Online Shopping Tricks: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఏమైనా కొంటున్నారా? ఈ టిప్స్ మీ కోసమే

Online Shopping Tricks and Hacks | ఆన్‌లైన్ షాపింగ్ చేయడం కూడా ఓ కళే. తక్కువ ధరకే వస్తువుల్ని సొంతం చేసుకోవడానికి ఇలాంటి ఫెస్టివల్ సేల్స్ ఉపయోగపడుతుంటాయి. మరి మీరు కూడా ఈ ఫెస్టివల్ సీజన్‌లో షాపింగ్ చేయాలనుకుంటే కొన్ని టిప్స్ పాటించండి.

news18-telugu
Updated: October 11, 2020, 4:23 PM IST
Online Shopping Tricks: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఏమైనా కొంటున్నారా? ఈ టిప్స్ మీ కోసమే
Online Shopping Tricks: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఏమైనా కొంటున్నారా? ఈ టిప్స్ మీ కోసమే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆన్‌లైన్ ఫెస్టివల్ సేల్స్ సందడి మొదలైంది. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 16 నుంచి 21 వరకు జరగనుంది. ఇక అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 17న ప్రారంభం కానుంది. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. దసరా, దీపావళి పండుగ సీజన్ సందర్భంగా ఇ-కామర్స్ దిగ్గజ సంస్థలు నిర్వహిస్తున్న సేల్స్ ఇవి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మాత్రమే కాదు పేటీఎం మాల్, టాటా క్లిక్ లాంటి ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ కూడా ఫెస్టివల్ సేల్ నిర్వహిస్తున్నాయి. సాధారణంగా ఉండే ధరల కన్నా ఇలాంటి స్పెషల్ సేల్‌లో ధరలు తక్కువగా ఉంటాయి. అందుకే స్మార్ట్‌ఫోన్, టీవీ లాంటి ప్రొడక్ట్స్ కొనాలనుకునేవారు సేల్ కోసం ఆగుతుంటారు. అందుకే ఈ సీజన్‌లోనే ఇతర రోజుల కన్నా ఎక్కువగా ఆర్డర్స్ వస్తుంటాయి ఇ-కామర్స్ సంస్థలకు.

Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 5 పోకో స్మార్ట్‌ఫోన్లపై మొదటిసారి డిస్కౌంట్స్

Amazon Great Indian Festival Sale: అమెజాన్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

మీరు రెగ్యులర్‌గా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నా, ఆ సైట్లలో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ కోసం వెతుకున్నా వాటి ధరలపై మీకు ఓ అంచనా ఉంటుంది. సేల్ సమయంలో ఉండే ధరల్ని పోల్చి ఆర్డర్స్ చేయొచ్చు. అయితే మీకు ఈ అలవాటు లేనట్టైతే ప్రొడక్ట్స్‌ని తక్కువ ధరకు కొనడానికి కొన్ని టెక్నిక్స్ పాటించొచ్చు. ముందుగా మీరు కొనాలనుకున్న వస్తువును అన్ని ఇ-కామర్స్ సైట్లలో చెక్ చేయాలి. ధర ఎంత ఉందో చూడాలి. ఏ సైట్‌లో ధర తక్కువ ఉంటే అక్కడ కొనొచ్చు. మీరు కొనాలనుకున్న ప్రొడక్ట్ ధర సేల్ సమయంలో తగ్గిందా లేదా, ఎంత తగ్గింది అన్న విషయాలు తెలుసుకోవడానికి ప్రైస్ ట్రాకింగ్ సైట్లు ఉపయోగించొచ్చు. మీ ప్రొడక్ట్ లింక్‌ను ఏదైనా ప్రైస్ ట్రాకింగ్ సైట్‌లో పేస్ట్ చేస్తే ఆ ప్రొడక్ట్ ధర గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది అన్న విషయం తెలుస్తుంది. ఇలా ధరల్ని ట్రాక్ చేసి వస్తువులు కొనొచ్చు. ఇక మీరు ఎక్కువగా ప్రొడక్ట్స్ కొనాలనుకుంటే ఆఫర్ల గురించి అప్‍‌డేట్స్ ఇచ్చే వెబ్‌సైట్స్, ట్విట్టర్ అకౌంట్స్ చాలా ఉన్నాయి. వాటిని ఫాలో అవుతూ ఉండాలి.

