హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Online Shopping Tips: ఆన్‌లైన్‌లో ఏమైనా కొంటున్నారా? ఆర్డర్ చేసేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి

Online Shopping Tips: ఆన్‌లైన్‌లో ఏమైనా కొంటున్నారా? ఆర్డర్ చేసేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి

Online Shopping Tips: ఆన్‌లైన్‌లో ఏమైనా కొంటున్నారా? ఆర్డర్ చేసేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Online Shopping Tips: ఆన్‌లైన్‌లో ఏమైనా కొంటున్నారా? ఆర్డర్ చేసేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Online Shopping Tips | మీరు ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటారా? ఫెస్టివల్ సేల్‌లో ఎక్కువగా వస్తువులు కొంటారా? ఈ టిప్స్, ట్రిక్స్ మీకోసమే.

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాళీ సేల్, అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఏమైనా కొంటున్నారా? అయితే జాగ్రత్త. ఆఫర్లు, డిస్కౌంట్లు బాగా ఉన్నాయి కదా అని హడావుడిగా ఆర్డర్స్ చేయకండి. ఓసారి అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయడం మంచిది. లేకపోతే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. ఏదైనా ప్రొడక్ట్స్ కొనే ముందు డిస్కౌంట్ ధరల్ని సరిగ్గా చెక్ చేయండి. కొన్ని డిస్కౌంట్స్ కొంత సమయం వరకు మాత్రమే ఉంటాయి. అందుకే నియమనిబంధనలన్నీ చదివి ఆఫర్స్ గురించి అవగాహన పెంచుకోండి. ఆ తర్వాతే ఆర్డర్ చేయండి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ లాంటి బ్యాంకుల కార్డులు వాడితే డిస్కౌంట్ వస్తుంది. ఆ సేల్ సమయంలో ఏ కార్డు వాడితే ఎక్కువ డిస్కౌంట్ వస్తుందో తెలుసుకోండి. ఎంత డిస్కౌంట్ వస్తుందో లెక్కేయండి. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే మీరు చెల్లించే మొత్తం ఎంత ఉంటుందో లెక్కేసుకోండి. ఈఎంఐ తక్కువ ఉందని వలలో పడకూడదు. వడ్డీ ఎంత చెల్లించాల్సి వస్తుందన్న విషయం కూడా తెలుసుకోవాలి.

Flipkart Big Diwali sale: రెడ్‌మీ నుంచి రియల్‌మీ వరకు... ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

Flipkart Big Diwali Sale: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.30,000 డిస్కౌంట్... ఫైనల్ రేట్ ఎంతంటే

మీరు ఫ్లాష్ సేల్స్‌లో వస్తువులు కొనాలనుకుంటే కాస్త ప్రిపరేషన్ అవసరం. వేగంగా చెక్ అవుట్ చేయడానికి డెలివరీ డీటెయిల్స్ ముందుగానే యాడ్ చేసి పెట్టండి. ప్రొడక్ట్ యాడ్ చేసిన తర్వాత చెకౌట్ చేయడం సులువవుతుంది. మీరు ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు అసలు ధరను ఆ బ్రాండ్ సైట్‌కి వెళ్లి తెలుసుకోవచ్చు. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనొచ్చు. మంచి డీల్స్ ఏవైనా ఉంటే వెంటనే ఆర్డర్ చేయండి. తర్వాత ఆర్డర్ చేద్దామని కార్ట్‌లో యాడ్ చేస్తే ఔట్ ఆఫ్ స్టాక్ కావొచ్చు. వస్తువులు కొనేముందు అలాంటి ప్రొడక్ట్స్‌ని కంపేర్ చేయండి. వేర్వేరు బ్రాండ్స్‌లో సేమ్ ప్రొడక్ట్ ఎంత ధర ఉంది, క్వాలిటీ ఎలా ఉందని పరిశీలించండి. మీరు కొనాలనుకునే వస్తువు ధర భవిష్యత్తులో తగ్గుతుందని అనిపిస్తే వెయిట్ చేసి తర్వాతి సేల్‌లో కొనడం మంచిది.

Oppo A33: భారీ డిస్కౌంట్‌తో ఒప్పో ఏ33 స్మార్ట్‌ఫోన్ సేల్

Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి షాక్... ఇక బాక్సులో ఛార్జర్లు ఉండవు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ సంస్థలు చాలావరకు వస్తువులను ఉచితంగానే డెలివరీ చేస్తుంటాయి. అయితే మినిమమ్ బిల్లింగ్ నిబంధనలు ఉంటాయి. మినిమమ్ బిల్లింగ్ చేసిన తర్వాత కూడా కొన్ని ప్రొడక్ట్స్‌పై షిప్పింగ్ ఛార్జీలు ఉంటాయి. ఆ ఛార్జీలు ఉన్నాయో లేదో చెక్ చేయండి. సేమ్ ప్రొడక్ట్‌ను వేరే సెల్లర్స్ ఉచితంగానే డెలివరీ చేస్తే ఫ్రీ డెలివరీ ఆప్షన్ ఉన్న ప్రొడక్ట్స్ బుక్ చేయండి. మీరు కొనాలనుకునే వస్తువు రేటింగ్స్, రివ్యూస్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేస్తే మీరు ఆ ప్రొడక్ట్ కొనాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవడం సులువవుతుంది.

First published:

Tags: Amazon Great Indian Festival Sale, Axis bank, Bank, Banking, Diwali 2020, Flipkart, Flipkart Big Diwali Sale, HDFC bank, Icici bank, Sbi, Sbi card, State bank of india

ఉత్తమ కథలు