ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫెస్‌బుక్ (Facebook) ఇండియాలో పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌ను నియమించింది. ఈ విషయాన్ని ఫెస్‌బుక్ అధికారికంగా ప్రకటించింది. మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఉబర్ ఎగ్జిక్యూటీవ్ రాజీవ్ అగర్వాల్ ఇకపై ఇండియా (India) లో పబ్లిక్ పాలసీ డైరెక్టర్ (Public Policy Director)గా నియమింపబడ్డారు. గత సంవత్సరం అక్టోబర్‌లో రాజీనామా చేసిన అంఖిదాస్ స్థానంలో ఈయనును నియమించారు. పలు రాజకీయ ప్రసంగాలపై అంఖిదాస్ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆమె చిక్కుల్లో పడ్డారు. ఇకపై ఆమె ఇండియాలో వినియోగదారుల భద్రత, డేటా రక్షణ (Data Security) మరియు గోప్యత, ఇంటర్నెట్ కవర్ వంటి అంశాలపై పని చేస్తుందని ఫేస్ బుక్ పేర్కొంది. ఇకపై అగర్వాల్ ఇండియా లీడర్‌షిప్ (Leader ship) టీమ్‌లో భాగంగా ఉంటారు. ఆయన అగర్వాల్ ఫేస్‌బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (Managing director) అజిత్ మోహన్‌కు రిపోర్ట్ చేస్తారని ఫేస్ బుక్ తెలిపింది.
అగర్వాల్ చివరగా ఉబర్‌లో విధులు నిర్వర్తించారు. ఆయన ఉబర్‌లో ఇండియా-దక్షిణ ఆసియాకు పబ్లిక్ పాలసీ హెడ్‌గా పని చేశారు. అగర్వాల్ ఇండియన్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్‌గా (IAS) ఆయన 26 సంవత్సరాలు పని చేశారు. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలో జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.
Vivo X70 : సెప్టెంబర్ 30న మార్కెట్‌లోకి వివో ఎక్స్70
ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (Intellectual Property Rights), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంర్నల్ ట్రేడ్ (M/o Commerce) విభాగంలో జాయింట్ సెక్రటరీగా (Joint Secretary) పని చేశారు. అంతే కాకుండా ఇండియా-అమెరికా (India-America) ద్వైపాక్షిక వాణిజ్య ఫోరమ్ సంబంధిత వ్యవహారాలను ఆయన చూశారు.
అగర్వాల్ నియామకంపై అజిత్ మోహన్ మాట్లాడారు. పబ్లిక్ పాలసీ (Public Policy) బృందానికి నాయకత్వం వహించడానికి రాజీవ్ అగర్వాల్ మాతో చేరడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. రాజీవ్ నైపుణ్యం (Skill), అనుభవం, పారదర్శక విధానాలు మా లక్ష్యాలకు ఎంతో తోడ్పడతాయిన అజిత్ మోహన్ అన్నారు. భారతీయులందరికీ సురక్షితమైన ఇంటర్నెంట్ అందించడమే లక్ష్యమని ఆయన అన్నారు. అగర్వాల్ నియామకం ద్వారా దేశంలో కంపెనీ (Company) విస్తరణతోపాటు, మార్కెటింగ్ అంశాలతోపాటు దేశంపట్ల నిబద్ధతను చాటే చెప్పేలా ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Facebook, Social Media, Technology