Realme 7 Pro Sun Kissed: అదిరిపోయిన రియల్‌మీ 7 ప్రో సన్ కిస్డ్ లెదర్ ఎడిషన్... ధర ఎంతంటే

Samsung Galaxy F41: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 రిలీజ్... మొదటి సేల్‌లో కొంటే రూ.1,500 డిస్కౌంట్

ఆఫర్ బాగుంది కదా అని కొనడం కాదు. అసలు ఆ ప్రొడక్ట్‌కి అంత ధర ఉంటుందా లేదా అన్నదానిపై మీకు ఓ క్లారిటీ ఉండాలి. 50 శాతం, 60 శాతం డిస్కౌంట్ అనే ట్యాగ్స్‌ని నమ్మాల్సిన అవసరం లేదు. ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తున్నారని చూడకుండా ఆ వస్తువుకు ఆ ధర ఎక్కువా తక్కువా అని అంచనా వేయాలి. డిస్కౌంట్ ఎంత ప్రకటించినా అమ్మేవారు లాభం లేకుండా వస్తువుల్ని అమ్మరన్న విషయం గుర్తుంచుకోవాలి. కొన్ని వస్తువులపై భారీగా డిస్కౌంట్స్ ప్రకటిస్తాయి ఇ-కామర్స్ కంపెనీలు. ఉదాహరణకు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.70,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.20,000 అమ్మనుంది ఫ్లిప్‌కార్ట్. అయితే ఎన్ని యూనిట్లు అమ్ముతారో, ఎంత సేపు సేల్ ఉంటుందో తెలియదు. కాబట్టి ఇలాంటి ఆఫర్స్ సొంతం చేసుకోవాలంటే అలర్ట్‌గా ఉండటం అవసరం.

Best Smart TVs: రూ.30,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే

Flipkart Big Billion Days: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.30,000 వరకు డిస్కౌంట్... ఫోన్ ధరలో 70 శాతం చెల్లిస్తే చాలు

ఇక సేల్ సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఐసీఐసీఐ లాంటి బ్యాంకులతో ఒప్పందం చేసుకుంటాయి ఇ-కామర్స్ సంస్థలు. ఈ బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డులతో 10 శాతం డిస్కౌంట్లు పొందొచ్చు. వాటిని ఉపయోగించుకుంటే మీరు స్మార్ట్‌ఫోన్, టీవీ, రిఫ్రిజిరేటర్ లాంటి పెద్ద ప్రొడక్ట్స్‌ని ఇంకాస్త తక్కువ ధరకే కొనొచ్చు. అంతేకాదు... నో కాస్ట్ ఈఎంఐ లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒక విషయం గుర్తుంచుకోండి. ఆన్‌‌లైన్ షాపింగ్ ఓ వ్యసనం లాంటింది. ఖాళీగా ఉన్నాం కదా అని యాప్ ఓపెన్ చేసి బ్రౌజ్ చేసినా చివరకు ఏదో వస్తువు ఆర్డర్ చేయాలని టెంప్ట్ అయిపోతారు. అందుకే అవసరం లేనప్పుడు యాప్ ఉపయోగించకూడదు. అసలు మీకు ఆన్‌లైన్ షాపింగ్‌తో పనిలేదనుకుంటే ఆ యాప్స్ డిలిట్ చేయడం మంచిది. అవసరం లేకపోయినా వస్తువుల్ని కొని డబ్బుల్ని వృథా చేసుకోకండి.
Published by: Santhosh Kumar S
First published: October 11, 2020, 4:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading