50 PM IST
ఫోర్ట్‌నైట్ గేమ్: మీ ఫోన్‌లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Image: AFP Relaxnews
  • Share this:
ఫోర్ట్‌నైట్ గేమ్... గేమింగ్ వాల్డ్‌లో ఓ సంచలనం. రిలీజ్ అయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్ లవర్స్‌ని ఊపేస్తోంది ఫోర్ట్‌నైట్ ఫీవర్. ఈ గేమ్ మొదట్లో ఐఓఎస్‌లో మాత్రమే ఎక్స్‌క్లూజీవ్‌గా లభించేది. గూగుల్‌తో లావాదేవీల విషయంలో తేడా రావడంతో ఈ గేమ్‌ని ఆ కంపెనీ ప్లేస్టోర్‌లో రిలీజ్ చేయలేదు. అయినా ఈ గేమ్‌కి విపరీతమైన డిమాండ్ వచ్చింది. నెలకు అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఫోర్ట్‌నైట్ సుమారు రెండు వేల కోట్ల రూపాయలకు పైనే ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఈ గేమ్‌ను ప్లే స్టోర్‌లో లిస్ట్ చేయకపోవడంతో గూగుల్‌కే వందల కోట్ల నష్టం.

సాంసంగ్‌కు చెందిన కొన్ని ఫోన్లల్లో మాత్రమే ఫోర్ట్‌నైట్ గేమ్ అందుబాటులో ఉండేది. ఫోర్ట్‌నైట్ గేమ్ ఆడలేకపోవడం ఆండ్రాయిడ్ యూజర్లకు ఇన్నాళ్లూ పెద్ద లోటే. ఇప్పుడా లోటు తీరనుంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పైకి ఫోర్ట్‌నైట్ వచ్చేసింది. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లల్లో ఇక ఫోర్ట్‌నైట్ గేమ్ ఆడొచ్చు. ఈ గేమ్‌ని తయారు చేసిన ఎపిక్ గేమ్స్ బీటా పీరియడ్‌ని ముగించడంతో మీ ఆండ్రాయిడ్ డివైజ్‌లో ఫోర్ట్‌నైట్ డౌన్‌లోడ్ చేసుకొని దర్జాగా ఆడొచ్చు. అయితే గూగుల్ ప్లే స్టోర్‌లో కాకుండా అఫిషియల్ సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఆడొచ్చు.

Loading...
ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
ముందుగా మీరు సపోర్టెడ్ డివైజ్‌ల లిస్ట్ చూడాలి.
ఓఎస్: ఆండ్రాయిడ్ 8.0 లేదా అంతకన్నా ఎక్కువ, 64 బిట్
ర్యామ్: 4 జీబీ లేదా అంతకన్నా ఎక్కువ
జీపీయూ: అడ్రినో 530 లేదా అంతకన్నా ఎక్కువ, మాలి-జీ71 ఎంపీ20, మాలి-జీ72 ఎంపీ12 లేదా అంతకన్నా ఎక్కువ
మీ ఆండ్రాయిడ్‌ డివైజ్‌లో fortnite.com/android లోకి వెళ్లాలి. లేదా కింద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.

ఫోర్ట్‌నైట్ గేమ్: మీ ఫోన్‌లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!, Fortnite is Now on Android For Everyone: Here is How to Download, And Compatible Devices
ఫోర్ట్‌నైట్ గేమ్ క్యూఆర్ కోడ్


