WhatsApp trick: వాట్సప్ స్టేటస్ సీక్రెట్‌గా చూడొచ్చు ఇలా

WhatsApp trick | మీరు మీ వాట్సప్‌లో ఇతరుల స్టేటస్ చెక్ చేస్తుంటారా? అవతలివాళ్లకు తెలియకుండా స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: July 7, 2020, 11:51 AM IST
WhatsApp trick: వాట్సప్ స్టేటస్ సీక్రెట్‌గా చూడొచ్చు ఇలా
WhatsApp trick: వాట్సప్ స్టేటస్ సీక్రెట్‌గా చూడొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సప్‌ అందించిన అద్భుతమైన ఫీచర్స్‌లో స్టేటస్ ఫీచర్ ఒకటి. వాట్సప్‌లో స్టేటస్ పెట్టడం, గంటగంటకు స్టేటస్ అప్‌డేట్ చేయడం చాలామందికి అలవాటుగా మారింది. వాట్సప్‌లో స్టేటస్ ఎవరైనా చూస్తే వెంటనే తెలిసిపోతుంది. ఇప్పటివరకు ఎంతమంది స్టేటస్ చూశారో కూడా తెలుసుకోవచ్చు. అంటే మీరు ఎవరి వాట్సప్ స్టేటస్ అయినా చూస్తే వారికి తెలిసిపోతుంది. స్టేటస్ మాత్రమే కాదు వాట్సప్ మెసేజెస్ కూడా మీరు చూసినట్టు అవతలివారికి తెలుస్తుంది. అయితే వాట్సప్ విషయంలో అనేక ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ ఉపయోగిస్తే మీరు వాట్సప్ స్టేటస్ చూసినా అవతలివారికి తెలియదు. మరి ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకోండి.

TRAI App: కేబుల్, డీటీహెచ్ బిల్లు తగ్గించుకోవాలా? ఈ యాప్ ట్రై చేయండి

WhatsApp: వాట్సప్ నుంచి కొత్తగా 5 ఫీచర్స్... విశేషాలివే

వాట్సప్‌లో రీడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫీచర్ డిసేబుల్ చేస్తే మీరు పంపిన మెసేజ్‌కు డబుల్ టిక్స్ మాత్రమే కనిపిస్తాయి. అవతలివాళ్లు మెసేజ్ చదివారో లేదో తెలియదు. ఈ ఫీచర్ స్టేటస్‌కు కూడా ఉపయోగపడుతుంది. మీరు రీడ్ రిసిప్ట్ ఫీచర్ డిసేబుల్ చేసి స్టేటస్ చెక్ చేయొచ్చు. అప్పుడు మీరు ఎవరి స్టేటస్ అయినా చూడొచ్చు. కానీ మీరు స్టేటస్ చూసినట్టు అవతలివాళ్లకు తెలియదు. అయితే రీడ్ రిసిప్ట్ ఫీచర్ మీకు కూడా అలాగే పనిచేస్తుంది. అంటే ఈ ఫీచర్ డిసేబుల్ చేస్తే మీ స్టేటస్ ఎవరు చూశారన్న విషయం మీరు తెలుసుకోలేరు. కాబట్టి రీడ్ రిసిప్ట్ ఉపయోగించేముందు ఓసారి ఆలోచించండి.
Published by: Santhosh Kumar S
First published: July 7, 2020, 11:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading