Home /News /technology /

FOLLOW THESE 5 TIPS TO KEEP YOUR WHATSAPP ACCOUNT MORE SECURE NS

WhatsApp Privacy: మీ వాట్సాప్ ఖాతా సేఫ్ గా ఉండాలంటే.. ఈ 5 టిప్స్ పాటించండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

మీ వాట్సాప్ ఖాతా మరింత సెక్యూర్ గా ఉండాలంటే ఈ 5 టిప్స్ తప్పనిసరిగా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓ లుక్కేయండి.

    వినియోగదారులు WhatsApp సహా అన్ని ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ప్రైవసీని కోరుకుంటున్నారు. వినియోగదారుల ప్రైవసీ, సెక్యూరిటీకి సంబంధించి వాట్సాప్ అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ మేరకు అనేక కొత్త కొత్త ఫీచర్లను తీసుకుంది. మెటా యాజమాన్యంలోని ఈ సంస్థ ఇప్పటికే సెక్యూరిటీకి సంబంధించి పలు ఫీచర్లను ప్రవేశపెట్టింది. అయితే ఇటీవల ప్రవేశపెట్టిన ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ హ్యాకర్లకు అడ్డుకట్ట వేస్తుంది. కంపెనీ భద్రతతో కొన్ని అసురక్షిత చాట్‌లను నివారించడానికి వినియోగదారులు కొన్ని స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. వాట్సాప్‌లో సురక్షితంగా చాట్ చేయడానికి, మన డేటా హ్యాక్ కాకుండా ఉండేలా కొన్ని ఇతర భద్రతా చర్యలు తీసుకోవాలి. WhatsAppలో సురక్షితంగా ఉండటానికి వినియోగదారులు ఈ 5 టిప్స్ పాటించాల్సి ఉంటుంది.

    WhatsAppలో సురక్షితంగా ఉండటానికి 5 భద్రతా చర్యలు
    1) ఈ రోజుల్లో అనేక మంది WhatsApp వెబ్ ను వినియోగిస్తారు. అయితే.. వినియోగం అనంతరం వెబ్ నుంచి లాగ్ అవుట్ తప్పనిసరిగా చేయాలి. లేకపోతే ఇతరులు ఎవరైనా అదే బ్రౌజర్ లో వాట్సాప్ ను వాడితే.. మీ చాట్ మొత్తం వారికి కనిపిస్తుంది.

    2) Two-Step Verification: Two-Step Verification ఆప్షన్ మీ WhatsApp సెట్టింగ్‌లలో ఉంది. ఈ అదనపు సెక్యూరిటీ ఆప్షన్ హ్యాకర్లను దూరంగా ఉంచుతుంది. దీన్ని ఎనేబుల్ చేయడానికి, WhatsApp సెట్టింగ్‌లకు వెళ్లి Account ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత Two-Step Verification ఆప్షన్ ను ఎంచుకోండి.

    3) ఈ డిజిటల్ యుగంలో హానికరమైన లింక్‌లు తరచుగా మన ఫోన్ కు మెసేజ్ రూపంలో వస్తాయి. వాట్సాప్ లో మీకు ఎవరైనా అనుమానాస్పదంగా అనిపించే లింక్ లు పంపిస్తే క్లిక్ చేయకండి. ఒక సారి అలాంటి లింక్ ల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే క్లిక్ చేయండి.

    4) Profile Picture:ఆన్‌లైన్ మోసగాళ్లు మీ ప్రొఫైల్ ఫోటోతో మీ గురించి మరింత తెలుసునే ప్రమాదం ఉంటుంది. మీ WhatsApp ప్రొఫైల్ ఫోటో నుంచి Twitter మరియు Facebook వంటి మీ ఇతర సోషల్ మీడియా యాప్‌ల గురించిన సమాచారాన్ని కూడా కనుగొనవచ్చు. కాబట్టి మీరు WhatsAppలో సేవ్ చేయని కాంటాక్ట్‌లకు మీ ప్రొఫైల్ ఫొటో కనిపించకుండా సెట్టింగ్స్ మార్చండి. Settings>Privacy>Profile photo>My Contacts ఆప్షన్ ను ఎంచుకోవాలి.

    5) ఫోన్ పోతే.. మీ ఫోన్‌ పోతే కనుగొనడం చాలా కష్టం. అలాంటి సందర్భాల్లో మీ ఫోన్ పోయిన వెంటనే డూప్లికేట్ సిమ్ తీసుకుని వేరే ఫోన్లో వాట్సాప్ లాగిన్ అవ్వండి. దీంతో మీ పాత ఫోన్లో వాట్సాప్ లాగ్ అవుట్ అవుతుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Whatsapp, Whatsapp tricks

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు