హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Safety Tips: సైబర్ నేరాలు పెరుగుతున్నాయి... మీరు ఈ సెట్టింగ్స్ మార్చారా?

Safety Tips: సైబర్ నేరాలు పెరుగుతున్నాయి... మీరు ఈ సెట్టింగ్స్ మార్చారా?

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Safety Tips | మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అవుతుందని మీకు అనుమానంగా ఉందా? మీ జీమెయిల్ ఇతరులు లాగిన్ చేస్తున్నారని డౌట్‌గా ఉందా? అయితే ఈ సెట్టింగ్స్ మార్చి మీ గూగుల్ అకౌంట్‌ని సేఫ్‌గా మార్చండి.

టెక్నాలజీ పెరిగిపోవడంతో చాలావరకు పనులన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. కోట్ల రూపాయల లావాదేవీలు (Financial Transactions) కూడా క్షణాల్లో ఆన్‌లైన్‌లో చేసేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు మాత్రమే కాదు... ఇతర అవసరాలకు ఇంటర్నెట్‌పై ఆధారపడటం పెరిగిపోయింది. ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్నట్టుగానే సైబర్ మోసాలు (Cyber Frauds) కూడా ఎక్కువవుతున్నాయి. అకౌంట్ హ్యాకింగ్ దగ్గర్నుంచి బ్యాంకు ఖాతా ఖాళీ చేసేవరకు అనేక మోసాలు పెరిగిపోతున్నాయి. ఫిషింగ్ అటాక్స్, మాల్‌వేర్ అటాక్స్ లాంటి సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. మరి ఈ నేరాలను అడ్డుకోవడానికి మార్గం లేదా? అంటే అది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఉపయోగిస్తున్న ఆన్‌లైన్ అకౌంట్స్‌ని సేఫ్‌గా మార్చాలంటే కొన్ని సెట్టింగ్స్ మార్చడం అవసరం.

చాలావరకు ఆన్‌లైన్ అకౌంట్లలో లాగిన్ కావడానికి గూగుల్ అకౌంట్ ఉపయోగించడం యూజర్లకు అలవాటు. మీ గూగుల్ అకౌంట్‌ని ఎక్కడపడితే అక్కడ వాడేస్తే హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే మీరు గూగుల్‌లో కొన్ని సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉపయోగించడం ద్వారా ఈ రిస్క్ తగ్గించుకోవచ్చు. గూగుల్ అందిస్తున్న సెక్యూరిటీ ఫీచర్స్‌లో టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఒకటి. మీరు గూగుల్ అకౌంట్ వాడుతున్నట్టైతే తప్పనిసరిగా టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేయాలి. దీతోపాటు సెక్యూరిటీ కీ ఫీచర్ కూడా అందిస్తోంది గూగుల్. ఈ ఫీచర్ ఎలా వాడుకోవాలో ఈ స్టెప్స్ ఫాలో అయి తెలుసుకోండి.

Samsung Galaxy M32 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 పైనే డిస్కౌంట్... ఆఫర్ వివరాలివే

మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌లో గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయండి.

మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.

ఆ తర్వాత సెక్యూరిటీ పేజ్ ఓపెన్ చేయండి.

Signing in to Google ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

Use your phone to sign in ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

ఆ తర్వాత మీ అకౌంట్ పాస్‌వర్డ్ మరోసారి ఎంటర్ చేసి వెరిఫై చేయండి.

ఆ తర్వాత మీరు ఎప్పుడు మీ అకౌంట్ లాగిన్ చేయాలన్నా మీ ఫోన్ దగ్గర ఉండాల్సిందే.

Realme C31: రియల్‌మీ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... ధర రూ.10,000 లోపే

ఈ సెట్టింగ్స్ మారిస్తే మీ ప్రమేయం లేకుండా ఇతరులు మీ గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉండదు. ఎవరైనా లాగిన్ చేయడానికి ప్రయత్నించినా మీ స్మార్ట్‌ఫోన్‌లో నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు అప్రమత్తం అవొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌ను సెకండరీ సెక్యూరిటీ కీగా మార్చుకోవచ్చు.

First published:

Tags: CYBER FRAUD, GMAIL, Google

ఉత్తమ కథలు