ఇటీవల కాలంలో సెల్‌ఫోన్ లేకుండా పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ప్రతి పనికి ఏదో ఒక సమయంలో ఇతరులకు మన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇవ్వాల్సి వస్తోంది. ఈ క్రమంలో మన ఫోన్ నంబర్లు మిస్ యూజ్ అవుతూ.. స్పామ్ కాల్స్‌కు (Spam Calls) దారి తీస్తున్నాయి. ముఖ్యంగా టెలీమార్కెటింగ్ కాల్స్, రోబో కాల్స్ మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. వీటిలో కొన్ని కస్టమర్లను మోసం చేసేవి ఉంటాయి. ఈ స్పామ్ కాల్స్ ఎక్కువగా అన్‌నోన్ నంబర్స్ నుంచి వస్తుంటాయి. అయితే అన్‌నోన్ నంబర్లను బ్లాక్ (Unknow Numbers Block) చేయడానికి గూగుల్ డిఫాల్ట్ ఆప్షన్‌ను ఆండ్రాయిడ్‌లో అందిస్తోంది. ఈ వివరాలు తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్ డివైజ్‌లో డైలర్ యాప్ ఓపెన్ చేయాలి. యాప్ పైభాగంలో సెర్చ్ బార్‌కు పక్కన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. ఇప్పుడు సెట్టింగ్స్ ట్యాబ్‌పై క్లిక్ చేస్తే, వివిధ ఆప్షన్లు కనిపిస్తాయి. వీటి నుంచి ‘బ్లాక్డ్ నంబర్స్’ అప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఈ విభాగంలో ‘అన్‌నోన్’ ట్యాబ్‌ను ఆన్ చేస్తే.. మీ కాంటాక్ట్స్ లిస్ట్‌లో లేని ఫోన్ నంబర్ల నుంచి వచ్చే అన్ని కాల్స్ బ్లాక్ అవుతాయి. ఈ విభాగంలో ‘యాడ్ నంబర్’ అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని సెలక్ట్ చేసి, మీరు బ్లాక్ చేయాలనుకునే నంబర్‌ను మాన్యువల్‌గా ఎంటర్ చేయవచ్చు. మీరు ఇప్పటికే బ్లాక్ చేసిన నంబర్లు అన్నీ ఈ సెక్షన్‌లో కనిపిస్తాయి.
Mobile Offer: రూ.30 వేల లోపు రిలీజైన మొబైల్‌ను రూ.15 వేల లోపే కొనండి
షావోమీ లేదా ఎమ్‌ఐ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్, డైలర్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
సెర్చ్ బార్ పక్కన కనిపించే మూడు చుక్కల ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
ఇక్కడ ఓపెన్ అయ్యే సెర్చ్ రిజల్ట్స్ నుంచి సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
బ్లాక్డ్ నంబర్స్ సెక్షన్ సెలక్ట్ చేసి, ‘అన్‌నోన్’ ఆప్షన్ ఆన్ చేయండి. ఇప్పుడు అన్ ఐడెంటిఫైడ్ కాలర్స్ నుంచి అన్ని కాల్స్ బ్లాక్ అవుతాయి.
శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే మూడు చుక్కలపై ట్యాప్ చేయాలి.
ఆ తరువాత సెట్టింగ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. డిస్‌ప్లే అయ్యే రిజల్ట్స్ నుంచి ‘బ్లాక్ నంబర్స్’ను సెలక్ట్ చేయాలి.
ఇప్పుడు ‘బ్లాక్ అన్‌నోన్/హిడెన్ నంబర్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని సెలక్ట్ చేసి, ప్రైవేట్, అన్‌నోన్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ బ్లాక్ చేయవచ్చు.
Nothing Phone (1): ఫెస్టివల్ సేల్ ధరకే నథింగ్ ఫోన్ 1... ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి ఆఫర్
ఫోన్ యాప్ ఓపెన్ చేసి కింద ఉన్న రీసెంట్స్ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు వచ్చిన స్పామ్ కాల్ నంబర్‌పై క్లిక్ చేస్తే.. ఆ నంబర్‌ను రిపోర్ట్, బ్లాక్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని సెలక్ట్ చేస్తే, ఇకనుంచి ఆ నంబర్ నుంచి మీకు ఫోన్లు రావు. ఆ స్పామ్ కాల్ బ్లాక్ అవుతుంది. దీంతోపాటు ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ సాయంతో అన్‌నోన్ నంబర్లను బ్లాక్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Google, Smartphone