ఫోర్ట్‌నైట్ బీటా సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్స్ ఇవే...
సాంసంగ్ గెలాక్సీ: ఎస్7/ఎస్7 ఎడ్జ్, ఎస్8/ఎస్8+, ఎస్9/ఎస్9+, నోట్ 8, నోట్ 9, ట్యాబ్ ఎస్‌3, ట్యాబ్ ఎస్4
గూగుల్: పిక్సెల్/పిక్సెల్ ఎక్స్ఎల్, పిక్సెల్ 2/పిక్సెల్ 2 ఎక్స్ఎల్
హువావే: హానర్ 10, హానర్ ప్లే, మేట్ 10/ప్రో, మేట్ ఆర్ఎస్, నోవా 3, పీ20/ప్రో, వీ10
ఎల్‌జీ: జీ5, జీ6, జీ7, థింక్యూ, వీ20, వీ30/ వీ30+
ఏసుస్: రోగ్ ఫోన్, జెన్‌ఫోన్ 4 ప్రో, 5జెడ్, వీ
ఎసెన్షియల్: పీహెచ్-1
షావోమీ: బ్లాక్‌షార్క్, ఎంఐ5/5ఎస్/5ఎస్ ప్లస్, 6ఎస్/6ఎస్ ప్లస్, ఎంఐ 8/ 8 ఎక్స్‌ప్లోరర్/8ఎస్‌ఈ, ఎంఐ మిక్స్, ఎంఐ మిక్స్ 2, ఎంఐ మిక్స్ 2ఎస్, ఎంఐ నోట్ 2
జెడ్‌టీఈ: ఆక్సన్ 7/7ఎస్, ఆక్సన్ ఎం, నుబియా/జెడ్ 17/జెడ్ 17ఎస్, నుబియా జెడ్ 11
నోకియా: 8
వన్‌ప్లస్: 5/5టీ, 6
రేజర్: ఫోన్

ఫోర్ట్‌నైట్ గేమ్: మీ ఫోన్‌లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!, Fortnite is Now on Android For Everyone: Here is How to Download, And Compatible Devices

అసలేంటి ఈ గేమ్?
ఫోర్ట్‌నైట్... ఎపిక్ గేమ్స్ సంస్థ తయారు చేసిన గేమ్ ఇది. గేమింగ్ లవర్స్‌కు ఈ గేమ్ అంటే పిచ్చి. ప్రస్తుతం రెండు వర్షన్లలో ఉంది ఈ గేమ్. అందులో ఒకటి 'సేవ్‌ ద వాల్డ్'. నలుగురు ప్లేయర్లు ఒకరికొకరు సహకరించుకుంటూ ఓ లక్ష్యాన్ని ఛేదించడమే ఈ గేమ్ ప్రత్యేకత. ఇక 'బ్యాటిల్ రాయల్' రెండో వర్షన్. ఇది ప్లేయర్ వర్సెస్ ప్లేయర్ గేమ్. వందమంది ప్లేయర్లు ఒకేసారి ఆడొచ్చు. లేదా ఇద్దరు, నలుగురు స్క్వాడ్స్ ఈ గేమ్ ఆడొచ్చు. తమను తాము రక్షించుకుంటూ ప్రత్యర్థులను హతమారుస్తూ ముందుకెళ్లడమే ఈ గేమ్. ఇన్నాళ్లూ ఈ గేమ్ కేవలం కంప్యూటర్‌లో మాత్రమే ఉండేది. పీసీలో సెన్సేషన్‌గా మారిన ఫోర్ట్‌నైట్‌ గేమ్‌ను కొంతకాలం క్రితం స్మార్ట్‌ఫోన్లకు రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

ఇంటర్నెట్ బంద్... మీరేం చేయాలో తెలుసా?

ఇంపోర్ట్ టారిఫ్ ఎఫెక్ట్: స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి!

ఆధార్ నెంబర్‌ చెప్తే అప్పు ఇచ్చేస్తారు!

ఎల్‌ఐసీ పాలసీ లాప్స్ అయిందా? అక్టోబర్ 15 లోగా రివైవల్‌ చేయొచ్చు!

ఇండియాలో లాంఛైన నోకియా 3.1 ప్లస్

బనానా ఫోన్(నోకియా 8110) రిలీజ్ చేసిన నోకియా!

Photos: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్: వీడియో గేమ్స్‌పై భారీ ఆఫర్లు

Photos: 2018లో మదుపరులకు గుండెకోత మిగిల్చిన 10 స్టాక్స్ ఇవే!
First published: October 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...