స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఎక్కువమంది సబ్స్క్రైబర్లను పొందేందుకు కొన్ని మార్కెట్లలో ఇప్పటికే యాడ్-సపోర్టెడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అలాగే ఆ మార్కెట్లలో ఫ్రీ పాస్వర్డ్ షేరింగ్ విధానాన్ని ముగించింది. మాజీ CEO రీడ్ హేస్టింగ్స్ 2022లోనే పాస్వర్డ్ షేరింగ్ ఆప్షన్(Password Sharing Option) యూజర్లకు దశలవారీగా డిస్కంటిన్యూ అవుతుందని స్పష్టం చేశారు. అయితే బ్లూమ్‌బర్గ్‌కి ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో.. వినియోగదారులందరికీ(Customers) పాస్వర్డ్ షేరింగ్ త్వరలో ముగుస్తుందని కుండబద్దలు కొట్టారు నెట్‌ఫ్లిక్స్ Co-CEOలు గ్రెగ్ పీటర్స్, టెడ్ సరండోస్. అంటే ప్రస్తుతం షేర్డ్ పాస్‌వర్డ్‌ల ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ను ఉపయోగిస్తున్న ఇండియన్ యూజర్లు త్వరలో వారి సొంత సబ్స్క్రిప్షన్ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌ను షేర్డ్ పాస్‌వర్డ్‌ల ద్వారా ఫ్రీగా ఉపయోగిస్తున్న యూజర్లు త్వరలో దాని కోసం డబ్బులు చెల్లించక తప్పదని తెలిపారు నెట్‌ఫ్లిక్స్ కో-సీఈఓ పీటర్స్. పాస్వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేసిన తర్వాత కూడా యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌పై నెట్‌ఫ్లిక్స్ రాజీపడదని కూడా పేర్కొన్నారు. ఈ చర్య కొంత మంది కస్టమర్లను అసంతృప్తికి గురిచేసినా.. భారతదేశం వంటి దేశాలపై దృష్టి సారించి సబ్స్క్రైబర్ల సంఖ్యను 15-20 మిలియన్లకు పెంచడమే తమ లక్ష్యం అన్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ఫ్రీగా చూసే యూజర్లు చివరికి పెయిడ్ పాస్వర్డ్ షేరింగ్ లేదా ఓన్ సబ్స్క్రిప్షన్ కోసం మనీ చెల్లిస్తారని తాను కోరుకుంటున్నట్లు పీటర్స్ చెప్పారు.
* కంపెనీపై ప్రభావం
నెట్‌ఫ్లిక్స్ 2023 తొలి త్రైమాసికంలో పాస్వర్డ్ షేరింగ్ కోసం దాని పెయిడ్ పాస్వర్డ్ షేరింగ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను విస్తరించాలని యోచిస్తోంది. ఈ మార్పు కారణంగా లాటిన్ అమెరికాలోని కొంతమంది వ్యక్తులు తమ సబ్‌స్క్రిప్షన్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది షార్ట్-టర్మ్ వృద్ధిని ప్రభావితం చేయవచ్చు. అయితే, వ్యక్తులు వారి ఓన్ సబ్స్క్రిప్షన్ల కోసం మనీ చెల్లించడం ప్రారంభించిన తర్వాత, మరిన్ని అకౌంట్స్ ఓపెన్ అయ్యాక నెట్‌ఫ్లిక్స్ మరింత డబ్బును సంపాదించొచ్చు.
నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం తమ స్నేహితుల నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ను ఉపయోగించాలనుకునే యూజర్ల కోసం లాటిన్ అమెరికా వంటి దేశాల్లో 3 డాలర్లు (సుమారు రూ.245) వసూలు చేస్తోంది. దీనికి భారతదేశంలో ఒక యూజర్ నుంచి ఎంత డబ్బులు వసూలు చేస్తుందో కంపెనీ చెప్పలేదు అయితే ఇది గ్లోబల్ ప్రైస్‌కి దాదాపు సమానంగా ఉండొచ్చు.
Google Voice: గూగుల్ వాయిస్ యాప్ నుంచి స్మార్ట్ రిప్లై ఫీచర్ తొలగింపు.. కారణాలు చెప్పని కంపెనీ
Smartphones: అన్ని రకాల ఫీచర్లు ఉండే ఆల్‌రౌండర్ స్మార్ట్ఫోన్లు ఇవే.. ధర కూడా భారీగా లేదు..
భవిష్యత్తులో పాస్వర్డ్ షేరింగ్ ఆప్షన్ భారతదేశంలోని వ్యక్తులకు కూడా ముగుస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ 2023, మార్చి నుంచి ఇండియాతో సహా ఇతర దేశాలలో పాస్వర్డ్ షేరింగ్‌ను ఆపివేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌ను నాన్-హౌస్‌హోల్డ్ సభ్యులతో కూడా పంచుకోవడానికి కంపెనీ అనుమతిస్తుంది కాకపోతే వారి దగ్గర ఎక్స్ట్రా మనీ తీసుకుంటుంది. నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ఫ్రీగా చూసే వారిని ఐపీ అడ్రస్‌ల ద్వారా గుర్తిస్తూ ప్రతి ఒక్క యూజర్ డబ్బులు కట్టేలా చేస్తుంది. కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకునేవారికి భారం కాకుండా నెట్‌ఫ్లిక్స్ యాడ్-సపోర్టెడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను కూడా పరిచయం చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Netflix