హోటల్ రూమ్(Hotel Room) లను మీ ఫోన్‌తోనే అన్‌లాక్ చేయాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మీకొక గుడ్‌న్యూస్ అందించింది. హయత్ (Hyatt) హోటల్ కార్పొరేషన్ సంస్థ సహకారంతో హోటల్ రూమ్స్ అన్‌లాక్ చేయడానికి వీలుగా ఐఫోన్‌ల్లో తాజాగా అన్‌లాక్ ఫీచర్ ప్రారంభించింది. ఐఫోన్, యాపిల్ వాచ్ యూజర్ల కోసం యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇళ్లు, కారు, ఇతర గ్యాడ్జెట్లు, హోటల్ గదులు ఇలా ఒకటేంటి అన్నిటిని అన్‌లాక్ చేసే సామర్థ్యాన్ని ఐఫోన్‌లలో ఇచ్చేందుకు యాపిల్ సంస్థ నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా అమెరికాలోని ఆరు ప్రాంతాల్లో ఉన్న హోటల్ రూమ్స్ అన్‌లాక్ చేసేందుకు వీలుగా ఐఫోన్ యూజర్లకు రూమ్ అన్‌లాక్ ఫీచర్ పరిచయం చేసింది. అతి త్వరలోనే ఈ ఫీచర్ అన్ని ప్రాంతాల్లోని ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కొందరు యూజర్లు ఇప్పటికే తమ ఐఫోన్‌ను ఉపయోగించి సపోర్టెడ్ కార్లను అన్‌లాక్ చేసేస్తున్నారు. హోమ్‌కిట్ డోర్ లాక్‌ని ఉపయోగించి ఐఫోన్‌తో ఇళ్లను కూడా అన్‌లాక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాపిల్ కంపెనీ హోటల్ రూమ్ కీలకు అన్‌లాక్ సపోర్టు అందించడం ప్రారంభించింది. ఇప్పటికే హయత్ సంస్థ సహకారంతో ఆరు ప్రదేశాలలో హోటల్ గదులను అన్‌లాక్ చేయడానికి ఐఫోన్లకు సరికొత్త ఫీచర్‌ను రోల్ అవుట్ చేసింది.
త్వరలో ప్రపంచవ్యాప్తంగా మరిన్ని హోటళ్లు ఐఫోన్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్టు చేస్తాయని.. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని యాపిల్ సంస్థ తెలిపింది. ఐఫోన్‌ల ద్వారా హోటల్ గదుల అన్‌లాకింగ్ అనేది డిజిటల్ కీ (Digital Key) ద్వారా పని చేస్తుంది. దీని వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఐఫోన్‌ల అన్‌లాకింగ్ తో మీరు మీతో కార్డ్ కీని తీసుకెళ్లవలసిన అవసరం ఉండదు. మీరు మీ ఐఫోన్ నుంచే చెక్-ఇన్ చేయగలరు కాబట్టి మీరు హోటల్ లాబీలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
New Car: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే.. వీటన్నింటినీ ఓ సారి తప్పక చెక్ చేయండి..
ఈ ఫీచర్ ప్రస్తుతం వరల్డ్ ఆఫ్ హయత్ (World of Hyatt) మొబైల్ యాప్‌లో మాత్రమే పని చేస్తుంది. యూజర్లు బుకింగ్ చేసిన తర్వాత.. యాపిల్ వాలెట్ యాప్‌కి బుకింగ్‌ని యాడ్ చేయాలనుకుంటున్నారా అని ఒక ప్రశ్న కనిపిస్తుంది. అప్పుడు యూజర్లు బుకింగ్ చేసిన వెంటనే కీని యాపిల్ వాలెట్ యాప్‌కి యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇది చెక్-ఇన్ సమయంలో మాత్రమే యాక్టివేట్ అవుతుందని యూజర్లు గమనించాలి. బుకింగ్ యాడ్ అయ్యాక, యూజర్లు యాపిల్ వాలెట్ యాప్‌లోనే రిజర్వేషన్ నంబర్ వంటి అన్ని రిజర్వేషన్ వివరాలను కూడా చూసుకోవచ్చు.
WhatsApp Web: ఇక వాట్సప్ వెబ్ వాడటానికి స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు
కొత్త ఫీచర్ లేటెస్ట్ ఐఓఎస్, యాపిల్ వాచ్ ఓఎస్ వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తుంది. అలాగే టూ-ఫాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసిన ఐక్లౌడ్ లో సైన్ఇన్ చేసిన యాపిల్ ఐడీలో మాత్రమే ఇది పని చేస్తుంది. మీ యాపిల్ వాలెట్‌కు హోటల్ రూమ్ కీని ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
1. హోటల్ లేదా రిసార్ట్ యాప్‌ని ఓపెన్ చేసి మీ అకౌంటుకు సైన్-ఇన్ చేయండి. ప్రస్తుతం, వరల్డ్ ఆఫ్ హయత్ యాప్ మాత్రమే ఈ ఫీచర్‌తో పని చేస్తుంది.
2. మీ రిజర్వేషన్‌ని ఓపెన్ చేయండి.
3. “Add to Apple Wallet” అనే ఆప్షన్‌పై నొక్కండి
4. మీ హోటల్ రూమ్ కీని యాడ్ చేసేందుకు స్క్రీన్‌పై ఉన్న సూచనలను అనుసరించండి. అంతే హోటల్ రూమ్ కీ యాపిల్ వాలెట్‌కు యాడ్ అయిపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.