Home /News /technology /

FOLLOW THESE STEPS TO TRANSFER CHATS FROM WHATSAPP TO TELEGRAM UMG GH

WhatsApp: వాట్సాప్ చాట్స్‌ను టెలిగ్రామ్‌కు సెండ్ చేయలా..? ఈ సింపుల్‌ స్టెప్స్ ఫాలో అవ్వండి...!

వాట్సాప్ నుంచి టెలిగ్రామ్‌కు డేటా ఇలా సెండ్ చేసుకోండి

వాట్సాప్ నుంచి టెలిగ్రామ్‌కు డేటా ఇలా సెండ్ చేసుకోండి

వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్‌తో మీరు వాట్సాప్ చాట్‌లను కొన్ని సింపుల్ స్టెప్స్‌లోనే టెలిగ్రామ్ కి ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

బంధుమిత్రులు, స్నేహితులు, తెలిసిన వారు ఇలా ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ కావడానికి చాలా మంది వాట్సాప్‌ (WhatsApp)పై ఆధారపడుతున్నారు. అయితే వాట్సాప్‌లో చేసే కన్వర్జేషన్, ఫొటోలు, వీడియోల వంటి చాట్ డేటాను సేవ్ చేసుకోవాలని దాదాపు యూజర్లందరూ కోరుకుంటారు. వీరి కోసమే ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు.. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్స్‌ (WhatsApp Chats)ను ట్రాన్స్‌ఫర్ (Transfer) చేసుకునేందుకు వీలుగా ఒక ఫీచర్‌ను వాట్సాప్‌ పరిచయం చేసింది. అయితే కేవలం డివైజ్‌ల మధ్య మాత్రమే కాదు టెలిగ్రామ్ (Telegram) యాప్‌తో కూడా వాట్సాప్ చాట్స్‌ను షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్‌తో మీరు వాట్సాప్ చాట్‌లను కొన్ని సింపుల్ స్టెప్స్‌లోనే టెలిగ్రామ్ కి ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్‌లో పర్సనల్ చాట్‌లను ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి?

స్టెప్ 1: మొదటగా స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ని ఓపెన్ చేసి మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న చాట్‌ను తెరవాలి. టాప్ రైట్ కార్నర్‌లో త్రీ-డాట్స్ మెనూ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. మోర్ (More) ఆప్షన్‌పై నొక్కి ఎక్స్‌పోర్ట్ చాట్ (Export Chat)పై క్లిక్ చేయాలి.

స్టెప్ 2: వాట్సాప్ చాట్‌ని మీడియా లేకుండా (Without Media) ట్రాన్స్‌ఫర్ చేయాలా లేదా మీడియా (Include Media)తోనే షేర్ చేయాలా? అని ఒక పాప్ విండో అడుగుతుంది. మీకు మీడియాతో పాటు వాట్సాప్ చాట్ ట్రాన్స్‌ఫర్ కావాలనుకుంటే అందుకు అనుగుణంగా ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

స్టెప్ 3: ఆపై కనిపించే షేర్ మెనూ నుంచి టెలిగ్రామ్ యాప్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు టెలిగ్రామ్ యాప్‌ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపించే చాట్ లిస్ట్‌ నుంచి మీరు ఏ కాంటాక్ట్‌కి వాట్సాప్ చాట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత, వాట్సాప్ ఆటోమేటిక్‌గా అన్ని మెసేజెస్, మీడియాను టెలిగ్రామ్‌లోని కాంటాక్ట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది.

ఇదీ చదవండి: ఓరి ! నాయనో ఇదెక్కడి రోగం.. లైంగిక సంపర్కం ద్వారా కూడా మంకీ పాక్స్ .. WHO సంచలన విషయాలు..!


ఐఫోన్‌లో వాట్సాప్ ఇండివిడ్యువల్ చాట్స్‌ను ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి?

స్టెప్ 1: ఐఫోన్‌లో ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి. మీరు టెలిగ్రామ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న చాట్‌ను ఓపెన్ చేయాలి.

స్టెప్ 2: ఇప్పుడు పైన కనిపించే కాంటాక్ట్ ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి. ఆపై క్రిందికి స్క్రోల్ చేసి, ఎక్స్‌పోర్ట్ చాట్ ఆప్షన్‌పై నొక్కాలి.



స్టెప్ 3: అనంతరం ఎక్స్‌పోర్ట్ చేయాలనుకున్న టెలిగ్రామ్ యాప్ సెలెక్ట్ చేసుకుని కాంటాక్ట్‌ని ఉంచుకోవాలి. ఇప్పుడు మీకు క్యాన్సిల్, ఇంపోర్ట్ అనే ఒక పాప్‌-అప్ విండో కనిపిస్తుంది. అందులో ఇంపోర్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వెంటనే వాట్సాప్ చాట్ మొత్తం మీరు సెలెక్ట్ చేసుకున్న టెలిగ్రామ్ కాంటాక్ట్ కి సెండ్ అయిపోతుంది. ట్రాన్స్‌ఫర్ అయిన ఈ చాట్స్‌ వాటి టైమ్‌స్టాంప్‌లతో పాటు "ఇంపోర్టెడ్" లేబుల్ తో కనిపిస్తాయి. అలా మీరు టెలిగ్రామ్ మెసేజెస్, మీ వాట్సాప్ మెసేజెస్‌ను సులభంగా గుర్తించవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: New features, Telegram, Whatsapp, Whatsapp tricks

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు