• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • FOLLOW THESE 3 SIMPLE METHODS TO CHECK JIO BALANCE AND VALIDITY SS

Jio Balance: జియో బ్యాలెన్స్ సింపుల్‌గా చెక్ చేయండి ఇలా

Jio Balance: జియో బ్యాలెన్స్ సింపుల్‌గా చెక్ చేయండి ఇలా

Jio Balance: జియో బ్యాలెన్స్ సింపుల్‌గా చెక్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Jio balance check | రిలయెన్స్ జియో యూజర్లు 3 పద్ధతుల్లో సులువుగా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్, కోడ్, మైజియో యాప్ ద్వారా బ్యాలెన్స్ తెలుస్తుంది.

  • Share this:
    మీరు జియో సిమ్ వాడుతున్నారా? మీ జియో బ్యాలెన్స్ ఎంత? వేలిడిటీ ఎప్పటివరకు ఉంది? మీ ప్లాన్ గడువు ఎప్పట్లోగా ముగుస్తుంది? ఇది తెలుసుకోవడం చాలా సింపుల్. జియో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. నెంబర్ డయల్ చేసి కనుక్కోవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా మైజియో యాప్‌లో సులువుగా బ్యాలెన్స్ చూడొచ్చు. మీ డేటా లిమిట్ ఎంత? ఇప్పటి వరకు ఎంత ఉపయోగించారు? ఇంకా ఎంత డేటా మిగిలి ఉంది? మిగిలిన డేటాను ఎప్పటివరకు ఉపయోగించొచ్చు? ఇవన్నీ సులువుగా తెలుసుకోవచ్చు. మూడు పద్ధతుల్లో జియో బ్యాలెన్స్ తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది రిలయెన్స్ జియో. మరి ఏ పద్ధతిలో ఎలా బ్యాలెన్స్ చూడొచ్చో తెలుసుకోండి.

    Samsung Smartphone offers: అమెజాన్ సేల్‌లో ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

    Online Shopping Tips: ఆన్‌లైన్‌లో ఫెస్టివల్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే

    Dial: మీ ఫోన్‌లో కాల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత *333# అని టైప్ చేసి డయల్ చేయండి. డిస్‌ప్లే పైన జియో బ్యాలెన్స్ తెలుస్తుంది. మీ డ్యూయెల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లో మీరు వేర్వేరు నెట్వర్క్స్‌ని ఉపయోగిస్తున్నట్టైతే జియో సిమ్ నుంచే డయల్ చేయాలి. సిమ్ 1 లో జియో ఉంటే 1 నుంచి, సిమ్ 2 లో జియో ఉంటే 2 నుంచి డయల్ చేయాలి.

    SMS: మీరు ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీ జియో బ్యాలెన్స్, వేలిడిటీ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు అని టైప్ చేసి 55333 నెంబర్‌కు పంపించాలి. మీకు బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి.

    Samsung galaxy m51: రూ.22,499 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.3099 ధరకే... కొనండి ఇలా

    November 2020 Bank Holidays: అలర్ట్... నవంబర్‌లో బ్యాంకులకు 8 సెలవులు... ఎప్పుడెప్పుడో తెలుసుకోండి

    MyJio App: మీరు మైజియో యాప్‌లో కూడా జియో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ స్మార్ట్‌ఫోన్‌లో మైజియో యాప్ ఇన్‌స్టాల్ చేయాలి. ఆ తర్వాత మీ నెంబర్ నుంచి లాగిన్ కావాలి. హోమ్ స్క్రీన్‌పై View details పైన క్లిక్ చేయాలి. మీరు ప్రీపెయిడ్ కస్టమర్ అయితే బ్యాలెన్స్, డేటా వేలిడిటీ, ఇతర వివరాలన్నీ కనిపిస్తాయి. మీరు పోస్ట్‌పెయిడ్ కస్టమర్ అయితే మీ ప్రస్తుత ప్లాన్ వివరాలు కనిపిస్తాయి.

    భారతీయ టెలికాం రంగంలో రిలయెన్స్ జియో అతిపెద్ద టెలికాం కంపెనీ. నాలుగేళ్ల క్రితం లాంఛ్ అయిన రిలయెన్స్ జియో ప్రస్తుతం టాప్ పొజిషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జియోకు 40 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
    Published by:Santhosh Kumar S
    First published: