Home /News /technology /

FOLDABLE IPHONE MAY RELEASED IN 2023 HERE FULL DETAILS NS GH

iPhone: ఐ ఫోన్ లో ఫోల్డబుల్ మోడల్.. లాంఛింగ్ ఎప్పుడంటే..

ప్రతీకాాత్మక చిత్రం

ప్రతీకాాత్మక చిత్రం

ఫోన్లలో iPhone కథే వేరయా అని iPhone యూజర్స్ తరచూ సగర్వంగా చెప్పుకుంటారు. ప్రపంచంలోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్ తాము ఉపయోగిస్తున్నామని iPhone వాడుతున్న కస్టమర్లు భావిస్తుంటారు.

ఫోన్లలో iPhone కథే వేరయా అని iPhone యూజర్స్ తరచూ సగర్వంగా చెప్పుకుంటారు. ప్రపంచంలోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్ తాము ఉపయోగిస్తున్నామని iPhone వాడుతున్న కస్టమర్లు భావిస్తుంటారు. ఇన్నోవేషన్ కు కేరాఫ్ అయిన ఆపిల్ ఫోన్లకు గ్లోబల్ గా మంచి క్రేజ్ ఉంది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కు మారుపేరుగా మార్కెట్లో ఎదిగిన ఖరీదైన బ్రాండ్ ఐఫోన్. తాజాగా iPhone లో ఫోల్డబుల్ మోడల్ లాంచ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ బజ్ గతంలో కూడా వచ్చినప్పటికీ ఇప్పటికీ దీనిపై సంస్థ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ అధికారికంగా వెలువడలేదు. ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లంటే ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. దీంతో iPhone ఫోల్డబుల్ హ్యాండ్ సెట్ లాంఛింగ్ ఎప్పుడెప్పుడా అని అప్పుడే ఎదురుచూసే వారి సంఖ్య పెరుగుతోంది. 2023కల్లా ఈ మోడల్ ను లాంఛ్ చేసేలా iPhone సన్నద్ధమవుతోంది. ఫీచర్ల పరంగా చూస్తే దీని స్క్రీన్ 7.5-8 అంగుళాలు ఉండచ్చు. ఇది Samsung Galaxy Z Fold 2ను పోలి ఉండచ్చు. అయితే ఆపిల్ ఇంకా డిజైన్ ను మాత్రం ఫైనలైజ్ చేయలేదు కానీ ఇవన్నీ మార్కెట్లో ఉన్న అంచనాలు, విశ్లేషణలు మాత్రమే.

మొబైల్ జెయింట్స్ ఆల్రెడీ ఉన్నాయి..
ఇప్పటికే Samsung, Huawei, Motorola ఫోల్డబుల్ డివైజులను మార్కెట్లో లాంఛ్ చేశాయి కానీ ఫోల్డబుల్ మొబైల్స్ కు మార్కెట్ కూడా పెద్దగా లేదు కాబట్టి ఆపిల్ కూడా ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో విశేషం ఏమిటంటే ఫోల్డబుల్ మోడల్స్ అనగానే అవి చాలా ఖరీదైనవిగా ఉంటున్నాయి. మరోవైపు ఈ మోడల్ డిజైన్స్ పై LG, Samsung తో కలిసి Apple పనిచేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ రెండు కంపెనీలు ఏ విషయాన్ని వెల్లడించలేదు.

మేక్ ఇన్ ఇండియా..
ఇటీవల iPhone లో గతంలో ఎన్నడూ లేనన్ని మోడల్స్ చకచకా లాంఛ్ అయిపోతున్నాయి. హై ఎండ్ ఫోన్ ధర లక్షలకు చేరినా iPhoneకు గిరాకీ ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ పెరుగుతోంది. మనదేశంలో iPhone మానుఫ్యాక్చరింగ్ యూనిట్లు బెంగళూరు, చెన్నైలో రెండున్నాయి. ధరలు ఎక్కువైనప్పటికీ మనదేశంలో ఐ ఫోన్ మార్కెట్ కు ఎటువంటి ఢోకా లేదు. ఇక చైనా వద్దు, ఇండియా ముద్దు అన్న రీతిలో ఆపిల్ సంస్థ అడుగులు వేస్తోంది. చైనా-యూఎస్ సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్న ప్రస్తుత తరుణంలో చైనాకు మించి ఆపిల్ ఉత్పత్తి స్థావరాన్ని విస్తరించేందుకు ఈ తాజా చర్యలు వేగం పుంజుకున్నాయి.

తమ తయారీని ఇండియాలో విస్తరించాలనుకుంటున్నట్టు గతంలోనే యాపిల్ సంస్థ వెల్లడించింది. "మేక్ ఇన్ ఇండియా" చొరవతో ఆపిల్ వంటి దిగ్గజ సంస్థలు తక్కువ ధరకే తమ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేసేందుకు మనదేశాన్ని ఎంచుకుంటున్నాయి. చెన్నై సమీపంలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్లో ఫ్లాగ్‌షిప్‌ ఐఫోన్ 11ను పెగట్రాన్ ఉత్పత్తి చేస్తోంది. మేడ్ ఇన్ ఇండియా యూనిట్లతో పోలిస్తే దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌లపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చెన్నైలో తయారయ్యే ఐఫోన్ల ధరలు భవిష్యత్తులో దిగి రానున్నాయి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Apple, Iphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు