టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత లావాదేవీలు చాలా సులభమయ్యాయి. బ్యాంకులకు వెళ్లి గంటలుగంటలు క్యూ కట్టి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. స్మార్ట్‌ఫోన్‌లో జస్ట్ నాలుగైదు క్లిక్స్తో వేలకు వేలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇందుకోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్-యూపీఐ యాప్స్ ఉపయోగపడ్తున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్స్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం చాలా సులువు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI డేటా ప్రకారం 2019 మార్చిలో 79.95 కోట్ల యూపీఐ లావాదేవీల్లో రూ.1.33 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. 2018 మార్చిలో 17.80 కోట్ల లావాదేవీల్లో రూ.24,172 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. యూపీఐ లావాదేవీలు ఏ స్థాయిలో పెరిగాయో ఈ లెక్కలు చూసి అర్థం చేసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
యూపీఐ పేమెంట్స్ సులువుగానే జరుగుతాయని కానీ... లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మీ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. మీరు ఏ యూపీఐ యాప్ ఉపయోగిస్తున్నా సరే అప్రమత్తంగా ఉండాల్సిందే. మీరు యూపీఐ ద్వారా బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసే సమయంలో వర్చువల్ పేమెంట్ అడ్రస్-VPA ఐడీ క్రియేట్ అవుతుంది. బ్యాంకుకు సంబంధించిన ఎలాంటి ఇతర సమాచారం లేకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సాధారణంగా మోసగాళ్లు వీపీఏ ఐడీ తెలుసుకొని మోసాలకు పాల్పడుతుంటారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వీపీఏ ఐడీ ఎవ్వరికీ చెప్పకూడదు. మోసగాళ్లు 'రిక్వెస్ట్ మనీ' ఆప్షన్ ద్వారా గూగుల్ పే, ఫోన్ పే, భీమ్ యాప్స్‌ని టార్గెట్ చేస్తున్నారు.
గూగుల్ పేలో రిక్వెస్ట్ మనీ, పేమెంట్‌ను ఇలా గుర్తించండి
సాధారణంగా ఓఎల్ఎక్స్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని అమ్మేవారిని టార్గెట్ చేస్తున్నారు మోసగాళ్లు. ఉదాహరణకు ఓ వ్యక్తి ఓఎల్ఎక్స్లో టీవీని రూ.10,000 అమ్మకానికి పెడితే సైబర్ నేరగాళ్లు కాంటాక్ట్ చేస్తారు. రూ.8,000 బేరం కుదుర్చుకుంటారు. అడ్వాన్స్‌గా రూ.4,000 ఇస్తామని నమ్మిస్తారు. అది కూడా గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ యాప్స్ ద్వారా పంపుతామని చెబుతారు. సైబర్ ఛీటర్స్ అతి తెలివి చూపించేది ఇక్కడే. డబ్బులు పంపాల్సిందిపోయి 'రిక్వెస్ట్ మనీ' ఆప్షన్ని వాడుకుంటారు. అంటే మీ దగ్గర నుంచి డబ్బులు కావాలంటూ రిక్వెస్ట్ పంపిస్తారు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి పిన్ ఎంటర్ చేశారంటే మీ అకౌంట్లోంచి డబ్బులు పోవడం ఖాయం. ఇక్కడే మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీరు డబ్బులు పంపాలంటే పిన్ అవసరం కానీ... మీరు డబ్బులు రిసీవ్ చేసుకోవాలంటే పిన్ అవసరం లేదన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఈ మోసాలను గుర్తించిన గూగుల్ పే... కొత్త నెంబర్ నుంచి మనీ రిక్వెస్ట్ వస్తే స్పామ్ అని అలర్ట్ చేస్తోంది.
గూగుల్ పేలో స్పామ్ అలర్ట్
మీరు ఒకవేళ కంప్యూటర్ ద్వారా లావాదేవీలు చేస్తున్నటైతే ఎట్టిపరిస్థితుల్లో Anydesk, Teamviewer, Screenshare లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఉపయోగించొద్దు. ఇతరులకు యాక్సెస్ ఇవ్వొద్దు. మొబైల్ ఫోన్లో కూడా స్క్రీన్ షేరింగ్ యాప్స్ వాడొద్దు. మీ స్క్రీన్ షేర్ చేస్తే ఓటీపీ ఇతరులు తెలుసుకోవడం చాలా సులువు. అంతేకాదు... ప్లేస్టోర్‌లో నకిలీ యాప్స్ కూడా ఉంటాయి. ఒక్క భీమ్ యాప్‌కే Modi Bhim, Bhim Modi App, BHIM Payment-UPI Guide, BHIM Banking guide, Modi ka Bhim లాంటి పేర్లతో నకిలీ యాప్స్ ఉన్నాయి. అందుకే యూపీఐ యాప్ ఏదైనా డౌన్లోడ్ చేసుకునే ముందు ఒరిజినల్ యాపేనా కాదా అని చెక్ చేయాలి. యాప్స్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.