Chandrayaan 2 | చంద్రయాన్ 2 మిషన్ డైరెక్టర్ రీతు కరిథాల్.. ఆమెకు ఆకాశం హద్దే కాదు..

Chandrayaan 2 | కరిథాల్‌ను చంద్రయాన్ 2 మిషన్ డైరెక్టర్‌గా నియమించడం (ఎం. వనిత - ప్రాజెక్టు డైరెక్టర్ ) ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో ఓ చరిత్ర.

news18-telugu
Updated: July 22, 2019, 2:59 PM IST
Chandrayaan 2 | చంద్రయాన్ 2 మిషన్ డైరెక్టర్ రీతు కరిథాల్.. ఆమెకు ఆకాశం హద్దే కాదు..
చంద్రయాన్ 2 మిషన్ డైరెక్టర్ రీతు కరిథాల్ (File)
news18-telugu
Updated: July 22, 2019, 2:59 PM IST
ఎవరైనా గొప్ప ఘనతలను సాధించే వారిని ‘వారికి ఆకాశమే హద్దు’ అని అంటుంటారు. అయితే, అంతరిక్ష పరిశోధనా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న ఆమెకు ఆకాశం హద్దే కాదు. ఓ ప్రయోగశాల అంతే. ఆమే రీతు కరిథాల్. చంద్రయాన్ 2 మిషన్ డైరెక్టర్. ఆమెకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు తన సొంత ఊరు లక్నో వెళ్లారట. అప్పుడు చంద్రుడు కూడా తనతోపాటు తన ఊరికి నడిచి వచ్చాడని ఆమెకు అనిపించింది. అయితే, భవిష్యత్తులో తాను చంద్రయాన్ 2 ప్రాజెక్టు మిషన్ డైరెక్టర్ అవుతానని ఆమె ఊహించి ఉండదు. ఇంకో విషయం ఏంటంటే.. చంద్రయాన్ 1 ప్రాజెక్టులో కూడా ఆమె పనిచేశారు. ‘చంద్రయాన్ 2 ప్రయోగం వల్ల మరో గ్రహంలో ప్రయోగాలకు అవకాశం లభిస్తుంది. ఆ దిశగా ఇది తొలి అడుగు.’ అని ఇస్రో మార్స్ మిషన్ గురించి రాసిన పుస్తకంలో ఆమె తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

భారత్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా సైంటిస్టుల వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే ప్రపంచంలో సైంటిఫిక్ పరిశోధనల్లో కేవలం 28.8 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. మహిళలు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి సిద్ధపడడం లేదు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 69 ప్రముఖ సైన్స్ అకాడమీల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు.

1901లో నోబెల్ బహుమతిని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు సైన్స్‌లో విభాగాల్లో కేవలం 17 మంది మహిళలు మాత్రమే నోబెల్ బహుమతిని పొందారు.



సైంటిఫిక్, పరిశోధనా సంస్థలు, అత్యున్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే విభాగాల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం తక్కువే. 1969 ఆగస్ట్ 15న ఇస్రో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళకు సారధ్య బాధ్యతలు దక్కలేదు.

అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రాజెక్టు డైరెక్టర్లు, ప్రాజెక్టు మేనేజర్లుగా కొందరు మహిళలు పనిచేశారు. అయితే, కొన్ని దశాబ్దాల శ్రమ, విజయాల తర్వాత వారికి ఆ గౌరవం లభిస్తోంది.

కరిథాల్‌ను చంద్రయాన్ 2 మిషన్ డైరెక్టర్‌గా నియమించడం (ఎం. వనిత - ప్రాజెక్టు డైరెక్టర్ ) ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో ఓ చరిత్ర.
First published: July 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...