Home /News /technology /

FOLLOW THESE 5 SAFETY TIPS FOR SAFE SECURE TRANSACTIONS DURING DIGITAL PAYMENTS NS GH

Digital Payments: మీ డిజిటల్ పేమెంట్స్ సురక్షితమేనా? సేఫ్ పేమెంట్స్ కోసం ఈ నాలుగు టిప్స్ పాటించండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత బ్యాంకు లావాదేవీలు చాలా సులభమయ్యాయి. ఇదే సమయంలో చిన్న చిన్న తప్పిదాల కారణంగా ఖాతాలో నుంచి నగదు మాయం అవడం కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది. అయితే ఈ టిప్స్ ఫాలో అవడం ద్వారా ఆ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

ఇంకా చదవండి ...
రోజురోజుకీ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోతున్న కొద్దీ సెక్యూరిటీ సమస్యలు కూడా అధికమవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఆన్ లైన్ మోసాలు కూడా పెరిగిపోయి ఏం చేస్తే బ్యాంకు నుంచి డబ్బులు మాయమవుతాయో అని చాలామంది భయపడే సమస్య ఏర్పడింది. కానీ కరోనా కారణంగా చాలా చోట్ల నగదు కంటే యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులే అవసరమవుతున్నాయి. నగదు ను ముట్టుకోవడం, తిరిగి తీసుకోవడానికి ప్రజలు భయపడడమే ఇందుకు కారణం. ఇలాంటి సమయంలో సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తగా ఉండేందుకు ఈ పద్ధతులను ఉపయోగించవచ్చు.

1. కార్డు వివరాలను సేవ్ చేయద్దు
మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలను రాసి పెట్టుకోవడం, ఫోన్ లో సేవ్ చేసుకోవడం చాలామందికి అలవాటు. ఇలా కాకుండా ఆన్ లైన్ లో ఏదైనా పేమెంట్ చేసినప్పుడు కూడా కార్డు వివరాలు సేవ్ చేయాలా? అని ఆ వెబ్ సైట్లు అడుగుతుంటాయి. భవిష్యత్తులో మళ్లీ మళ్లీ ఈ వివరాలన్నీ ఏం నింపుతాంలే అనుకొని చాలామంది సేవ్ చేసేస్తుంటారు. కానీ ఇలాచేయడం సరికాదు. దీనివల్ల మీ కార్డు వివరాలు చోరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

2. ప్రైవేట్ విండో మంచిది..
మీ ఫోన్ లో వేసే ప్రతి యాప్ గురించి మీకు పూర్తి సమాచారం తెలిసి ఉండేలా చూసుకోవాలి. ఏదైనా యాప్ పై మీకు నమ్మకం లేకపోతే దాన్ని డౌన్ లోడ్ చేసుకోవడం మంచిది కాదు. అలాగే యాప్ స్టోర్ లో ఉన్న యాప్స్ ని మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి. అలాగే యాప్ డౌన్ లోడ్ చేసే సమయంలో రివ్యూలను చదివి దాని ప్రకారం డౌన్ లోడ్ చేసుకోవాలా? వద్దా? అని నిర్ణయించుకోవాలి. వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉండి, మంచి రేటింగ్ ఉండి, నెగటివ్ రివ్యూస్ తక్కువగా ఉన్న యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలి. దీనివల్ల మీకు తెలియని వైరస్ లు మీ ఫోన్ లో కి చేరి మీ సమాచారాన్ని దొంగిలించే అవకాశం తక్కువ. అలాగే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లను వీలైనంత వరకూ ప్రైవేట్ ఇన్ కాగ్నిటో విండో ఓపెన్ చేసి చేస్తే మరీ మంచిది.

3. పబ్లిక్ నెట్ వర్క్ వద్దు
మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను పర్సనల్ ఫోన్, నెట్ వర్క్ ఉపయోగించి చేయడమే మంచిది. ఫ్రీగా వస్తోంది కదా పబ్లిక్ వైఫై వాడడానికి ప్రయత్నించకండి. దీని ద్వారా మన ఫోన్ లోని సమాచారాన్ని ఇతరులు దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల సైబర్ అటాక్స్, ఫ్రాడ్ యాక్టివిటీలకు కారణంగా మారతాయి. అంతే కాదు.. మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల కోసం కేవలం నమ్మకం ఉన్న సైట్లనే వాడండి. మీరు ఎప్పుడూ చూడని వెబ్ సైట్లలో షాపింగ్ చేయడం సరికాదు.

4. పాస్ వర్డ్స్ పంచుకోవద్దు..
మీ బ్యాంకింగ్ అకౌంట్స్, యూపీఐ వంటివాటికే కాదు.. క్రెడిట్, డెబిట్ కార్డులకు ఉండే పాస్ వర్డ్స్, పిన్ వంటివన్నీ చాలా స్ట్రాంగ్ గా ఎవరూ గుర్తించలేనట్లుగా ఉండేలా చూసుకోవాలి. అంతే కాదు.. వీలైనంత మేరకు కనీసం ప్రతి ఆరు నెలలకోసారి అయినా వీటిని మార్చుతూ ఉండాలి. ఏటీఎం పిన్, ఓటీపీ ల వంటివి ఎవరితోనూ షేర్ చేసుకోవడం సరికాదు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: CYBER CRIME, Digital Platform, Money

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు