WhatsApp Fingerprint: వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ లాక్... సెట్టింగ్స్ ఇవే

WhatsApp Fingerprint Authentication Feature | వాట్సప్ యాప్ అప్‌డేట్ చేసిన తర్వాత మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ వాడుకోవడానికి సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: November 6, 2019, 2:36 PM IST
WhatsApp Fingerprint: వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ లాక్... సెట్టింగ్స్ ఇవే
WhatsApp Fingerprint: వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ లాక్... సెట్టింగ్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ వచ్చేసింది. ఐఫోన్‌లో ఈ ఫీచర్ ఫిబ్రవరిలోనే అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఇటీవల ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ రిలీజ్ చేసింది వాట్సప్. అయితే మీ స్మార్ట్‌ఫోన్‌కు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లేదా ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటేనే వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ లాక్ ఫీచర్ పనిచేస్తుంది. వాట్సప్‌లో ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ యాక్టివేట్ చేసిన తర్వాత ఇక మీ చాట్స్ ఓపెన్ చేయాలంటే ఫింగర్‌ప్రింట్ తప్పనిసరి. మీరు మీ వాట్సప్ అప్‌డేట్ చేస్తే ఈ ఫీచర్ వాడుకోవచ్చు. వాట్సప్ 2.19.221 వర్షన్ కన్నా ఎక్కువ ఉండాలి. వాట్సప్ యాప్ అప్‌డేట్ చేసిన తర్వాత మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ వాడుకోవడానికి సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకోండి.

WhatsApp Fingerprint: ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ సెట్ చేసుకోండి ఇలా


ముందుగా మీ వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి.

టాప్ రైట్ కార్నర్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయండి.
సెట్టింగ్స్ ఓపెన్ చేసి Account పైన క్లిక్ చేయండి.
Privacy ట్యాబ్ పైన క్లిక్ చేస్తే చివర్లో Fingerprint Lock ఫీచర్ ఉంటుంది.


Fingerprint Lock ట్యాబ్ పైన క్లిక్ చేసి Unlock with Fingerprint ఆన్ చేయాలి.
Loading...
మీరు యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఎంత సేపటికి ఫింగర్‌ప్రింట్ లాక్ యాక్టివేట్ కావాలో సమయం సెట్ చేసుకోవచ్చు.
వెంటనే లేదా ఒక నిమిషంలో లేదా 30 నిమిషాల్లో సమయాన్ని మీరే నిర్ణయించొచ్చు.
అంతేకాదు... నోటిఫికేషన్‌లో మెసేజ్ కంటెంట్ కనిపించాలో వద్దో కూడా సెట్ చేయొచ్చు.
ఈ సెట్టింగ్స్ పూర్తైన తర్వాత మీరు వాట్సప్ ఓపెన్ చేయాలంటే వేలిముద్ర తప్పనిసరి.

Xiaomi Mi CC9 Pro: 108 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ ఎంఐ సీసీ9 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

WhatsApp: వాట్సప్‌కు షాక్... ఇండియాలో 80 శాతం పడిపోయిన డౌన్‌లోడ్స్... ఎందుకో తెలుసా?

Mi Organic T-shirt: షావోమీ నుంచి ఆర్గానిక్ టీ-షర్ట్స్... ధర ఎంతో తెలుసా?

ATM: ఛార్జీలు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా... ఎన్నిసార్లైనా చేయొచ్చు ఇలా
First published: November 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...